నాగాలాండ్: ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని నాగాలాండ్‌లోని గ్రామస్తులు మరోసారి నిరూపించారు. గ్రామస్తులు తలో చేయి వేసి ఏకంగా ఓ గుడిసెను ఓ చోటు నుంచి మరో చోటుకి తరలించారు. గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గుడిసె నాలుగు దిక్కుల్లోని పునాదులను పైకి లేపి కాలి నడకనే గుడిసెను నూతన గమ్యానికి చేర్చారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుధా రామన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐకమత్యమే మహా బలమని ఈ నాగాలు మరోసారి నిరూపించారంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతోంది. పోస్ట్ చేసిన గంటలోనే ఏకంగా 9000 వ్యూవ్స్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Yet another video where the Nagas show us that Unity is strength!
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) February 5, 2021
House shifting in progress at village in Nagalandpic.twitter.com/XUGhiEGNe7
Comments
Please login to add a commentAdd a comment