ముంబై: ఖాతాాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడానికి సంబంధించి సవరించిన కొత్త మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ త్వరలో ప్రకటించనుంది. ఫ్రాడ్ వర్గీకరణ మార్గదర్శకాల అంశంపై పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ముకేశ్ జైన్ ఈ విషయాలు తెలిపారు.
ఎగవేతదారును ఫ్రాడ్‌గా ముద్ర వేసే ముందు వారు తమ వాదనలను వినిపించేందుకు అవకాశం కల్పించేలా బ్యాంకులు సహజ న్యాయ సూత్రాలను పాటించాలంటూ బ్యాంకులకు సుప్రీం కోర్టు ఇటీవల ఓ కేసులో స్పష్టం చేసిన నేపథ్యంలో జైన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment