మరింత చేరువగా గ్రీన్‌ ఎనర్జీ | APERC new guidelines to promote renewable electricity | Sakshi
Sakshi News home page

మరింత చేరువగా గ్రీన్‌ ఎనర్జీ

Published Fri, Jun 14 2024 4:35 AM | Last Updated on Fri, Jun 14 2024 4:35 AM

APERC new guidelines to promote renewable electricity

పునరుత్పాదక విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు ఏపీఈఆర్‌సీ కొత్త మార్గదర్శకాలు

సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఈఆర్‌సీ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జ­ల విద్యుత్‌ వంటి గ్రీన్‌ ఎనర్జీని వినియోగదా­రు­లకు మరింత చేరువ చేసేందుకు, ఉత్పత్తిని ప్రోత్స­హించేందుకు, విద్యుత్‌ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్‌ ఎనర్జీ ఓపెన్‌ యాక్సెస్, చార్జీలు, బ్యాంకింగ్‌ నిబంధనలను ఏపీఈఆర్‌సీ ‘నియంత్రణ’ పేరుతో రూ­పొందించింది. 

గతేడాది డ్రాఫ్ట్‌ రూపంలో తీసు­కువ­చ్చి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న ఏపీఈ­ఆర్‌సీ... వీటికి ఆమోదం తెలిపింది. దేశంలో 2070­కి కర్భన ఉద్గారాలను నెట్‌జీరో స్థాయికి తీసు­కురా­వాలని, ఇందుకోసం 2030కి 500 గిగా­వాట్ల పున­రుత్పాదక విద్యుత్‌ సా­మ­ర్థ్యాన్ని నెలకొ­ల్పా­ల­న్న కేం­ద్రం లక్ష్యానికి కూడా ఈ ని­బంధనలు దోహ­దపడతాయని ఏపీ­ఈఆర్‌సీ పేర్కొంది. రెన్యూవ­బుల్‌ ఎనర్జీ సో­ర్సెస్‌ నుంచి ఉ­త్ప­త్తి అయిన విద్యు­త్‌ను ఓపెన్‌ యాక్సెస్‌ చేయ­డానికి, ఇంట్రా–స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌­లు, డిస్కంలకు ఈ ‘నియంత్రణ’ వర్తిస్తుంది.

ఇవీ నిబంధనలు... 
»  గ్రీన్‌ ఎనర్జీ నూతన నిబంధనల ప్రకారం ఓపెన్‌ యాక్సెస్‌ను పొందడానికి దివాలా తీసిన, డిస్కంలకు రెండు నెలలు కంటే ఎక్కువకాలం బకాయిలు ఉన్న, అనధికారికంగా విద్యుత్‌ వినియోగం, విద్యుత్‌ దొంగతనం కేసు పెండింగ్‌లో ఉన్న సంస్థలకు అర్హత లేదు. 
»    అర్హులైన వారికి స్వల్పకాలిక గ్రీన్‌ ఎనర్జీ ఓపెన్‌ యాక్సెస్‌ను మంజూరు చేయడానికి (ఏపీఎస్‌­ఎల్‌డీసీ) నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. 
»   దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్‌ ఎనర్జీ ఓపెన్‌ యా­క్సెస్‌ మంజూరు కోసం ఏపీ ట్రాన్స్‌కో నోడల్‌ ఏజెన్సీగా ఉంటుంది. గ్రీన్‌ ఎనర్జీ ఓపెన్‌ యాక్సె­స్‌కు అన్ని దరఖాస్తులు నేరుగా రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీలకు సింగిల్‌ విండో ద్వారా వెళతాయి.
»   సెంట్రల్‌ నోడల్‌ ఏజెన్సీ పోర్టల్‌లో గ్రీన్‌ ఎనర్జీ ఓపెన్‌ యాక్సెస్‌కు సంబంధించిన మొత్తం çస­మా­చారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అన్ని కొత్త గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలు­(జనరేటర్ల)కు కనెక్టివిటీ మంజూరు చేస్తారు.
»  ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, ఉత్తత్పి సంస్థలు, ఒప్పందాలు, ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్‌ యాక్సెస్‌ను పొందడం కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాల్లో పేర్కొన్న విధంగానే చార్జీలు వర్తిస్తాయి.
»   గ్రీన్‌ ఎనర్జీ ఓపెన్‌ యాక్సెస్‌ కోసం ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు, వీలింగ్, క్రాస్‌ సబ్సిడీ సర్‌­చార్జీలు, స్టాండ్‌బై చార్జీలు, బ్యాంకింగ్, రియాక్టివ్‌ ఎనర్జీ చార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు.
»  2032 డిసెంబర్‌ లోగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్‌ యాక్సెస్‌లో వినియోగ­దారులకు సరఫరా చేసే ఆఫ్‌షోర్‌ విండ్‌ ప్రాజెక్ట్‌­ల నుంచి జరిగే విద్యుత్‌ ఉత్పత్తికి అదనపు సర్‌చార్జ్‌ వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యస్థ కాల­వ్యవధిలో గ్రీన్‌ ఎనర్జీ ఓపెన్‌ యాక్సెస్‌ కోసం ప్రాసెసింగ్‌ ఫీజు రూ.లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. బ్యాంకింగ్‌ నెలవారీ బిల్లింగ్‌ సైకిల్‌ ఆధారంగా ఉండాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement