
ప్రతీకాత్మక చిత్రం
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండల కేంద్రానికి చెందిన సిరిగిరి శ్యామల (25) జీవితంపై విరక్తి చెంది గురువారం వేకువజామున నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మా రం ఎస్సై కోట బాబురావు తెలిపారు. శ్యామల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో జీవితంపై విరక్తిచెంది గత నెల 22న పురుగుల మందు తాగింది.
కుటుంటు సభ్యులు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రెండు రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చారు. ఓ వైపు అనారోగ్య సమస్య, మరోవైపు ఆర్థికంగా నష్టపోయానని బాత్రూంలోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. శ్యామల సోదరుడు మోతం మహేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment