భారత సంతతి వ్యక్తికి భారీ జరిమానా | Heavy penalty to Indian descent | Sakshi
Sakshi News home page

భారత సంతతి వ్యక్తికి భారీ జరిమానా

Published Thu, Jun 1 2017 2:39 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

Heavy penalty to Indian descent

న్యూయార్క్‌: అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా పనిచేసే ఓ కంపెనీలో సీఓఓ (చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌)గా విధులు నిర్వర్తించే భారత సంతతి వ్యక్తి మోసం ఆరోపణలపై అక్కడి ప్రభుత్వానికి 7.5 లక్షల డాలర్లను చెల్లించేందుకు అంగీకరించారు. ‘ఫ్రీడమ్‌ హెల్త్‌’  సంస్థ వివిధ అక్రమ మార్గాల్లో అమెరికా ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున సొమ్ము కాజేసింది. ఇదే కంపెనీకి సిద్ధార్థ పగిడిపాటి సీఓఓగా ఉన్నారు.

ఈ కంపెనీ 2008–2013 మధ్య ప్రభుత్వానికి నకిలీ పత్రాలు ఇచ్చి రీయింబర్స్‌మెంట్‌ రూపంలో భారీ మొత్తంలో సొమ్ము పొందింది. మోసాన్ని ప్రభుత్వం గుర్తించడంతో వారికి ఇచ్చిన సొమ్మును వెనక్కు రాబడుతోంది. ఆరోపణలను తొలగించుకునేందుకు ఈ కంపెనీ మొత్తం 3.25 కోట్ల డాలర్లను ప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించింది. అలాగే సిద్ధార్థ కూడా ఏడున్నర లక్షల డాలర్లను జరిమానాగా చెల్లించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement