kerosone
-
వందేళ్ల క్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్!
నేటి కాలంలో కరెంట్ లేకుండా పనే అవ్వదు. చెప్పాంలంటే అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితి. ఇదివరకటిలి భయానక కరెంట్ కోతలు లేవు. ఉంటే మాత్రం ఒక రోజు గడవడం కష్టమే అయిపోతుంది నగరాల్లో. ఎన్నో పనులు ఆగిపోతాయి. ఒక్కోసారి కరెంట్ లేని నాటి కాలంలో మన పెద్దవాళ్లు ఎలా ఉన్నారా? అని కూడా అనిపిస్తుంది. కానీ ఆ కాలంలోనే కరెంట్ లేకుండా నడిచిన ఓ ఫ్రిడ్జ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో వందేళ్ల నాటి ఫిడ్జ్ ఉంది. అది కరెంట్తోనో, బ్యాటరీతోనే కాదు.. కేవలం కిరోసిన్‌తో పని చేసేది (kerosene Fridge). ఆ ఫ్రిడ్జ్ అడుగు భాగంలో దాదాపు 10 లీటర్ల ఆయిల్ ట్యాంక్ కూడా ఉంది. హిమ్లక్స్ కంపెనీకి చెందిన ఈ రిఫ్రిజిరేటర్కు సంబంధించిన అనేక సాంకేతిక అంశాలను వీడియోలో చూపించారు. కిరోసిన్ ఉన్న ట్యాంక్ కింది భాగంలో ఉన్న దీపాన్ని వెలిగిస్తారు. ఆ మంటతో నీరు, సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను మండిస్తే గ్యాస్ వెలువడుతుంది. ఫ్రిడ్జ్ వెనుక భాగంలో అమర్చిన పైప్ ద్వారా ఆ గ్యాస్ ఫ్రిడ్జ్ లోపలికి ప్రవేశించి అందులోని పదార్థాలను చల్లగా ఉంచుతుంది. కూలింగ్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా మంటను పెద్దది చేస్తే సరి. కూలింగ్ తక్కువ సరిపోతుందనుకుంటే మంటను చిన్నది చేయాలి. వందల ఏళ్ల క్రితం మన దేశంలోని ధనికులు ఫ్రాన్స్, లండన్ నుంచి ఈ ఫ్రిడ్జ్‌లను దిగుమతి చేసుకుని వాడేవారు. అప్పటి ఫ్రిడ్జ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతోంది. ఆ కాలంలోను వాళ్లకు అందుబాటులో ఉన్న వనరులతోనే పదార్థాలను కూలింగ్ చేసే టెక్నాలజీని డెవలప్ చేయడమంటే..నిజంగా గ్రేట్ కదూ!. View this post on Instagram A post shared by Virendra Jat (@indiandesitraveler) (చదవండి: చీరలు కొన్న వాటిలానే ఉండాలంటే ఇలా చేయండి!) -
భూ వివాదం: కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి,నాగర్‌కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాలు..బిజినేపల్లి మండలం సల్కరిపేటకు చెందిన జ్యోతి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. తన భర్త మృతి చెందడంతో భూమికోసం రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతుంది. వారసత్వంగా రావలసిన భూమి తనకు ఇవ్వకుండా తన బావ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అధికారులకు మొరపెట్టుకుంది. భూమి దగ్గరికి వస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని విన్నవించుకుంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగి పోయిన మహిళ కిరోసిన్ డబ్బాతో ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కురుమయ్య కిరోసిన్ బాటిల్ లాక్కున్నాడు. అప్పటికే కిరోసిన్ కొంత ఆమెపై పడింది. తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లాడు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలియజేసింది. సమస్యను పరిష్కరిస్తానని ఇలాంటి కార్యకాలపాలకు పాల్పడవద్దని అన్నారు. -
నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండల కేంద్రానికి చెందిన సిరిగిరి శ్యామల (25) జీవితంపై విరక్తి చెంది గురువారం వేకువజామున నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మా రం ఎస్సై కోట బాబురావు తెలిపారు. శ్యామల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో జీవితంపై విరక్తిచెంది గత నెల 22న పురుగుల మందు తాగింది. కుటుంటు సభ్యులు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రెండు రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చారు. ఓ వైపు అనారోగ్య సమస్య, మరోవైపు ఆర్థికంగా నష్టపోయానని బాత్రూంలోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. శ్యామల సోదరుడు మోతం మహేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
బడి భారమై..
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్ : తల్లిదండ్రులు తమ కుమారుడిని బంధువుల ఇంట్లో పెట్టి చదివిస్తున్నారు. వారికి దూరంగా ఉండి చదువుకోవడం ఆ విద్యార్థికి ఇష్టంలేదు. చాలామార్లు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా.. అక్కడే చదువుకో.. ఏడాది తర్వాత ఇక్కడే బడికి వెళుదువులే అంటూ బుజ్జగిస్తూ వచ్చారు. అయినా ఆ బాలుడు మాత్రం ఇంటి మీదే బెంగతో ఉండేవాడు. ఉన్నట్లుండి బుధవారం బత్తల నవీన్ అనే 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాడు. పోలీసుల కథనం ప్రకారం... మైలవరం మండలం కంబాలదిన్నెకు చెందిన నాగరాజుకు నాగప్రసాద్, నవీన్, నరేష్ అనే ముగ్గురు కుమారులున్నారు. మైదుకూరులోని మూలబాటవీధిలో ఉంటున్న నాగరాజు తమ్ముడు నాగేశ్వరరావుకు పిల్లలు లేరు. దీంతో నాగరాజు రెండో కుమారుడైన నవీన్‌ను ఎనిమిదేళ్ల క్రితం అతను మైదుకూరుకు తీసుకొని వెళ్లి చదివిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు కుమారులు నాగప్రసాద్ ఇంటర్ చదువుతుండగా, నరేష్ ఏడోతరగతి చదువుతున్నాడు. మైదుకూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బత్తల నవీన్(14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం నవీన్ తన మామ కుమార్తె వివాహం చూడటానికి కంబాలదిన్నెకు వచ్చాడు. నాలుగు రోజులపాటు బంధువులందరితో సంతోషంగా గడిపాడు. ఏం జరిగిందో ఏమోకానీ బుధవారం ఉదయం ఉన్నట్టుండి నవీన్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ ఎంతసేపైనా బయటికి రాలేదు. గదిలో నుంచి కిరోసిన్ వాసన, పొగ రావడంతో నాగేశ్వరరావుతోపాటు మరికొందరు తలుపులు పగులకొట్టి లోపలికి వెళ్లారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని వెంటనే ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి నాగరాజు, తల్లి సుబ్బలక్షుమ్మతోపాటు సోదరులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. చదవడం ఇష్టం లేకే.. స్వగ్రామానికి దూరంగా ఉంటూ చదువుకోవడం తనకిష్టంలేదని ఆ విద్యార్థి గతంలో చాలాసార్లు తల్లిదండ్రులతో చెప్పారని బంధువులు అంటున్నారు.ఆ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. కాగా కడుపునొప్పి తాళలేక బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం మధ్యాహ్నం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.