హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ (ఫైల్ ఫొటో)
Ranji Trophy- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: రంజీ ట్రోఫీ- 2024 ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. నాగాలాండ్‌తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది.
తన్మయ్, తిలక్ సెంచరీలు
ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (192 బంతుల్లో 164; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ తిలక్ వర్మ (135 బంతుల్లో 101; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. రోహిత్ రాయుడు (59; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్‌కు 143 పరుగులు... తన్మయ్, తిలక్ మూడో వికెట్‌కు 155 పరుగులు జోడించారు.
462 డిక్లేర్డ్
ఇక రాహుల్ సింగ్ (5), రవితేజ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కె.నితీశ్ రెడ్డి 26, ప్రజ్ఞయ్ రెడ్డి 47 పరుగులు సాధించగా.. తనయ్ త్యాగరాజన్ 22 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 107 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత 8 వికెట్ల నష్టానికి 462 పరుగుల హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సాకేత్ 3, కార్తికేయ 12 పరుగులతో అజేయంగా నిలిచారు.
ఈ క్రమంలో శనివారం బ్యాటింగ్ మొదలుపెట్టిన నాగాలాండ్‌కు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. 60.1 ఓవర్లలోనే నాగాలాండ్ ఆట కట్టించారు. తనయ్ త్యాగరాజన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. రవితేజ రెండు, సాకేత్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
206 పరుగులకే ఆలౌట్ చేసి.. ఫాలో ఆన్
నాగాలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జోషువా ఒజ్కుమ్ అర్ధ శతకం(50)తో రాణించగా.. కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ 41, జగనాథ్ సినివాస్ 44, సుమిత్ కుమార్ 38 పరుగులు చేశారు. మిగతావాళ్లలో ఒక్కరు కూడా కనీసం 12 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు.
ఈ క్రమంలో 206 పరుగులకే నాగాలాండ్ ఆలౌట్ కాగా.. హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో నాగాలాండ్‌ను ఫాలో ఆన్ ఆడించేందుకు హైదరాబాద్ మొగ్గు చూపింది. ఫలితంగా మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన నాగాలాండ్ శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్ జట్టు మళ్లీ ఎలైట్ డివిజన్‌కు అర్హత సాధిస్తుంది.
చదవండి: Ind vs Eng: గాయమా? నో ఛాన్స్.. అందుకే అయ్యర్‌పై వేటు! ఇప్పట్లో నో ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment