
గ్రీస్ : ఓ రిఫ్రిజిరేటర్ ట్రక్కులో 41 మంది సజీవంగా ఉన్న శరణార్థులను గ్రీస్ పోలీసులు అరెస్టు చేశారు. గ్రీకు నగరం గ్జాంతిలో పోలీసులు రోజూవారీ తనిఖీల్లో భాగంగా ట్రక్కును ఆపారు. దీంతో ఆ ట్రక్కులో ఉన్నవారంతా పోలీసులకు దొరికిపోయారు. శరణార్థులంతా ఆఫ్ఘనిస్తానీలని తేలింది. ట్రక్కులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఆన్ చేయకపోవడం వల్ల వాళ్లంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ట్రక్కు డ్రైవర్‌ను, శరణార్థులను పోలీస్‌లు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment