రిఫ్రిజిరేటర్ల విభాగంలోకి ఇంటెక్స్ | Intex Technologies enters refrigerator segment | Sakshi
Sakshi News home page

రిఫ్రిజిరేటర్ల విభాగంలోకి ఇంటెక్స్

Published Tue, Aug 9 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

రిఫ్రిజిరేటర్ల విభాగంలోకి ఇంటెక్స్

రిఫ్రిజిరేటర్ల విభాగంలోకి ఇంటెక్స్

న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ కంపెనీ ’ఇంటెక్స్ టెక్నాలజీస్’ తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుంటోంది. ఇది తాజాగా రిఫ్రిజిరేటర్ విభాగంలోకి అడుగుపెట్టింది. కొత్తగా మూడు సింగిల్ డోర్ డెరైక్ట్ కూలింగ్ రిఫ్రిజిరేటర్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటి సామర్థ్యం 170 లీటర్లు-190 లీటర్ల శ్రేణిలో ఉంది. వీటి ధరను రూ.10,900 నుంచి రూ.14,300 మధ్యలో నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఇంటెక్స్.. రిఫ్రిజిరేటర్ల పాటు ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఉత్పత్తులకు బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement