![Hanmakonda Road Accident Kills Four From One Family - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/22/Hanmakonda-Road-Accident.jpg.webp?itok=ZYYsqnQM)
హనుమకొండ, సాక్షి: జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం తెల్లవారుజామున ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. గాయపడిన వాళ్లను వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీళ్లంతా ఏటూరునాగారంకు చెందిన ఒకే కుటుంబంగా నిర్ధారణ అయ్యింది. దైవదర్శనం కోసం శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాల్ని ఎంజీఎం మార్చురీకి తరలించి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
మృతులు
మంతెన కాంతయ్య(72)
మంతెన శంకర్(60)
మంతెన భారత్(29)
మంతెన చందన(16)
చికిత్స పొందుతున్నవాళ్లు
మంతెన రేణుక(60)
మంతెన భార్గవ్(30)
మంతెన శ్రీదేవి(50)
Comments
Please login to add a commentAdd a comment