కోల్‌కత్తా : దేశంలోనే రెండో అతిపెద్ద హ్యాండ్‌సెట్ తయారీదారిగా ఉన్న ఇంటెక్స్ టెక్నాలజీస్‌కు రిలయన్స్ జియో భారీగా దెబ్బకొట్టింది. అటు టెలికాం కంపెనీలకే కాక, ఇటు మొబైల్ కంపెనీలకు ఇది తీవ్ర సంకటంగా నిలుస్తోంది. 2016-17లో ఇంటెక్స్ టెక్నాలజీస్ విక్రయాలు 30 శాతం మేర క్షీణించాయి. దీనికంతటికీ కారణం రిలయన్స్ జియో ఎంట్రీ, డిమానిటైజేషన్ ప్రభావమేనని తెలిపింది. తమ రెవెన్యూలు కిందకి దిగజారాయని, రిలయన్స్ జియో రాకతో ఇండస్ట్రి హఠాత్తుగా 2జీ, 3జీ నుంచి 4జీకి మారిపోయిందని ఇంటెక్స్ టెక్నాలజీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లోపేర్కొంది.. కొత్త 4జీ హ్యాండ్‌సెట్ మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టిందని, అంతేకాక డిమానిటైజేషన్ ప్రభావంతో తమకు ఎక్కువగా విక్రయాలు నమోదయ్యే గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ నుంచి మార్చి కాలంలో విక్రయాలు ఢమాలమన్నట్టు పేర్కొంది. గతేడాది ఇంటెక్స్ రెవెన్యూలు రూ.6,223.42 కోట్లగా ఉండగా... 2017 మార్చి వరకు ఇవి రూ.4,364.08 కోట్లగా నమోదయ్యాయి.
అదేవిధంగా నికర లాభాలు 17 శాతం క్షీణించి రూ.127.3 కోట్లగా నమోదయ్యాయి. తక్కువ విక్రయాలు, కొత్త నియామకాలు, ఇతర వ్యయాలు తమ రెవెన్యూలను దెబ్బకొట్టినట్టు కంపెనీ తెలిపింది. కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ బిజినెస్, డిజిటల్ సర్వీసులతో మొబైల్స్, ఇతర సెగ్మెంట్లలో రెవెన్యూలను మెరుగుపరుచుకుంటామని ఇంటెక్స్ అధికార ప్రతినిధి చెప్పారు. తమ కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ బిజినెస్‌లు గతేడాది 24 శాతంగా ఉండగా.. ఈ ఏడాది 36 శాతానికి పెరిగిందన్నారు. వీటిని 50 శాతానికి పెంచనున్నట్టు తెలిపారు. మైక్రోమ్యాక్స్, వీడియోకాన్‌లను అధిగమించి 4 శాతం మార్కెట్ షేరుతో ఇంటెక్స్ నెంబర్ 1 ఇండియా బ్రాండుగా నిలిచినట్టు అధికార ప్రతినిధి చెప్పారు. అయితే జియో ఎంట్రీ, గతేడాది డిమానిటైజేషన్‌తో కంపెనీ మార్కెట్ షేరు కొంత తగ్గినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment