ఇంటెక్స్ నుంచి చౌక స్మార్ట్‌ఫోన్‌లు | Intex launches Cloud X1+ smartphone at Rs 2990 | Sakshi
Sakshi News home page

ఇంటెక్స్ నుంచి చౌక స్మార్ట్‌ఫోన్‌లు

Published Fri, Mar 21 2014 12:35 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

ఇంటెక్స్ నుంచి చౌక స్మార్ట్‌ఫోన్‌లు - Sakshi

ఇంటెక్స్ నుంచి చౌక స్మార్ట్‌ఫోన్‌లు

న్యూఢిల్లీ: ఇంటెక్స్ టెక్నాలజీస్ కంపెనీ రెండు ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసే గ్రామీణ ప్రాంత వినియోగదారులు లక్ష్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లు-క్లౌడ్ ఎక్స్‌వన్‌ప్లస్ (ధర రూ.2,990),  క్లౌడ్ వై11(ధర రూ.4,490)లను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది.  ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేసే డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు వై-ఫైని సపోర్ట్ చేస్తాయని పేర్కొంది.  3.5 అంగుళాల స్మార్ట్‌ఫోన్‌ల కేటగిరిలో అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా ఈ క్లౌడ్ ఎక్స్‌వన్‌ప్లస్ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను కంపెనీ అభివర్ణించింది.

ఈ ఫోన్‌లో 1 గిగా హెట్జ్ మొబైల్ ప్రాసెసర్, 128  ఎంబీ ర్యామ్, 2 మెగా పిక్సెల్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నా యి. వాట్స్‌యాప్, ఇంటెక్స్ జోన్, మరికొన్ని గేమ్స్ ప్రిలోడెడ్‌గా ఈ ఫోన్‌ను అందిస్తున్నామని వివరించింది. ఇక క్లౌడ్ వై11 ఫోన్ అత్యంత చౌకైన 3జీ స్మార్ట్‌ఫోన్ అని తెలిపింది. ఈ ఫోన్‌లో 4 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, డ్యుయల్ కోర్ 1 గిగా హెట్జ్ మొబైల్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement