Nagaland Viral Video: Hundreds Of Villagers Pulled Truck Out Of Deep Gorge - Sakshi

వైరల్‌ వీడియో : యూనిటీ పవర్‌ ఏంటో చూపించారు

Jan 11 2021 5:01 PM | Updated on Jan 11 2021 6:59 PM

Viral Video Of The Power Of Team Work At Nagaland - Sakshi

నాగాలాండ్‌ : ఐకమత్యం ఉంటే ఎంతటి అసాధ్యం అయినా సుసాధ్యం అవుతుంది. నాగాలాండ్‌లో జరిగిన ఓ సంఘటన  సరిగ్గా దీనికి అద్దం పడుతుంది. వివరాల ప్రకారం..నాగాలాండ్‌లోని ఓ లోయలో ప్రమాదవశాత్తూ ఓ లారీ పడిపోగా పెద్ద పెద్ద  ప్రొక్లెయిన్లతో లారీని బయటకు లాగేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో వందలాది మంది అక్కడికి వచ్చి ఆ లారీని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. వాహనానికి ఇరువైపులా తాళ్లు కట్టి ఎంతో శ్రమతో దాన్ని బయటకు లాగి ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయవచ్చు అని నిరూపించారు. ఈ వీడియోను సుప్రియా సాహూ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్​లో పోస్ట్‌ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. టీం వర్క్‌ పవర్‌ ఏంటో నిరూపించారు అంటూ పలువురు నెటిజన్లు నాగాలాండ్‌ వాసులను అభినందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement