లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాదంలో ఇరుకున్నారు. దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని నివాసం ఉన్న డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన ఓ పార్టీ వ్యవహారానికి సంబంధించిన కేసులో పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన లేఖను పంపించారు. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు గాను ఆయనకు వారం రోజుల గడువు విధించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది.
అయితే, కోవిడ్ వ్యాప్తి కారణంగా బ్రిటన్‌లో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాగా, లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో డౌనింగ్ స్ట్రీట్ నంబర్ 10లో మందు పార్టీలు జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ పార్టీలకు అధికార పార్టీకి చెందినవారు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రధాని దంపతులతోపాటు దాదాపు 50 మందికి పోలీసులు పలు ప్రశ్నలను సంధిస్తూ లేఖలు పంపారు.
ఇదిలా ఉండగా ఈ విషయంపై పలువురు మాజీ నేతలు జాన్సన్పై విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను ప్రధాని ఉల్లంఘిస్తే ఆయన జరిమానాను ఎదుర‍్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ మాజీ నేత ఐయాన్డంకన్ స్మిత్ మాట్లాడుతూ.. ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన పదవిలో కొనసాగడం కష్టమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment