
సాక్షి, : సరికొత్తగా ఏ పని చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం చేసిన ఒక్క పని మనల్నిఆకాశానికి ఎత్తేస్తోంది. అయితే అప్పుడప్పుడు ఇలాంటివి తమకు ప్రతికూలంగానూ మారుతాయి. ఇలాంటి సంఘటనే స్పెయిన్‌లో చోటుచేసుకుంది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు ఓ వ్యక్తి. తను చేస్తున్న పని గొప్పదని హీరోలా ఫీలయ్యి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ తింగరి పని కాస్తా పోలీసుల వరకు చేరి చివరికి జీరో అయ్యాడు.
వివరాలు.. స్పెయిన్‌లోని ఓ వ్యక్తి ఇంట్లోని రిఫ్రిజిరేటర్ వాడుకకాలం పూర్తవడడంతో దాన్ని లోయలో పడేశాడు. అంతటతో ఊరుకోక పడేసే ముందు వెటకారంగా దీన్ని నేనిలా రీసైకిల్ చేస్తున్నానంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లడంతో, ఆగ్రహించిన పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని ఫ్రిడ్జ్ పడేసిన చోటుకు తీసుకెళ్లారు. లోయలో పడిన రిఫ్రిజిరేటర్‌ను అతనితోనే బయటకు తీయించారు. పోలీసలూ తమ వంతు సాయం చేశారు. పర్యావరణానికి హాని కలిగించేలా వ్యవహరించిన వ్యక్తి నిర్లక్ష్యపు పనికి స్థానిక కోర్టు జరిమానా విధించే అవకాశముందని పోలీసులు తెలిపారు. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం బయటికి వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment