నేటి కాలంలో కరెంట్ లేకుండా పనే అవ్వదు. చెప్పాంలంటే అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితి. ఇదివరకటిలి భయానక కరెంట్ కోతలు లేవు. ఉంటే మాత్రం ఒక రోజు గడవడం కష్టమే అయిపోతుంది నగరాల్లో. ఎన్నో పనులు ఆగిపోతాయి. ఒక్కోసారి కరెంట్ లేని నాటి కాలంలో మన పెద్దవాళ్లు ఎలా ఉన్నారా? అని కూడా అనిపిస్తుంది. కానీ ఆ కాలంలోనే కరెంట్ లేకుండా నడిచిన ఓ ఫ్రిడ్జ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఆ వీడియోలో వందేళ్ల నాటి ఫిడ్జ్ ఉంది. అది కరెంట్‌తోనో, బ్యాటరీతోనే కాదు.. కేవలం కిరోసిన్‌తో పని చేసేది (kerosene Fridge). ఆ ఫ్రిడ్జ్ అడుగు భాగంలో దాదాపు 10 లీటర్ల ఆయిల్ ట్యాంక్ కూడా ఉంది. హిమ్‌లక్స్ కంపెనీకి చెందిన ఈ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన అనేక సాంకేతిక అంశాలను వీడియోలో చూపించారు. కిరోసిన్ ఉన్న ట్యాంక్ కింది భాగంలో ఉన్న దీపాన్ని వెలిగిస్తారు. ఆ మంటతో నీరు, సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను మండిస్తే గ్యాస్ వెలువడుతుంది.
ఫ్రిడ్జ్ వెనుక భాగంలో అమర్చిన పైప్ ద్వారా ఆ గ్యాస్ ఫ్రిడ్జ్ లోపలికి ప్రవేశించి అందులోని పదార్థాలను చల్లగా ఉంచుతుంది. కూలింగ్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా మంటను పెద్దది చేస్తే సరి. కూలింగ్ తక్కువ సరిపోతుందనుకుంటే మంటను చిన్నది చేయాలి. వందల ఏళ్ల క్రితం మన దేశంలోని ధనికులు ఫ్రాన్స్, లండన్ నుంచి ఈ ఫ్రిడ్జ్‌లను దిగుమతి చేసుకుని వాడేవారు. అప్పటి ఫ్రిడ్జ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతోంది. ఆ కాలంలోను వాళ్లకు అందుబాటులో ఉన్న వనరులతోనే పదార్థాలను కూలింగ్ చేసే టెక్నాలజీని డెవలప్ చేయడమంటే..నిజంగా గ్రేట్ కదూ!.
Comments
Please login to add a commentAdd a comment