Current Connection
-
వందేళ్ల క్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్!
నేటి కాలంలో కరెంట్ లేకుండా పనే అవ్వదు. చెప్పాంలంటే అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితి. ఇదివరకటిలి భయానక కరెంట్ కోతలు లేవు. ఉంటే మాత్రం ఒక రోజు గడవడం కష్టమే అయిపోతుంది నగరాల్లో. ఎన్నో పనులు ఆగిపోతాయి. ఒక్కోసారి కరెంట్ లేని నాటి కాలంలో మన పెద్దవాళ్లు ఎలా ఉన్నారా? అని కూడా అనిపిస్తుంది. కానీ ఆ కాలంలోనే కరెంట్ లేకుండా నడిచిన ఓ ఫ్రిడ్జ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో వందేళ్ల నాటి ఫిడ్జ్ ఉంది. అది కరెంట్తోనో, బ్యాటరీతోనే కాదు.. కేవలం కిరోసిన్‌తో పని చేసేది (kerosene Fridge). ఆ ఫ్రిడ్జ్ అడుగు భాగంలో దాదాపు 10 లీటర్ల ఆయిల్ ట్యాంక్ కూడా ఉంది. హిమ్లక్స్ కంపెనీకి చెందిన ఈ రిఫ్రిజిరేటర్కు సంబంధించిన అనేక సాంకేతిక అంశాలను వీడియోలో చూపించారు. కిరోసిన్ ఉన్న ట్యాంక్ కింది భాగంలో ఉన్న దీపాన్ని వెలిగిస్తారు. ఆ మంటతో నీరు, సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను మండిస్తే గ్యాస్ వెలువడుతుంది. ఫ్రిడ్జ్ వెనుక భాగంలో అమర్చిన పైప్ ద్వారా ఆ గ్యాస్ ఫ్రిడ్జ్ లోపలికి ప్రవేశించి అందులోని పదార్థాలను చల్లగా ఉంచుతుంది. కూలింగ్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా మంటను పెద్దది చేస్తే సరి. కూలింగ్ తక్కువ సరిపోతుందనుకుంటే మంటను చిన్నది చేయాలి. వందల ఏళ్ల క్రితం మన దేశంలోని ధనికులు ఫ్రాన్స్, లండన్ నుంచి ఈ ఫ్రిడ్జ్‌లను దిగుమతి చేసుకుని వాడేవారు. అప్పటి ఫ్రిడ్జ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతోంది. ఆ కాలంలోను వాళ్లకు అందుబాటులో ఉన్న వనరులతోనే పదార్థాలను కూలింగ్ చేసే టెక్నాలజీని డెవలప్ చేయడమంటే..నిజంగా గ్రేట్ కదూ!. View this post on Instagram A post shared by Virendra Jat (@indiandesitraveler) (చదవండి: చీరలు కొన్న వాటిలానే ఉండాలంటే ఇలా చేయండి!) -
3 రోజుల్లో కొత్త కరెంట్ కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: మెట్రోపాలి టన్ నగరాల్లో వినియోగదారులు అవసరమైన పత్రాలన్నీ పొందుపరిచి, కొత్త కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వా లని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే పాత కనెక్షన్లో మార్పుల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ(వినియోగదారుల హక్కులు) రూల్స్–2020ని సవరిస్తూ రూల్స్–2024ను శుక్రవారం జారీ చేసింది. అదేవిధంగా మున్సిపల్ ప్రాంతాల్లో వారంరోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా కనెక్షన్ జారీ చేయాలని నిర్దేశించింది. రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని కొండ ప్రదేశాల్లో అయితే 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. పంపిణీ వ్యవస్థల విస్తరణ, కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటే.. 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకొని, విద్యుత్ సరఫరా చేయాలని నిర్దేశించింది. ఇక గ్రూప్ హౌసింగ్ సొసైటీ కింద అన్ని ఇళ్లకు అవకాశం ఉంటే.. సింగిల్ పాయింట్ కనెక్షన్ (ఒకే కనెక్షన్) ఇవ్వాలని పేర్కొంది. సొసైటీలో 50 శాతం దాకా యాజమానులు వ్యక్తిగత కనెక్షన్ కోరితే.. వారందరికీ వ్యక్తిగత కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగిల్ పాయింట్ కనెక్షన్ టారిఫ్ కూడా సగటు గృహ కనెక్షన్ టారిఫ్‌ను దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సొసైటీల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం ప్రత్యేకంగా కనెక్షన్ కావాలంటే జారీ చేయాలని నిర్దేశించింది. మీటర్లలో లోపాలు లేదా దెబ్బతినడం.. కాలిపోవడం వంటి అంశాలపై దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోపు కొత్త మీటర్ బిగించాలని, మీటర్ రీడింగ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేస్తే కొత్త మీటర్‌ను ఐదురోజుల్లోగా బిగించడమే కాకుండా తప్పుడు బిల్లింగ్‌పై ఫిర్యాదును మూడు నెలల్లోపు పరిష్కరించాలని పేర్కొంది. సోలార్ విద్యుత్ కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి, సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను 15 రోజుల్లోగా అందించాలన్నారు. 10 కిలోవాట్ల దాకా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ కోసం వచి్చన దరఖాస్తును సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక అవసరం లేకుండా అనుమతించాలని ఆదేశించింది. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ బిగించిన తర్వాత సరి్టఫికెట్‌ను వినియోగదారుడు దాఖలు చేస్తే కనెక్షన్ అగ్రిమెంట్, కొత్త మీటర్‌ను 15 రోజుల్లోగా అందించాలని స్పష్టం చేసింది. -
బిల్లులకు చిల్లులు
• 1104 యూనియన్ రూ.45 లక్షలకుపైగా బాకీ • 327 యూనియన్ రూ.8.34 లక్షల బకాయిలు సాక్షి, హైదరాబాద్: వారు బిల్లుల వసూళ్లలో కర్కశంగా ప్రవర్తిస్తుంటారు. వినియోగ దారులతో దురుసుగా వ్యవహరిస్తుంటారు. ఇంటికి వచ్చి ఫ్యూజ్ తీసుకెళ్లడమో, కరెంట్ కనెక్షన్ తొలగించడమో చేస్తుంటారు. కానీ తమ యూనియన్ కార్యాలయాల బిల్లులు చెల్లించకున్నా కిమ్మనకుండా ఉండిపోతారు. ఇదీ కరెంటోళ్ల లీల. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యుత్ ఉద్యోగ, కార్మిక యూనియన్ల కార్యాలయాలు దశాబ్దాలుగా విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో లక్షలాది రూపాయల బకాయిలు పేరుకుపోయా యి. అయినా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) యాజ మాన్యం యూనియన్ల కార్యాలయాలకు నిరాటంకంగా విద్యుత్ సరఫరాను కొనసా గిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల నుంచి యూని యన్లు లక్షల రూపా యల సభ్యత్వ రుసుం వసూ లు చేస్తున్నాయి. యూనియ న్లు పోటాపోటీగా పెద్ద ఎత్తున డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్య క్రమాలను నిర్వహిస్తున్నాయి. కానీ, ఏటా వచ్చే ఆదాయం నుంచి కొంత బిల్లులకు వెచ్చించడానికి యూనియన్ల నేతలు చొరవ చూపడం లేదు. జిల్లాల్లో అయితే యూని యన్ల కార్యాలయాలకు విద్యుత్ మీటర్లు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 1104 వర్కర్స్ యూని యన్ కార్యాలయం రూ.45.32 లక్షలు. 327 కార్యాలయం రూ.8.34 లక్షలు. తెలుగునాడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రూ.4.02 లక్షలు, ఏపీఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లా యీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.4.47 లక్షలు, ఏపీఎస్ఈబీ టెక్నికల్ ఎంప్లాయీస్ యూనియన్ రూ.1.46 లక్షలు, స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.69,140 బకాయిలను డిస్కంకు చెల్లించాల్సి ఉంది. -
: సమైక్యాంధ్ర ఉద్యమం
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు, కార్మికులు సమ్మె చేపట్టడంతో జిల్లాలో పలు చోట్ల కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా నెలన్నరగా విద్యుత్ శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో సమైక్యాంధ్ర సెంట్రల్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 72గంటల పాటుకు సమ్మెకు దిగి విధులు బహిష్కరించారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ భవన్ గేటుకు తాళం వేశారు. అలాగే ఎస్ఈ కార్యాలయం తెరచుకోలేదు. ఉద్యోగులు ఈనెల 11వ తేదీనే సంస్థ ఇచ్చిన సెల్‌ఫోన్ సిమ్ కార్డులు ఎస్ఈ బసయ్యకు అందజేశారు. గురువారం పలు కారణాలతో జిల్లాలో రెండు ఫీడర్లలో బ్రేక్‌డౌన్ సమస్య తలెత్తింది. సమ్మె కారణంగా అధికారులు, సిబ్బంది మరమ్మతులకు దూరంగా ఉన్నారు. దీంతో 18 గ్రామాల్లో చీకట్లు ఏర్పడినట్లు ఎస్ఈ బసయ్య పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని బాలాజీ నగర్, చైతన్యపురి కాలనీల్లో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫూజ్ ఆఫ్ కాల్ సమస్య తలెత్తిందని, దీంతో ఆ ప్రాంతాల్లో కూడా అంధకారం ఏర్పడిందన్నారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫీడర్లో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా పరిశ్రమలకు కరెంట్ సరఫరా ఆగిపోయింది. నంద్యాల నుంచి బండిఆత్మకూరుకు వెళ్లే ఫీడర్లో బ్రేక్ డౌన్ సమస్య తలెత్తడంతో ఆ ఫీడర్ కింద ఉన్న 12 గ్రామాలకు, మంత్రాలయం సబ్ డివిజన్ పరిధిలోని తుంగభద్ర కాశాపురం ఫీడర్లో కూడా బ్రేక్‌డౌన్ సమస్య తలెత్తి ఆరు గ్రామాలకు సరఫరా నిలిచిపోయిందన్నారరు. అయితే విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రాత్రి 8 గంటలకు పునరుద్ధరించామని ఎస్ఈ వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరైంది కాదని వినియోగదారుల నుంచి తనకు అనేక ఫోన్లు వస్తున్నాయన్నారు. అయితే అధికారులు, సిబ్బంది సెల్ఫోన్ల మూగబోవడంతో పరిష్కరించడం సమస్యగా మారిందన్నారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు. -
ఇంత నిర్లక్ష్యమా..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సూక్ష్మ నీటి పారుదల శాఖ పనితీరుపై కలెక్టర్ బి.శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ నెలలో రూపొందించిన ప్రతిపాదనలను ఇప్పటికీ అమలు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. పదిహేను రోజుల్లోగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలన్నీ గ్రౌండింగ్ చేయాలని స్పష్టం చేశారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం జిల్లాపరిషత్‌లో సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు, డ్వామా, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ సమీక్షిస్తూ.. గతేడాది బిందుసేద్యం కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన ప్రతిపాదనలను ఇప్పటివరకు గ్రౌండింగ్ చేయకుండా జాప్యం చేయడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. వెంటనే గ్రౌండింగ్ చేసి వారంరోజుల్లో సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఇందిర జలప్రభ పురోగతిని సమీక్షిస్తూ.. పథకం కింద ఇప్పటివరకు వేసిన 280 బోర్లలో 73 బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే వాటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు మోటర్తో పాటు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా ఉద్యాన పంటల సాగుకు బిందుసేద్యం పరికరాలను కూడా అందిస్తుందని, ఇవన్నీ సక్రమంగా నిర్వహిస్తేనే పథకం విజయవంతం అవుతుందని అన్నారు. సమావేశంలో డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి, యంఐపీ పీడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.