ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. సీఎం రాజీనామా! | chief minister resigns amidst political turmoil | Sakshi
Sakshi News home page

ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. సీఎం రాజీనామా!

Published Sun, Feb 19 2017 8:03 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. సీఎం రాజీనామా!

ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. సీఎం రాజీనామా!

న్యూఢిల్లీ/గువాహటి: సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎదురుతిరగడంతో నాగాలాండ్‌ ముఖ్యమంత్రి టీఆర్‌ జెలియాంగ్‌ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన గిరిజన గ్రూపులకు మద్దతుగా ఎన్‌పీఎఫ్‌ ఎమ్మెల్యేలు సీఎం జెలియాంగ్‌కు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు జెలియాంగ్‌ ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఎన్పీఎఫ్‌ పార్టీ శాసనసభ్యుల సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారని తెలిపారు.

నాగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో ఎన్పీఎఫ్‌ సభ్యులంతా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కేటాయించాలన్న సీఎం జెలియాంగ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగాలాండ్‌ గిరిజన యాక‌్షన్‌ కమిటీ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వడం తమ సంప్రదాయానికి విరుద్ధమంటూ గిరిజన గ్రూపులు ఆందోళనకు దిగడంతో నాగాలాండ్‌ గతకొన్నిరోజులుగా రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్పీఎఫ్‌ ఎమ్మెల్యేలు కూడా గిరిజన గ్రూపులకు మద్దతు పలుకడంతో టీఆర్‌ జెలియాంగ్‌ సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement