CoronaVirus Lockdown in India: Center Releases New Guidelines to Fight Aginst Covid-19 | లాక్‌డౌన్‌, పాటించాల్సిన కొత్త రూల్స్ - Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ : పాటించాల్సిన కొత్త రూల్స్

Published Wed, Apr 15 2020 10:21 AM | Last Updated on Wed, Apr 15 2020 5:16 PM

Centre Releases New Guidelines For Extended Lockdown - Sakshi

న్యూఢిల్లీ : మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్రం.. అందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. థియేటర్లు, మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, బార్లు మూసివేయనున్నట్టు తెలిపింది. అయితే ఏప్రిల్‌ 20 తర్వాత మాత్రం కొన్ని రంగాలకు కేంద్రం సడలింపులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ సంబంధిత అన్ని కార్యక్రమాలను కొనసాగించవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌ షాపింగ్ ద్వారా నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతిచ్చింది. బ్యాంకుల కార్యకలాపాలు యథాతథంగా కొనసాగనున్నట్ట చెప్పింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు అనుమతి కల్పించింది.

అయితే కరోనా హాట్‌స్పాట్‌లలో మాత్రం ఈ మార్గదర్శకాలు వర్తించవని తెలిపింది. అక్కడ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. హాట్‌స్పాట్‌లను ప్రకటించే అధికారం రాష్ట్రాలదేనని తెలిపింది. హాట్‌స్పాట్‌లలో ఎటువంటి జనసంచారం ఉండకూడదని తెలిపింది. హాట్‌స్పాట్‌లలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది. ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఫేస్‌ మాస్క్‌లను ధరించడం తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది.

కొత్త మార్గదర్శకాలు.. 

  • కాఫీ, తేయాకు తోటల్లో 50 శాతం మ్యాన్‌పవర్‌కు అనుమతి
  • రాష్ట్ర సరిహద్దులు దాటేందకు వ్యక్తులను అనుమతి నిరాకరణ
  • అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
  • జాతీయ ఉపాధిహామీ పనులకు అనుమతి
  • ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి
  • రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి
  • విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు దుకాణలకు అనుమతి 
  • వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి
  • అనాథ, దివ్యాంగ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి
  • భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు
  • నిర్మాణ రంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులకు మాత్రమే అనుమతి
  • రాజకీయ సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం 
  • వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి

చదవండి : కరోనా : 11 వేలు దాటిన కేసులు.. 377 మంది మృతి

లాక్‌డౌన్‌ పొడిగింపు; రైల్వేకు దెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement