
ఒకే కుటుంబంలో 18 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ సైన్యం యథేచ్ఛగా జరుపుతున్న దాడులతో గాజా ప్రాంతం రక్తమోడుతోంది. శనివారం ఉదయం జవైదా పట్టణంలోని ఓ నివాసంతోపాటు పక్కనే ఉన్న శరణార్థులు తలదాచుకున్న భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో సమీ జవాద్ అల్ ఎజ్లా, అతడి కుటుంబంలోని 18 మంది మృత్యువాతపగా, మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులను సమీ ఇద్దరు భార్యలు, 2 నుంచి 22 ఏళ్ల వయస్సున్న 11 మంది సంతానం, వారి అమ్మమ్మ, మరో ముగ్గురు బంధువులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి చేపలు, మాంసం తరలించే ప్రక్రియకు సమీ సమన్వకర్తగా వ్యవహరించేవాడని, చాలా మంచి వ్యక్తని చెప్పారు. ఘటన సమయంలో రెండు భవనాల్లో కలిపి 40 మంది వరకు ఉన్నట్లు వివరించారు. ఇలా ఉండగా, సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం పాలస్తీనియన్లను హెచ్చరించింది. ఆ ప్రాంతం వైపు నుంచే తమ భూభాగం మీదికి మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తున్నారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment