సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎవరికి చేయాలనే దానిపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పరిస్థితిని బట్టి ఇప్పటివరకూ నాలుగు దఫాలుగా మార్గదర్శకాలు ఇచ్చిన ఐసీఎంఆర్ సోమవారం ఐదోసారి సవరించిన గైడ్‌లైన్స్‌ను ఇచ్చింది. ఇందులో భాగంగా 8 రకాల కేటగిరీల వాళ్లకు విధిగా ఆర్‌టీ–పీసీఆర్ (రియల్ టైమ్ పల్మనరీ చైన్ రియాక్షన్) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను అనుసరించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
8 కేటగిరీల్లో ఎవరెవరు?
► ఐఎల్‌ఐ (ఫ్లూ లక్షణాలు ఉన్న) వాళ్లకు.. వ్యక్తిగతంగా గానీ, అంతర్జాతీయ ప్రయాణం చేసిన వారికి(14 రోజుల్లో).
► కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయిన ఐఎల్‌ఐ లక్షణాలు ఉన్నవారికి.
► ఆస్పత్రుల్లో పనిచేస్తూ ఐఎల్‌ఐ లక్షణాలున్న వారు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో సంబంధం ఉన్నవారు.
► తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్)తో బాధపడుతున్నవారు.
► ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోయినా(అసింప్టమాటిక్) హైరిస్క్ పాజిటివ్ కేసులతో సంబంధం ఉన్నవారు లేదా టెస్టు చేసిన తర్వాత కరోనాగా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయినవారు. æ హాట్‌స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లలో వైరస్ లక్షణాలున్న అందరికీ.
► ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందుతూ ఐఎల్‌ఐ లక్షణాలు కనిపించిన వారికి.
► ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో జ్వరం లేదా జలుబు లక్షణాలున్నా... ఐఎల్‌ఐ లక్షణాలు కనిపించిన వారికి. æ కరోనా నిర్ధారణ పరీక్ష చేయలేదన్న కారణంతో ప్రసవాలు లాంటి అత్యవసర సేవలను వాయిదా వేయరాదు.
8 కేటగిరీల వారికే కరోనా టెస్టులు
Published Tue, May 19 2020 4:16 AM | Last Updated on Tue, May 19 2020 4:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment