ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: పెంపుడు కుక్కలను యజమానులు రోడ్ల మీద, పార్కులకు, చెరువు గట్లకు వాకింగ్‌కు తీసుకెళ్లడం, అవి ఇతరుల మీద పడి కరవడం, ఆ తరువాత గొడవలు జరగడం వంటివి తరచూ సంభవిస్తున్నాయి. ఈ తరహా గొడవలకు అడ్డుకట్ట వేసేలా బెంగళూరు పాలికె కొత్తగా 7 నిబంధనలను జారీచేసింది.
ఈ నిబంధనలు తప్పనిసరి..
- పెంపుడు కుక్కలకు రేబీస్ వ్యాక్సిన్ తప్పనిసరి. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు వాకింగ్‌కు వెళ్లరాదు. నిర్ణీత సమయంలోనే తీసుకెళ్లాలి.
- చెరువుల వద్ద వాకింగ్ చేసేటప్పుడు కుక్కల నోటికి బుట్టను అమర్చాలి.
- బయట వాకింగ్ సమయంలో కుక్కలు కాలకృత్యాలు చేస్తే యజమాని శుభ్రపరచాలి. లేదంటే రూ.500 జరిమానా కట్టాలి.
- చెరువుల వద్ద వాకింగ్ సమయంలో వాటికి ఆహారం వేయరాదు.
- రాట్‌వీలర్, జర్మన్ షెఫర్డ్స్, పిట్‌బుల్, డాబర్‌మేన్, గ్రేట్‌డేన్ శునకాలను చెరువుల వద్దకు తీసుకు రాకూడదు.
వాగ్వాదాలు పెరగడం వల్లనే..
నగరంలో శునకాలను పెంచుకోవడం ప్రతిష్టకు చిహ్నంగా మారింది. ఎంత ఖరీదైన కుక్క ఉంటే అంత గొప్పగా భావిస్తారు. తమతో పాటు వాకింగ్‌కు వెంట కుక్కలను తీసుకెళ్లడం ఫ్యాషన్‌గా మారింది. అనేక ఏళ్లు నుంచి ప్రజలు, పెంపుడు కుక్కల యజమానుల మధ్య గొడవలు ఏర్పడుతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని బీబీఎంపీ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది.
చదవండి: Chennai: అదే జరిగితే మరో 80 ఏళ్లలో చెన్నై, తూత్తుకుడి..
Comments
Please login to add a commentAdd a comment