సాక్షి, న్యూఢిల్లీ : స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. స్టార్టప్‌లు పన్ను మినహాయింపులు పొందేందుకు ఏంజెల్ ఇన్వెస్టర్లతో కలుపుకుని పెట్టుబడి పరిమితిని ప్రస్తుతమున్న రూ 10 కోట్ల నుంచి రూ 25 కోట్లకు పెంచింది. ఐటీ చట్టం,1961, సెక్షన్ 56(2) కింద పన్ను మినహాయింపులకు ఆయా సంస్థల్లో పెట్టుబడి పరిమితిని పెంచే ప్రక్రియను త్వరలో ప్రభుత్వం వెల్లడిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
పన్ను రాయితీలు పొందేందుకు అవసరమైన నిబంధనలను సరళీకరిస్తూ నోటిపికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. ఏదేని సంస్థ ప్రారంభించిన ఏడేళ్ల వరకూ ఇచ్చే స్టార్టప్ హోదాను ప్రస్తుతం పదేళ్ల వరకూ పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు స్టార్టప్‌ల వార్షిక టర్నోవర్ పరిమితిని ప్రస్తుతమున్న రూ 25 కోట్ల నుంచి రూ 100 కోట్లకు పెంచారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment