కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం | Tragic fire claims four member Malayali family deceased in Kuwait | Sakshi
Sakshi News home page

కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం

Jul 20 2024 1:30 PM | Updated on Jul 20 2024 1:36 PM

Tragic fire claims four member Malayali family deceased in Kuwait

గల్ఫ్‌​ దేశం కువైట్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ  ప్రమాదంలో ఓ భారతీయ కుటుంబం సజీవదహనం అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కువైట్‌లోని అబ్బాసియా ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో చోటు చేసుకుంది.

వివరాలు.. కేరళకు చెందిన నాలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు రాత్రి 9 గంటలకు నిద్రపోయిన తర్వాత వారిలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం  అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే ఆ కుటుంబం మంటల్లో సజీవదహనం అయింది.

మృతి చెందినవారిని మాథ్యూ ములక్కల్ (40), అతని భార్య లిని అబ్రహం (38), వారి పిల్లలు ఇరిన్ (14),ఇస్సాక్ (9)గా గుర్తించారు. వీరు కేరళలో అలప్పుజ జిల్లాలోని నీరట్టుపురానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇటీవల వారు కేరళ వచ్చి.. శుక్రవామరే అక్కడివెళ్లారు. అంతలోనే రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనలో కుటుంబం మొత్తం మృతి చెందటంపై తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు కనీరుమున్నీరు అవుతున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే  అగ్నిప్రమాదం ఇంట్లోని ఏసీ పవర్‌ ఫెయిల్యూర్‌ కారణంగా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో వారంతా విషపూరిత వాయువును పీల్చుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక.. గతనెల ఓ అపార్టుమెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో మొత్తం 49 మంది మరణించగా.. 45  మంది భారతీయులేనని అధికారలు గుర్తించారు. ఇందులో కేరళ, తళమిళనాడుకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement