Balloon World Cup 2021: Balloon World Cup First Ever Tourney Held In Spain Won Peru - Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ‘బెలూన్‌’ వరల్డ్‌ కప్‌! ఎలా పుట్టిందంటే..

Published Thu, Oct 21 2021 1:33 PM | Last Updated on Thu, Oct 21 2021 4:06 PM

Balloon World Cup First ever Tourney held in Spain won Peru - Sakshi

Baloon World Cup 2021: బుగ్గలతో(బెలూన్స్‌)తో ఆడుకోవడం పిల్లలకు సరదా. మరి పెద్దవాళ్లకో!. కొందరికి ఉండొచ్చు కూడా. అలాంటి ఆసక్తి గనుక మీకు ఉంటే.. ఛాంపియన్‌ అయ్యేందుకు అవకాశమూ ఉంది. ఎందుకంటే.. ప్రపంచంలో మొట్టమొదటి ‘బెలూన్‌ వరల్డ్‌ కప్‌’ను ఈ మధ్యే విజయవంతంగా నిర్వహించారు. ఇకపై క్రమం తప్పకుండా నిర్వహిస్తారంట!.  


స్పెయిన్‌ టర్రగోనా సిటీలోని ఓ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో ఈ టోర్నీ జరిగింది.  గప్‌చుప్‌గా పోయిన వారంలో.. వారంపాటు మొట్టమొదటి బెలూన్‌ వరల్డ్‌ కప్‌ను నిర్వహించారు. మొత్తం 32 దేశాలు ఇందులో పోటీపడగా.. జర్మనీ, పెరూలు ఫైనల్‌కి చేరాయి. ఫైనల్‌ పోరులో పెరూకి చెందిన ఫ్రాన్సెస్కో డె లా క్రూజ్‌ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. దానికింద సరదా కామెంట్లూ కనిపిస్తున్నాయి.


ఎలా ఆడతారంటే.. 
Balloon Keep Up.. సింపుల్‌.. బెలూన్‌ కిందపడకుండా ఆడాలి. కిందపడితే ప్రత్యర్థి వ్యక్తికి ఒక పాయింట్‌ వెళ్తుంది. 8X8 మీటర్‌ కోర్టులో ఈ గేమ్‌ను నిర్వహిస్తారు. కాకపోతే లివింగ్‌ రూం లాంటి ఆ కోర్టులో కారు, సోఫా, కుర్చీలు.. ఇలా రకరకాల వస్తువులు ఉంటాయి. మరి బెలూన్‌ పగిలిపోతే పరిస్థితి ఏంటి? అని మాత్రం అడగకండి ప్లీజ్‌!. 

పుట్టింది ఇలా.. 
బార్సిలోనా సాకర్‌ ప్లేయర్‌ గెరార్డ్‌ పిక్యూ,  స్పానిష్‌ ఇంటర్నెట్‌ సెలబ్రిటీ ఇబయ్‌ లానోస్‌లు ఈ టోర్నీని నిర్వహించారు. అయితే ఈ ప్రపంచ టోర్నీ పుట్టింది టిక్‌టాక్‌లోని సరదా వీడియోల ఆధారంగా!. యస్‌.. ఓరేగావ్‌(యూఎస్‌)కు చెందిన అర్రెన్‌డోండో ఫ్యామిలీ టిక్‌టాక్‌లో సరదాగా గేమ్స్‌ వీడియోలను పోస్ట్‌ చేసేది. ఆ వీడియోల ఆధారంగా  గెరార్డ్‌ పిక్యూ, ఇబయ్‌ లాబీ లానోస్‌లు ఈ టోర్నీని రూపొందించారు. అంతేకాదు గెరార్డ్‌ పిక్యూ డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ను కొత్త రూపంలో మార్చే ప్రయత్నంలో ఉన్నాడు కూడా.

చదవండి: సంచలన ఆరోపణలు: ఆ బాక్సింగ్‌ మ్యాచ్‌లు ఫిక్సింగ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement