కాంగ్రెస్ అగ్రనేత, వయినాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ కొనసాగుతోంది. నాగాలాండ్ రాజధాని కోహిమాలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ కార్యక్రమమని దుయ్యబట్టారు.
బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), బీజేపీ జనవరి 22న జరిపే రామ మందిర ప్రారంభోత్సం పూర్తిగా నరేంద్ర మోదీ రాజకీయ కార్యక్రమమని మండిపడ్డారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం కాబట్టి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రామ మందిర కార్యక్రమానికి హాజరు కావటం లేదని ప్రకటించినట్లు గుర్తుచేశారు. తమకు అన్ని మతాలపై విశ్వాసం ఉందని, అన్ని మతాలను అంతే సమానంగా ఆచరిస్తామని పేర్కొన్నారు.
హిందు మతాన్ని పాటిస్తూ ఉన్నత స్థానంలో మతాచార్యులు సైతం రామ మందిర ప్రారంభ ఉత్సవాన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ పనిగట్టుకొని రాజకీయం కోసమే రామ మందిర ప్రారంభోత్సవం నిర్వహించటం సరికాదన్నారు. అటువంటి రాజకీయ ప్రారంభోత్సవానికి హాజరుకావద్దని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
చదవండి: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా షర్మిల.. నియమించిన కాంగ్రెస్ హైకమాండ్
Comments
Please login to add a commentAdd a comment