Joint ventures
-
చైనా మొబైల్ కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశంలో కార్యకలాపాలు నిర్వహించే చైనా మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్ర సర్కారు స్పష్టమైన మార్గదర్శనం చేసింది. భారత్‌లో విక్రయాలకు, భారత్ నుంచి ఎగుమతుల కోసం మొబైల్ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఇక్కడే తయారు చేయాలని, భారతీయ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించాలని కోరినట్టు తెలిసింది. భారత్‌లో కార్యకలాపాలకు స్థానిక భాగస్వాములను చేర్చుకోవాలని కోరింది. కేంద్రం నిర్వ హించిన సమావేశానికి హాజరైన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు ఈ వివరాలను మీడియాతో పంచుకోవడం వల్ల బయటకు తెలిసింది. అంతేకాదు సదరు జా యింట్ వెంచర్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులనే నియమించుకోవాలని కూడా కోరింది. సీఈవో, సీవోవో, సీఎఫ్‌వో, సీటీవో తదితర స్థానాలకు భారతీయులను తీసుకోవాలని ఆదేశించింది. భారత కాంట్రాక్టు తయారీ సంస్థలను నియమించుకోవాలని, స్థానికంగానే విడిభాగాల తయారీని కూడా చేపట్టాలని కూడా కోరింది. ప్రస్తుతం చైనీ సంస్థలు ఇక్కడ అసెంబ్లింగ్ వరకే చేస్తుండడం గమనార్హం. విడిభాగాల తయారీని కూడా భారత భాగస్వామ్య సంస్థలతో కలసి చేపట్టి, ఇక్కడి నుంచి మరిన్ని ఎగుమతులు చేయాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పంపిణీదారులు కూడా స్థానికులే ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు చైనా డి్రస్టిబ్యూటర్లను కలిగి ఉన్నాయి. భారత చట్టాలను విధిగా అనుసరించాలని, పన్ను ఎగవేతలకు పాల్పడరాదని తేల్చి చెప్పింది. చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, రియల్మీ, వివోతోపాటు, ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ)కు ఇటీవలి సమావేశంలో కేంద్రం ఈ మేరకు సూచనలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సమావేశాన్ని నిర్వ హించింది. ఇది నిజమేనన్నట్టు.. దేశీ కాంట్రాక్టు తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్‌తో షావోమీ ఒ ప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. భారత్‌లో మొబైల్ ఫోన్లను తయారు చేసి ఇవి ఎగుమతి చేయనున్నాయి. మరికొన్ని సంస్థలతోనూ ఇదే విధమైన భాగస్వామ్యంపై డిక్సన్ చర్చలు నిర్వహిస్తుండడం గమనార్హం. -
ఎఫ్ఐఈవో, బిజినెస్ రష్యా ఎంవోయూ
న్యూఢిల్లీ: భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో), బిజినెస్ రష్యాతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో ప్రోత్సాహం ఇచ్చిపుచ్చుకోనున్నట్టు తెలిపింది. రష్యా వ్యాపార మండలి, ఎఫ్ఐఈవో సంయుక్తంగా ఎగ్జిబిషన్లు, కొనుగోలుదారులు–విక్రయదారుల సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు ఏర్పాటు చేయడంతోపాటు, జాయింట్ వెంచర్ల ఏర్పాటు విషయంలో తమ దేశ సంస్థలకు సహకారం అందించనున్నాయి. ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 50 మంది భారత ప్రతినిధుల బృందం మాస్కో పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ కుదిరింది. రెడీ టూ ఈట్ మీల్స్, ఫిష్ మీల్, జంతువులకు దాణా, సోయాబీన్ తదితర ఉత్పత్తుల విషయంలో జాయింట్ వెంచర్ల ఏర్పాటుపై ప్రతినిధుల బృందం దృష్టి పెట్టనున్నట్టు ఎఫ్ఐఈవో బోర్డ్ సభ్యుడు ఎన్కే కగ్లివాల్ తెలిపారు. భారత ప్రతినిధుల బృందానికి కగ్లివాల్ నేతృత్వం వహిస్తున్నారు. ఆగ్రో, ఆహార ప్రాసెసింగ్ ఎగుమతులు 750 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు వచ్చే మూడేళ్లలో పెంచుకోవాలన్నది లక్ష్యమని తెలిపారు. కొన్ని అంశాల పరిష్కారానికి ఎగుమతిదారులు, దిగుమతిదారులు, బ్యాంకర్ల అదనపు కృషి చేయాల్సి ఉంటుందని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. -
చైనా, రష్యాలతో సహవాసం భారత్‌కే ముప్పు: యూఎస్
Russian weapons cheaper: రష్యా ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడటంతో ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురైంది. రష్యా ఉక్రెయిన్ దేశాన్ని నేలమట్టం చేసేలా దాడులు చేయడమే కాకుండా యుద్ధ నేరాలకు పాల్పడింది. దీంతో యూఎస్ దాని మిత్ర దేశాలు రష్యా ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా రష్యాతో మిత్రత్వం సాగిస్తున్న దేశాలపై కూడా కన్నెర్రజేసింది. అంతేకాదు ప్రపంచ దేశాలన్ని ఆర్థిక ఆంక్షలు విధించడంతో రష్యా భారత్‌తో చమురు, తదితర వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకుంది. అందులో భాగంగా ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీంతో యూఎస్ వెంటనే భారత్‌కి హెచ్చరికలు జారీ చేసింది. తాము విధించిన ఆంక్షలు రష్యాకు అనుకూలంగా వ్యవహరించే దేశాలకు వర్తిస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అదీగాక రష్యాతో ఆయుధా సామగ్రి కొనుగోలు, చైనాతో గల సరిహద్దు సమస్యలు గురించి భారత్ యూఎస్‌కి తెలిపింది. అంతేగాక రష్యాతో గల చారిత్రక సబంధాల గురించి కూడా వివరించింది. తాము భద్రతా దృష్ట్యా చౌకగా లభించే రష్యా ఆయుధ సామాగ్రి పైనే ఆధారపడుతున్నట్టు భారత్ యూఎస్‌కి స్పషం చేసింది. అయితే భారత్ రక్షణ సామాగ్రి ప్రత్యామ్నయ పరిస్థితి గురించి భయపడనవసరం లేదని అందుకు యూఎస్ సాయం చేస్తుందని అమెరికా సహాయ కార్యదర్శి విక్టోరియా నులాండ్ పేర్కొన్నారు. అంతేగాకుండా రష్యా కంపెనీ భారత్ కంపెనీలతో భాగస్వామ్య వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, అందువల్లే యూఎస్ రక్షణ శాఖ విముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు విక్టోరియా నులాండ్ ఈ విషయమై భారతదేశానికి వచ్చి విదేశాంగ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లాతో సంప్రదింపులు జరిపారు. అయినా రష్యా చైనా ఇరు దేశాలు నిరంకుశ దేశాలని వాటితో సహవాసం భారత్‌కి మంచిదికాదని అన్నారు. ఈ సమయంలో రష్యా, చైనా దేశాలకి వ్యతిరేకంగా భారత్ నిలబడాలని నొక్కి చెప్పారు. అయితే యూఎస్ సైనిక సహకారానికి సంబంధంచి ద్వంద వైఖరి పట్ల భారత్ కాస్త అసంతృప్తిగా ఉంది. రష్యాతో ఎలాంటి సాన్నిహిత్యంగానీ భాగస్వామ్య వ్యాపారాలు గానీ సాగించొద్దుని భారత్‌కి యూస్ బహిరంగంగానే చెప్పింది. (చదవండి: వార్నింగ్ ఇచ్చినా హ్యాండ్ ఇచ్చిన భారత్.. పుతిన్ రెస్పాన్స్‌పై టెన్షన్!) -
మారుతీ, టయోటా సుషో జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: దేశంలో వాహన విచ్ఛిన్నం, రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు నిమిత్తం నూతన జాయింట్ వెంచర్ (జేవీ)ను నెలకొల్పినట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ), టయోటా సుషో సంస్థలు బుధవారం ప్రకటించాయి. మారుతీ సుజుకీ టయోసు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎస్‌టీఐ) పేరిట ఏర్పాటు చేసిన ఈ జేవీలో ఎంఎస్‌ఐకు 50 శాతం వాటా, టయోటా సుషో గ్రూప్ కంపెనీలకు మిగిలిన 50 శాతం వాటా ఉన్నట్లు వెల్లడించాయి. కాలం చెల్లిన వాహనాలను సేకరించి వాటిని విచ్ఛిన్నం చేయడం ఎంఎస్‌టీఐ బాధ్యత కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన నాణ్యత, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణను కొత్త జేవీ చేపడుతుంది. 2020–21 నాటికి నోయిడా, ఉత్తర ప్రదేశ్‌ల్లో యూనిట్లను ఏర్పాటు చేయనున్నామని, నూతన జేవీతో వనరుల పూర్తిస్థాయి వినియోగం జరగనుందని ఎంఎస్ఐ ఎండీ, సీఈఓ కెనిచి ఆయుకవా అన్నారు. నోయిడా ప్లాంట్ సామర్థ్యం నెలకు 2,000 వాహనాలుగా వెల్లడించారు. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వ్యాపారం ఏకతాటిపైకి
ముంబై: ఎస్బీఐ క్రెడిట్ కార్డుల వ్యాపారానికి సంబంధించి రెండు జాయింట్ వెంచర్లను కలిపేసే అవకాశం ఉంది. జీఈ క్యాపిటల్, ఎస్బీఐ ఈ రెండింటి భాగస్వామ్య సంస్థే ఎస్బీఐ కార్డు. ఇందులో ఎస్బీఐకి 60 శాతం, మిగిలిన వాటా జీఈ క్యాపిటల్‌కు ఉన్నాయి. ఈ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్టు జీఈ క్యాపిటల్ ఇప్పటికే ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వ్యాపారం రెండు జాయింట్ వెంచర్లు(జేవీ)గా కొనసాగుతోంది. ఎస్బీఐ కార్డు అండ్ పేమెంట్ సర్వీసెస్ ఇందులో ఒకటి. ఇది క్రెడిట్ కార్డుల మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలు చూస్తోంది. జీఈ క్యాపిటల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్న మరో జాయింట్ వెంచర్ ఎస్బీఐ కార్డుకు సంబంధించి తెర వెనుక టెక్నాలజీ, ప్రాసెసింగ్ ప్రక్రియలను చూస్తోంది. రెండింటిలోనూ ఎస్బీఐకి గణనీయమైన వాటా ఉన్నందున ఒకే వ్యాపారానికి సంబంధించి రెండు విభాగాలను కొనసాగించడంలో అర్థం లేదని ఎస్బీఐ కార్డు ఎండీ, సీఈవో విజయ్ జసూజా సోమవారం ముంబైలో మీడీయా సమక్షంలో పేర్కొన్నారు. బోర్డులోకి కొత్త ఇన్వెస్టర్ వచ్చిన తర్వాత ఈ రెండు జాయింట్ వెంచర్ల విలీనం సాధ్యమవుతుందన్నారు. వార్బర్గ్ పింకస్, కార్లిలే, క్రెడిట్ సైసన్ ఎబీఐలో జీఈకి వాటాను సొంతం చేసుకునేందుకు తుది బిడ్డర్లుగా ఉన్నాయి. ఎవరికి వాటా విక్రయించాలన్న విషయంపై జీఈ క్యాపిటల్ తుది నిర్ణయం తీసుకుంటుందని జసూజా చెప్పారు. ఈ జాయింట్ వెంచర్లలో ఎస్బీఐకి 60 శాతం వాటా ఉండగా, జీఈ నుంచి కొంత కొనుగోలు చేయడం ద్వారా 74 శాతానికి పెంచుకోనున్నట్టు ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇటీవలే వెల్లడించారు. -
రూ.3,000 కోట్లు సమీకరించనున్న డీఎల్ఎఫ్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్)ను ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా వాటా విక్రయం, జాయింట్ వెంచర్ల ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నది. రుణ భారం తగ్గించుకోవడానికి, నగదు నిల్వల పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని డీఎల్ఎఫ్ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ రుణభారం రూ.20,236 కోట్లుగా ఉంది. సీసీఐ కొరడా: కాగా డీఎల్‌ఎఫ్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మంగళవారం మరోసారి కొరడా ఝులిపించింది. మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న ఈ కంపెనీ దానిని దుర్వినియోగం చేసేలా ప్రవర్తించిందని, దీనికి ప్రాథమికంగా ఆధారాలున్నాయని, ఈ విషయమై సమగ్రంగా దర్యాప్తు జరపాలని, 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఐ ఆదేశాలిచ్చింది. డీఎల్ఎఫ్ యూనివర్శల్‌కు చెందిన గుర్గావ్లోని స్కైకోర్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించి సీసీఐ ఈ ఆదేశాలిచ్చింది. డీఎల్‌ఎఫ్‌పై సీసీఐ ఇలాంటి ఆదేశాలివ్వడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. గుర్గావ్లోనే ఉన్న డీఎల్ఎఫ్ గార్డెన్ సిటీ ప్రాజెక్ట్‌కు సంబంధించి సీసీఐ సోమవారం కూడా ఇదే తరహా దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కేసుల్లో డీఎల్‌ఎఫ్‌దే తప్పంటూ ఇప్పటికే సీసీఐ డీఎల్‌ఎఫ్‌పై సీసీఐ రూ.630 కోట్ల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది. -
జాయింట్ వెంచర్లకు గుడ్‌బై!
సాక్షి, హైదరాబాద్: జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల నుంచి బయటకు రావాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయించింది. సంస్థకు సంబంధించిన జేవీలపై వివిధ రకాల విచారణలు కొనసాగుతుండటంతో పాటు ఆయూ ప్రాజెక్టుల్లో సంస్థ వాటాపై చెలరేగుతున్న వివాదాల నేపథ్యంలో ఏపీఐఐసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏపీఐఐసీ పాలకమండలి సమావేశం శుక్రవారం జరిగింది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్‌తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మార్, రహేజా, హైటెక్ సిటీ, రాంకీ ఫార్మాసిటీ మొదలైన మొత్తం 19 రకాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టులను వివిధ సంస్థలతో కలిసి ఏపీఐఐసీ చేపట్టింది. ఈ జేవీల్లో ఏపీఐఐసీకి 11 శాతం నుంచి 26 శాతం వరకూ వాటాలు ఉన్నాయి. జేవీల నుంచి బయటపడాలని భావిస్తున్న సంస్థ.. తన వాటాల విలువను లెక్కించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్లను నియమించాలని సమావేశంలో నిర్ణయించింది. ఈ విలువ లెక్కింపు ఆధారంగా... ప్రస్తుతం జేవీలో ఉన్న సంస్థకు తమ వాటా కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకవేళ సదరు సంస్థ ముందుకు రాని పక్షంలో ఇతర సంస్థలకు విక్రయించే వీలుందని సమాచారం. అయితే జేవీ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలనే వాదన వినిపిస్తోంది. ఈ సంస్థలకు ప్రభుత్వం భూమి ఇవ్వడంతో పాటు రకరకాల రాయితీలను కల్పించింది. అందువల్ల ఏపీఐఐసీ ఈ ప్రాజెక్టుల నుంచి బయటకు వస్తే భాగస్వామ్య ప్రైవేటు సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఏపీఐఐసీ జేవీ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యూరుు. ఫలితాలు కూడా వస్తున్నారుు. డివిడెండ్ల రూపంలో ఆర్థిక లాభాలు పొందాల్సిన ఏపీఐఐసీ ఈ నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసే సూచనలు కన్పిస్తున్నారుు.