![Woman Attempts Self ablaze front Of At magistrte Office - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/14/Woman-Attempts.jpg.webp?itok=Uq0y6HH8)
సాక్షి,నాగర్‌కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాలు..బిజినేపల్లి మండలం సల్కరిపేటకు చెందిన జ్యోతి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. తన భర్త మృతి చెందడంతో భూమికోసం రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతుంది. వారసత్వంగా రావలసిన భూమి తనకు ఇవ్వకుండా తన బావ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అధికారులకు మొరపెట్టుకుంది. భూమి దగ్గరికి వస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని విన్నవించుకుంది.
ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగి పోయిన మహిళ కిరోసిన్ డబ్బాతో ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కురుమయ్య కిరోసిన్ బాటిల్ లాక్కున్నాడు. అప్పటికే కిరోసిన్ కొంత ఆమెపై పడింది. తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లాడు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలియజేసింది. సమస్యను పరిష్కరిస్తానని ఇలాంటి కార్యకాలపాలకు పాల్పడవద్దని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment