రూ.100 కోట్లతో ఇంటెక్స్ విస్తరణ! | Intex to invest Rs100 crore in 2015-16 on retail expansion | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్లతో ఇంటెక్స్ విస్తరణ!

Published Tue, Mar 3 2015 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

రూ.100 కోట్లతో ఇంటెక్స్ విస్తరణ!

రూ.100 కోట్లతో ఇంటెక్స్ విస్తరణ!

దేశంలో 400 ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ అయిన ఇంటెక్స్ టెక్నాలజీస్ 2015-16 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా తన సేవల్ని మరింత విస్తరించనుంది. ఈమేరకు రూ.100 కోట్ల పెట్టుబడులతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 400 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇంటెక్స్ టెక్నాలజీస్ రిటైల్ బిజినెస్ డీజీఎం విశాల్ మాలిక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్టోర్లను ముందుగా మెట్రో నగరాల్లో.

ఆపై ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ స్టోర్ల ద్వారా రూ.300 కోట్ల వ్యాపారం అర్జించడమే లక్ష్యమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.6 వేల కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ ఔట్‌లెట్ల ద్వారా కొనుగోలుదారులకు మరింత దగ్గరవుతామని, తద్వారా వారి నిజమైన అవసరాలను గుర్తించేందుకు వీలు కలుగుతుందని మాలిక్ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement