పిచ్చి ప్రయోగం.. కొంచెమైతే గోవింద | He Shot At Fridge Filled With Explosives | Sakshi

పిచ్చి ప్రయోగం.. కొంచెమైతే గోవింద

Published Wed, Jun 7 2017 4:47 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

పిచ్చి ప్రయోగం.. కొంచెమైతే గోవింద

పిచ్చి ప్రయోగం.. కొంచెమైతే గోవింద

ప్రపంచంలో చాలామంది కిక్కు కోసం వింతవింత పనులు చేస్తుంటారు. తమ మనసు ఉల్లాసంగా ఉండటం కోసం ఎలాంటి పర్యావసనాలు ఆలోచించకుడా అనిపించిందే తడువుగా ఆ పని పూర్తి చేస్తారు. ఏదైనా జరిగితేనేమో ఎందుకు చేశాన్రా అని, జరగకుంటే హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకుంటారు. ఓ వ్యక్తి కూడా దాదాపు ఓ పిచ్చి ప్రయోగం చేసి రెప్పపాటు ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు. దాదాపు గుండె ఆగిపోయేంతటి దృశ్యాన్ని స్వయంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడా వీడియో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.

ఆ వీడియోలో చూపించిన ప్రకారం.. ఓ వ్యక్తి ఓ రిఫ్రిజిరేటర్‌ను కొంతమంది వ్యక్తుల సహాయంతో తీసుకొచ్చి ఒక మైదానంలో తనకు దూరంగా పెట్టాడు. దాని నిండా కొన్ని పేలుడు పదార్థాలు నింపాడు. అనంతరం రెండు శాఖలుగా విడిపోయిన ఓ చెట్టు చాటుకు వెళ్లి మధ్యలో నుంచి తుపాకీని ఎక్కుపెట్టి నేరుగా ఆ ఫ్రిజ్‌ను షూట్‌ చేశాడు. దాంట్లో పేలుడు పదార్థాలు ఉన్న కారణంగా అది పెద్ద మొత్తంలో శబ్దం చేస్తూ పేలిపోయింది. అయితే, ఆ ఫ్రిజ్‌ డోర్‌ మాత్రం నేరుగా అతడి మీదకే దూసుకొచ్చింది. అదృష్టం కొద్ది అతడి చెట్టు అడ్డుగా ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే తాను తవ్వుకున్న గోతిలోనే తాను తవ్వుకున్న చందంగా పరిస్థితి మారిపోయేది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement