Pets owners
-
ఆకాశ ఎయిర్ ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!
సాక్షి, ముంబై: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్‌ఝన్ వాలాకు చెందిన దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ పెట్ లవర్స్‌కు శుభవార్త అందించింది. త్వరలోనే తమ విమానాల్లో పెట్స్ తో సహా ప్రయాణించే వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించనుంది. ఆకాశ ఎయిర్‌లైన్స్ తాజా ప్రకటన ప్రకారం ఈ ఏడాది నవంబరు 1 నుంచి తన విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించనుంది. దీనికి సంబంధించిన బుకింగ్‌లు అక్టోబరు 15నుంచి ప్రారంభం కానున్నాయి. ఒక వ్యక్తికి 7 కిలోల వరకు బరువు ఉన్న ఒక పెంపుడు జంతువును అనుమతిస్తామని విమానయాన సంస్థ తెలిపింది. "పెంపుడు జంతువుల పాలసీకి సంబంధించి ఇది తొలి అడుగు అని, ప్రస్తుతం పెంపుడు పిల్లులు , కుక్కలను అనుమతిస్తాం త్వరలోనే మరింత విస్తరిస్తామని’’ సంస్థ ప్రకటించింది. ఎయిర్‌లైన్‌లో ప్రస్తుతం 6 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని, ప్రతి 15 రోజులకు ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను జోడిస్తున్నామని ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు , సీఈఓ వినయ్ దూబే తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 18 విమానాలు, రానున్న అయిదేళ్లలో 72 విమానాల అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. దీంతో పెట్ లవర్స్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. Oh yayyy! https://t.co/8mrwX3Hyso — Chinmayi Sripaada (@Chinmayi) October 6, 2022 -
శునకాలతో వాకింగా?.. ఈ రూల్స్ తప్పనిసరి
సాక్షి, బెంగళూరు: పెంపుడు కుక్కలను యజమానులు రోడ్ల మీద, పార్కులకు, చెరువు గట్లకు వాకింగ్‌కు తీసుకెళ్లడం, అవి ఇతరుల మీద పడి కరవడం, ఆ తరువాత గొడవలు జరగడం వంటివి తరచూ సంభవిస్తున్నాయి. ఈ తరహా గొడవలకు అడ్డుకట్ట వేసేలా బెంగళూరు పాలికె కొత్తగా 7 నిబంధనలను జారీచేసింది. ఈ నిబంధనలు తప్పనిసరి.. పెంపుడు కుక్కలకు రేబీస్ వ్యాక్సిన్ తప్పనిసరి. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు వాకింగ్‌కు వెళ్లరాదు. నిర్ణీత సమయంలోనే తీసుకెళ్లాలి. చెరువుల వద్ద వాకింగ్ చేసేటప్పుడు కుక్కల నోటికి బుట్టను అమర్చాలి. బయట వాకింగ్ సమయంలో కుక్కలు కాలకృత్యాలు చేస్తే యజమాని శుభ్రపరచాలి. లేదంటే రూ.500 జరిమానా కట్టాలి. చెరువుల వద్ద వాకింగ్ సమయంలో వాటికి ఆహారం వేయరాదు. రాట్‌వీలర్, జర్మన్ షెఫర్డ్స్, పిట్‌బుల్, డాబర్‌మేన్, గ్రేట్‌డేన్ శునకాలను చెరువుల వద్దకు తీసుకు రాకూడదు. వాగ్వాదాలు పెరగడం వల్లనే.. నగరంలో శునకాలను పెంచుకోవడం ప్రతిష్టకు చిహ్నంగా మారింది. ఎంత ఖరీదైన కుక్క ఉంటే అంత గొప్పగా భావిస్తారు. తమతో పాటు వాకింగ్‌కు వెంట కుక్కలను తీసుకెళ్లడం ఫ్యాషన్‌గా మారింది. అనేక ఏళ్లు నుంచి ప్రజలు, పెంపుడు కుక్కల యజమానుల మధ్య గొడవలు ఏర్పడుతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని బీబీఎంపీ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. చదవండి: Chennai: అదే జరిగితే మరో 80 ఏళ్లలో చెన్నై, తూత్తుకుడి.. -
శునకంతో ఆరోగ్యానికి శుభ శకునం..
లండన్ : పెంపుడు జంతువులతో సహవాసం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని పలు పరిశోధనలు వెల్లడించగా..తాజాగా కుక్కను పెంచుకుంటే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు. శునకంతో చెలిమి చేస్తే దానితో పాటు పరిగెత్తడం, పచ్చిక బయళ్లలో విహరించడం చేస్తారని ఇది గుండెకు మేలు చేకూరుస్తుందని చెబుతున్నారు. కుక్క యజమానులు మంచి ఆహారం తీసుకుంటారని వీరికి డయాబెటిస్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుందని తాజా అథ్యయనం పేర్కొంది. చురుకైన జీవనశైలి, మంచి ఆహారంతో హృదయ ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. 24 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసున్న దాదాపు 2000 మందిపై జరిపిన పరిశోధనలో కుక్క సహా పెంపుడు జంతువులతో కాలక్షేపం చేసేవారిలో ఇతరుల కంటే రక్తపోటు, మధుమేహం, కొవ్వు శాతం తక్కువగా ఉండి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు వెల్లడైందని సెయింట్‌యాన్స్ యూనివర్సిటీ ఆస్పత్రి చేపట్టిన అథ్యయనం తెలిపింది.పెంపుడు జంతువులు లేని వారితో పోలిస్తే వీరికి మంచి కొలెస్ర్టాల్ అధికంగా ఉండటంతో పాటు మధుమేహం లేకపోవడాన్ని గుర్తించామని అథ్యయనానికి నేతృత్వం వహించిన రచయిత అండ్రియా మగెరి చెప్పారు. పెంపుడు జంతువులు కలిగిన వారిలో ఎక్కువగా శారీరక కదలికలు, మెరుగైన ఆహారం, సరైన స్ధాయిలో మధుమేహం ఉండటం కనిపిస్తోందని వెల్లడించారు. -
పెట్స్ స్పాట్
ఛీ.. కుక్క బతుకు అని తిట్టే వాళ్లు.. ఈ శునకాల రాజసం చూస్తే.. ఆ తిట్టు ఇక తిడితే ఒట్టు. తమ పెట్స్‌ను ముస్తాబు చేయడానికి ప్రత్యేక సెలూన్‌కు తీసుకెళ్తున్నారు పెట్స్ యజమానులు. వారానికో, నెలకో ఓసారి వాటిని కేర్ సెంటర్‌కు తీసుకెళ్లి ఆపాదమస్తకం అందంగా తీర్చిదిద్దుతున్నారు. క్లాస్ సెలూన్లో హెయిర్ కట్ చేస్తారు.. ఫేషియల్.. బాడీ మసాజ్ వంటి సదుపాయాలన్నీ ఉంటాయి. మనుషులకైతే ఓకే.. పెంపుడు కుక్కలకు.. పిల్లులకు.. కుందేళ్లకు.. గునియా పిగ్స్.. బర్డ్స్‌కు కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో వాళ్లందరికీ ప్రేమ పంచే పెట్స్‌పై వాటి యజమానులూ అంతే ప్రేమను చూపిస్తున్నారు. కాస్త ఉన్నవాళ్లయితే.. తమ పెంపుడు జంతువులను తమకన్నా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇలాంటి వారికి వరంగా మారాయి పెట్స్ కేర్ సెంటర్స్. కంప్లీట్ పెట్స్ కేర్ పెట్స్‌కు హెయిర్ సెట్టింగ్, నెయిల్స్ కటింగ్, స్నానం చేయించే సెలూన్స్ సిటీలో చాలానే ఉన్నాయి. పెట్ కేర్ సెంటర్స్‌లో వాటిని అందంగానే కాదు ఆరోగ్యంగా చూసుకునే సదుపాయాలు ఉన్నాయి. శునకాలకు స్పా (బాడీ మసాజ్) చేసే చాయిస్ ఉంటుంది. అంతేనా వాటి మనసుకు ఆహ్లాదపరిచే విధంగా ప్రత్యేకంగా అరోమా థెరపీ కూడా ఇస్తున్నారు పెట్ సెంటర్స్ నిర్వాహకులు. డిఫరెంట్ ఫ్లేవర్ స్ప్రే చేసిన రూమ్‌లో లైట్ మ్యూజిక్ ప్లే చేస్తూ.. వాటికి ఆనందాన్ని కల్పిస్తున్నారు. అరోమా థెరపీ అంటే కుక్కలు తెగ ఆసక్తి కనబరుస్తున్నాయి కూడా. మేకప్ అదరహో ఒత్తుగా జుట్టు ఉండే కుక్కలకు పెట్ కేర్ సెంటర్స్‌లో ప్రత్యేకంగా హెయిర్ రిమూవ్ చేయడంతో పాటు టిక్ రిమూవల్ (పేన్లు తీసివేయడం) కూడా చేస్తున్నారు. పెట్స్ కు పిలకలు కట్టి.. మంచి మంచి బట్టలు చుట్టి.. అదిరేటి లుక్ ఇస్తున్నారు. యాక్సరీస్, చెయిన్స్ ఫినిషింగ్ ఇవ్వడంతో శునకాల్లో రాజసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీటి కోసం ప్రత్యేకంగా రెసిపీస్ కూడా ఉన్నాయి. ఈ రెసిపీస్ ఎలా చేయాలో కూడా యజమానులకు వివరిస్తున్నారు. ఈ పెట్స్ కేర్ కోసం ఉపయోగించే ప్రొడక్ట్స్ ప్రత్యేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పార్టీ అండ్ రిటర్న్ గిఫ్ట్ కుక్కలకు, ఇతర పెట్స్‌కు సరదాగా బర్త్ డే పార్టీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పార్టీకి వచ్చిన అతిథులకు (ఇవీ పెట్సే) రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఆ పార్టీలో ఫుల్ మ్యూజిక్‌లో తెగ ఎంజాయ్ చేస్తాయి. ప్రవర్తన, యాక్టివ్నె స్ను బట్టి వాటికి గ్రేడింగ్ (స్పెషల్ ట్రీట్స్, కుక్కీస్, పేస్ట్రీస్) కూడా ఇస్తున్నారు. ఇవి ఆడుకునేందుకు బొమ్మలు కూడా ఉంటాయి. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అనారోగ్యంతో వచ్చిన పెట్స్ కేర్ కోసం ఇక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పెట్స్‌కు అందించే సేవలను బట్టి రూ.50 నుంచి రూ.5,000 వరకు చార్జ్ చేస్తున్నారు. పిల్లులే డేంజర్ కుక్కలు కాస్త కుదురుగా ఉన్నా.. పిల్లుల విషయంలో జాగ్రత్త తప్పని సరి. అవి ఒక్కచోట ఉండవు. పైగా కోపం ఎక్కువ. స్నానం చేయించేటప్పుడు.. హెయిర్ రిమూవ్ చేస్తున్నప్పుడు గీరడానికి ప్రయత్నిస్తుంటాయి. గ్లవ్స్ వేసుకుని వీటిని జాగ్రత్తగా టాకిల్ చేయాల్సి ఉంటుంది. పిల్లుల కేర్ విషయంలో చార్జెస్ ఎక్కువగా తీసుకుంటాం. - అదితి నెయిల్స్ అండ్ టెయిల్స్ పెట్స్ కేర్ సెంటర్