అమెరికాలో అతిపెద్ద టెలికాం దిగ్గజం ఏటీ అండ్ టీలో కలకలం రేపింది. ఆ సంస్థ యూజర్ల డేటా డార్కెట్ వెబ్‌లో ప్రత్యక్షమైంది. రెండు వారాల క్రితం ‘డార్క్వెబ్’ లో విడుదలైన డేటా కారణంగా సుమారు 7.6 మిలియన్ల మంది ప్రస్తుత ఖాతాదారులు, 65.4 మిలియన్ల మాజీ ఖాతాదారులపై ప్రభావం చూపినట్లు సమాచారం. ఇదే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఏటీ అండ్ టీ ప్రతినిధులు వెల్లడించారు.
పలు నివేదికల ప్రకారం.. డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమైన ఏటీ అండ్ టీ కంపెనీ యూజర్ల డేటా 2019 సంవత్సరం నాటిదని తెలుస్తోంది. ఆ డేటాను ఉపయోగించిన సైబర్ నేరస్తులు అనధికారికంగా తమ డేటాను యాక్సిస్ చేసిన ఆధారాలు లేవని, అయితే డేటా లీకేజీ సంస్థ నుంచి వచ్చిందా లేదంటే సిబ్బంది వల్లే ఇలా జరిగిందా? అన్న అంశంపై ఏటీ అండ్ టీ విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది.
పాస్‌వర్డ్‌లు రీసెట్
ఈ ఘటన తమ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, డేటా లీకేజీ అందుకు గల కారణాల్ని అంచనా వేస్తున్నామని ఏటీ అండ్ టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. బాధిత యూజర్లతో ఏటీ అండ్ టీ సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత 7.6 మిలియన్ యూజర్ల పాస్ వర్డ్‌లను రీసెట్ చేసింది. అవసరమైన చోట క్రెడిట్ మానిటరింగ్ అందిస్తామని తెలిపింది. కాగా, 5జీ నెట్‌వర్క్ యునైటెడ్ స్టేట్స్ అంతటా సుమారు 290 మిలియన్ల ప్రజలకు సేవల్ని అందిస్తోంది.
ఫిబ్రవరిలో అంతరాయం
ఫిబ్రవరిలో ఎటి అండ్ టిలో అంతరాయం ఏర్పడింది. దీంతో వేలాది మంది యుఎస్ వినియోగదారులు కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు పంపడంలో అంతరాయం కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment