ఇంటెక్స్ నుంచి చౌక స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: ఇంటెక్స్ టెక్నాలజీస్ కంపెనీ రెండు ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. తొలిసారిగా స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే గ్రామీణ ప్రాంత వినియోగదారులు లక్ష్యంగా ఈ స్మార్ట్ఫోన్లు-క్లౌడ్ ఎక్స్వన్ప్లస్ (ధర రూ.2,990), క్లౌడ్ వై11(ధర రూ.4,490)లను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేసే డ్యుయల్ సిమ్ స్మార్ట్ఫోన్లు వై-ఫైని సపోర్ట్ చేస్తాయని పేర్కొంది. 3.5 అంగుళాల స్మార్ట్ఫోన్ల కేటగిరిలో అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా ఈ క్లౌడ్ ఎక్స్వన్ప్లస్ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను కంపెనీ అభివర్ణించింది.
ఈ ఫోన్లో 1 గిగా హెట్జ్ మొబైల్ ప్రాసెసర్, 128 ఎంబీ ర్యామ్, 2 మెగా పిక్సెల్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నా యి. వాట్స్‌యాప్, ఇంటెక్స్ జోన్, మరికొన్ని గేమ్స్ ప్రిలోడెడ్‌గా ఈ ఫోన్‌ను అందిస్తున్నామని వివరించింది. ఇక క్లౌడ్ వై11 ఫోన్ అత్యంత చౌకైన 3జీ స్మార్ట్‌ఫోన్ అని తెలిపింది. ఈ ఫోన్లో 4 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, డ్యుయల్ కోర్ 1 గిగా హెట్జ్ మొబైల్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది.