Intex Technologies
-
రిలయన్స్ జియో బాగా దెబ్బకొట్టింది..
కోల్కత్తా : దేశంలోనే రెండో అతిపెద్ద హ్యాండ్సెట్ తయారీదారిగా ఉన్న ఇంటెక్స్ టెక్నాలజీస్‌కు రిలయన్స్ జియో భారీగా దెబ్బకొట్టింది. అటు టెలికాం కంపెనీలకే కాక, ఇటు మొబైల్ కంపెనీలకు ఇది తీవ్ర సంకటంగా నిలుస్తోంది. 2016-17లో ఇంటెక్స్ టెక్నాలజీస్ విక్రయాలు 30 శాతం మేర క్షీణించాయి. దీనికంతటికీ కారణం రిలయన్స్ జియో ఎంట్రీ, డిమానిటైజేషన్ ప్రభావమేనని తెలిపింది. తమ రెవెన్యూలు కిందకి దిగజారాయని, రిలయన్స్ జియో రాకతో ఇండస్ట్రి హఠాత్తుగా 2జీ, 3జీ నుంచి 4జీకి మారిపోయిందని ఇంటెక్స్ టెక్నాలజీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లోపేర్కొంది.. కొత్త 4జీ హ్యాండ్సెట్ మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టిందని, అంతేకాక డిమానిటైజేషన్ ప్రభావంతో తమకు ఎక్కువగా విక్రయాలు నమోదయ్యే గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ నుంచి మార్చి కాలంలో విక్రయాలు ఢమాలమన్నట్టు పేర్కొంది. గతేడాది ఇంటెక్స్ రెవెన్యూలు రూ.6,223.42 కోట్లగా ఉండగా... 2017 మార్చి వరకు ఇవి రూ.4,364.08 కోట్లగా నమోదయ్యాయి. అదేవిధంగా నికర లాభాలు 17 శాతం క్షీణించి రూ.127.3 కోట్లగా నమోదయ్యాయి. తక్కువ విక్రయాలు, కొత్త నియామకాలు, ఇతర వ్యయాలు తమ రెవెన్యూలను దెబ్బకొట్టినట్టు కంపెనీ తెలిపింది. కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ బిజినెస్, డిజిటల్ సర్వీసులతో మొబైల్స్, ఇతర సెగ్మెంట్లలో రెవెన్యూలను మెరుగుపరుచుకుంటామని ఇంటెక్స్ అధికార ప్రతినిధి చెప్పారు. తమ కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ బిజినెస్‌లు గతేడాది 24 శాతంగా ఉండగా.. ఈ ఏడాది 36 శాతానికి పెరిగిందన్నారు. వీటిని 50 శాతానికి పెంచనున్నట్టు తెలిపారు. మైక్రోమ్యాక్స్, వీడియోకాన్లను అధిగమించి 4 శాతం మార్కెట్ షేరుతో ఇంటెక్స్ నెంబర్ 1 ఇండియా బ్రాండుగా నిలిచినట్టు అధికార ప్రతినిధి చెప్పారు. అయితే జియో ఎంట్రీ, గతేడాది డిమానిటైజేషన్‌తో కంపెనీ మార్కెట్ షేరు కొంత తగ్గినట్టు వెల్లడించారు. -
క్రికెట్ అంటే ఆసక్తా.. స్మార్ట్ ఫోన్ నెగ్గే చాన్స్!
క్రికెట్ అంటే మీకు ఆసక్తి ఉందా.. అయితే మీరు ఇంటెక్స్, రూటర్ రివార్డ్స్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న క్విజ్ కాంటెస్ట్ లో పాల్గొని ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇటీవల శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ను భారత్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ సిరీస్ లో రెండు శతకాలు సాధించిన ఇద్దరు భారత బ్యాట్స్ మెన్ పేర్లకు సమాధానం పంపితే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ గెలిచే అదృష్టవంతులు మీరే కావచ్చు. ఇంటెక్స్ టెక్నాలజీస్ అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ క్విజ్ ప్రారంభమైంది. క్విజ్ నియమాలు ఇవి.. 1) హల్లోరూటర్, దిగుజరాత్ లయన్స్ ట్విట్టర్ ఖాతాలను ఫాలో కావాలి 2) ఈ ప్రశ్నను రీట్వీట్ చేయడంతో పాటు స్నేహితులకు ట్యాగ్ చేస్తే స్మార్ట్ ఫోన్ గెలిచే ఛాన్స్ మెరుగువతుంది 3) రూటర్ రివార్డ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రశ్నకు జవాబివ్వాలి 4) క్విజ్ లో పాల్గొనేవారు రూటర్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి 5) క్విజ్ లో నెగ్గిన వారికి ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ లభ్యం. Here's the first question. Tag your friends and use #RooterRewards. Winner to get Intex phone. @HelloRooter #contest pic.twitter.com/FYyRFueYPz — Intex Technologies (@IntexBrand) 25 August 2017 -
ఇంటెక్స్ రెండు స్మార్ట్ఫోన్లు.. బడ్జెట్ ధరలో
న్యూడిల్లీ: ఇంటెక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మంగళవారం లాంచ్ చేసింది. ఆక్వా 4.0 4జీ, ఆక్వా క్రిస్టల్ అనే రెండు మొబైల్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ ధరల్లో వీటిని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. లోఎండ్ స్మార్ట్‌ఫోన్ ఆక్వా 4.0 4జీ ధరను 4,199గాను, ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ ఆక్వా క్రిస్టల్ ధరను 6,990 గాను నిర్ణయించింది. ఈ రెండు ఆండ్రాయిడ్ 6.0 మార్షమల్లో టెక్నాలజీ ఆధారితంగా పనిచేయనున్నాయి. ఆక్వా 4.0 4జీ 4 ఇంచెస్ డిస్ ప్లే 360x640 రిజల్యూషన్ 512ఎంబీ ర్యామ్, 4జీబీ స్టోరేజ్ కెపాసిటీ 64 జీబీ ఎక్స్‌పాండబుల్ కెపాసిటీ 2ఎంపీ రియర్ కెమెరా వీజీఏ సెల్ఫీ కెమెరా 1500 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్ అండ్ వైట్ బ్లూ కలర్స్ లో లభ్యం. ఆక్వా క్రిస్టల్ 5 ఇంచెస్ హెచ్డీ డిస్ ప్లే 720 x 1280 రిజల్యూషన్ 1 జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ కెపాసిటీ 8ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ మెకెరా 2100 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో లభ్యం. -
ఇంటెక్స్ నుంచి ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్
ధర రూ.2,400 న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘ఇంటెక్స్ టెక్నాలజీస్’ తాజాగా కొత్త ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ‘ఆక్వా ఎకో 3జీ’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.2,400గా ఉంది. ఇందులో 4 అంగుళాల స్క్రీన్, 3జీ, 256 ఎంబీ ర్యామ్, డ్యూయెల్ సిమ్, 0.3 ఎంపీ రియర్/ఫ్రంట్ కెమెరాలు వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్స్ నలుపు, తెలుపు, నీలం రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
రిఫ్రిజిరేటర్ల విభాగంలోకి ఇంటెక్స్
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ కంపెనీ ’ఇంటెక్స్ టెక్నాలజీస్’ తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుంటోంది. ఇది తాజాగా రిఫ్రిజిరేటర్ విభాగంలోకి అడుగుపెట్టింది. కొత్తగా మూడు సింగిల్ డోర్ డెరైక్ట్ కూలింగ్ రిఫ్రిజిరేటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి సామర్థ్యం 170 లీటర్లు-190 లీటర్ల శ్రేణిలో ఉంది. వీటి ధరను రూ.10,900 నుంచి రూ.14,300 మధ్యలో నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఇంటెక్స్.. రిఫ్రిజిరేటర్ల పాటు ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఉత్పత్తులకు బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది. -
నోయిడాలో ఇంటెక్స్ ఐదో ప్లాంటు
2015-16లో 3 కోట్ల మొబైల్స్ విక్రయ లక్ష్యం - తయారీ, ఆర్‌అండ్‌డీకి రూ. 1,500 కోట్లు - ఇంటెక్స్ డెరైక్టర్ కేశవ్ బన్సల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ 5వ ప్లాంటును నోయిడాలో ఏర్పాటు చేస్తోంది. ఏటా 35-40 లక్షల ఫోన్ల తయారీ సామర్థ్యంతో దీనిని నెలకొల్పుతోంది. ఈ ప్లాంటుతోసహా తయారీకి వచ్చే మూడేళ్లలో సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడిగా వెచ్చించనుంది. అలాగే ఆర్‌అండ్‌డీకి రూ.500 కోట్లు వెచ్చించనుంది. కంపెనీకి ఇప్పటికే జమ్మూ, బడ్డి, నోయిడాలో నాలుగు ప్లాంట్లున్నాయి. నెలకు 25 లక్షల ఫోన్లను తయారు చేయగల సామర్థ్యం ఈ ప్లాంట్లకు ఉంది. కంప్యూటర్ పరికరాలు, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్ల వంటి ఉపకరణాలను సైతం ఇంటెక్స్ ఉత్పత్తి చేస్తోంది. ఇక ఈ ఏడాది మార్కెటింగ్‌కు కంపెనీ రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది. భవిష్యత్తులో అవసరమైతే దక్షిణాదిన కూడా ప్లాంటు నెలకొల్పుతామని కంపెనీ డెరైక్టర్ కేశవ్ బన్సల్ సోమవారమిక్కడ తెలిపారు. 50 శాతం స్మార్ట్ఫోన్లు.. ఇంటెక్స్ 2015-16లో మొబైల్స్ ద్వారా రూ.8,000 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. 2014-15లో మొత్తం 2 కోట్ల యూనిట్లను కంపెనీ విక్రయించింది. వీటిలో 70 లక్షల యూనిట్లు స్మార్ట్ఫోన్లు ఉన్నాయని కేశవ్ బన్సల్ తెలిపారు. ఈ ఏడాది 3 కోట్ల ఫోన్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇందులో స్మార్ట్ఫోన్ల వాటా 50 శాతం ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటెక్స్ ఎక్స్పీరియన్స్ జోన్లు 400 ఏర్పాటు చేస్తామన్నారు. జొల్లా అభివృద్ధి చేసిన సెయిల్ ఫిష్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందిన స్మార్ట్ఫోన్లను నవంబర్‌లో విడుదల చేస్తామని సేల్స్ సీనియర్ జీఎం సంజయ్ కలిరోనా వెల్లడించారు. ఆక్వా ట్రెండ్ విడుదల.. ప్రిన్స్ మహేశ్‌బాబును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఇంటెక్స్ ప్రకటించింది. మహేశ్ చేతుల మీదుగా ఆక్వా ట్రెండ్ పేరుతో 4జీ మొబైల్‌ను ఆవిష్కరించింది. 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, లాలీపాప్ 5.1 ఓఎస్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీని వాడారు. 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ సోనీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, హాట్‌నాట్ ఇతర ఫీచర్లు. 8.9 మిల్లిమీటర్ల మందంతో ఫోన్‌ను రూపొందించారు. ధర రూ.9,444. ఏడాదిపాటు స్క్రీన్ బ్రేకేజ్ వారంటీ ఉంది. సెన్సార్ ఆధారిత ఫ్లిప్ కవర్‌ను పొందుపరిచారు. -
రూ.100 కోట్లతో ఇంటెక్స్ విస్తరణ!
దేశంలో 400 ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ అయిన ఇంటెక్స్ టెక్నాలజీస్ 2015-16 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా తన సేవల్ని మరింత విస్తరించనుంది. ఈమేరకు రూ.100 కోట్ల పెట్టుబడులతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 400 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇంటెక్స్ టెక్నాలజీస్ రిటైల్ బిజినెస్ డీజీఎం విశాల్ మాలిక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్టోర్లను ముందుగా మెట్రో నగరాల్లో. ఆపై ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ స్టోర్ల ద్వారా రూ.300 కోట్ల వ్యాపారం అర్జించడమే లక్ష్యమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.6 వేల కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ ఔట్లెట్ల ద్వారా కొనుగోలుదారులకు మరింత దగ్గరవుతామని, తద్వారా వారి నిజమైన అవసరాలను గుర్తించేందుకు వీలు కలుగుతుందని మాలిక్ చెప్పుకొచ్చారు. -
ఇంటెక్స్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనుష్క
ధర రెండువేల లోపే మార్కెట్లోకి ఆక్వా స్టైల్ ప్రో విడుదల ఇంటెక్స్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి అనుష్క హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఇంటెక్స్ టెక్నాలజీస్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లోని అన్ని ఫీచర్స్ ఉండే విధంగా రూపొందించిన ఈ ఫోన్‌ను ఈ నెలాఖరులోగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఇంటెక్స్ మార్కెటింగ్ డెరైక్టర్ కేశవ్ బన్సాల్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఆక్వా స్టైల్ ప్రో’ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చౌక స్మార్ట్‌ఫోన్ ధర 2వేలకు సమీపంలో ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ భారతదేశంలో మంచి పట్టు సాధించిన ఇంటెక్స్ ఇప్పుడు దక్షిణాది మార్కెట్‌పై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. అందులోభాగంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోసం అనుష్కను, కర్ణాటకకు సుదీప్‌ను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంటెక్స్ మొబైల్ డివిజన్ మార్కెటింగ్ కోసం రూ. 140 కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా అందులో రూ. 35 నుంచి 40 కోట్లు వచ్చే 3,4 నెలల్లో కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే వ్యయం చేయనున్నట్లు బన్సాల్ తెలిపారు. అలాగే వచ్చే 4 నెలల్లో రూ. 2,000 నుంచి రూ. 10,000 ధరల శ్రేణిలో 8 స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. గతేడాది రూ. 1,350 కోట్లుగా ఉన్న మొబైల్ డివిజన్ వ్యాపారం ఈ ఏడాది రూ. 2,700 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆక్వా స్టైల్ ప్రో రూ. 6,990 అంతకుముందు దక్షిణాది రాష్ట్రాల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన టాలీవుడ్ నటి అనుష్క ‘ఆక్వా స్టైల్ ప్రో’ను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశా రు. 1జీబీ రామ్, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4.4 కిటికాట్, 3జీ నెట్వర్క్ వంటి ఫీచర్స్‌తో కూడిన ఆక్వా స్టైల్ ప్రో ధరను రూ. 6,990గా నిర్ణయించారు. ఇంటెక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనుష్క ఒక సంవత్సరం పాటు వ్యవహరించనున్నారు. -
ఇంటెక్స్ నుంచి చౌక స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: ఇంటెక్స్ టెక్నాలజీస్ కంపెనీ రెండు ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. తొలిసారిగా స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే గ్రామీణ ప్రాంత వినియోగదారులు లక్ష్యంగా ఈ స్మార్ట్ఫోన్లు-క్లౌడ్ ఎక్స్వన్ప్లస్ (ధర రూ.2,990), క్లౌడ్ వై11(ధర రూ.4,490)లను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేసే డ్యుయల్ సిమ్ స్మార్ట్ఫోన్లు వై-ఫైని సపోర్ట్ చేస్తాయని పేర్కొంది. 3.5 అంగుళాల స్మార్ట్ఫోన్ల కేటగిరిలో అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా ఈ క్లౌడ్ ఎక్స్వన్ప్లస్ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను కంపెనీ అభివర్ణించింది. ఈ ఫోన్లో 1 గిగా హెట్జ్ మొబైల్ ప్రాసెసర్, 128 ఎంబీ ర్యామ్, 2 మెగా పిక్సెల్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నా యి. వాట్స్‌యాప్, ఇంటెక్స్ జోన్, మరికొన్ని గేమ్స్ ప్రిలోడెడ్‌గా ఈ ఫోన్‌ను అందిస్తున్నామని వివరించింది. ఇక క్లౌడ్ వై11 ఫోన్ అత్యంత చౌకైన 3జీ స్మార్ట్‌ఫోన్ అని తెలిపింది. ఈ ఫోన్లో 4 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, డ్యుయల్ కోర్ 1 గిగా హెట్జ్ మొబైల్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది.