Users Data
-
దిగ్గజ టెలికం కంపెనీలో కలకలం, 73 మిలియన్ల మంది యూజర్ల డేటా లీక్
అమెరికాలో అతిపెద్ద టెలికాం దిగ్గజం ఏటీ అండ్ టీలో కలకలం రేపింది. ఆ సంస్థ యూజర్ల డేటా డార్కెట్ వెబ్‌లో ప్రత్యక్షమైంది. రెండు వారాల క్రితం ‘డార్క్‌వెబ్’ లో విడుదలైన డేటా కారణంగా సుమారు 7.6 మిలియన్ల మంది ప్రస్తుత ఖాతాదారులు, 65.4 మిలియన్ల మాజీ ఖాతాదారులపై ప్రభావం చూపినట్లు సమాచారం. ఇదే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఏటీ అండ్ టీ ప్రతినిధులు వెల్లడించారు. పలు నివేదికల ప్రకారం.. డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమైన ఏటీ అండ్ టీ కంపెనీ యూజర్ల డేటా 2019 సంవత్సరం నాటిదని తెలుస్తోంది. ఆ డేటాను ఉపయోగించిన సైబర్ నేరస్తులు అనధికారికంగా తమ డేటాను యాక్సిస్ చేసిన ఆధారాలు లేవని, అయితే డేటా లీకేజీ సంస్థ నుంచి వచ్చిందా లేదంటే సిబ్బంది వల్లే ఇలా జరిగిందా? అన్న అంశంపై ఏటీ అండ్ టీ విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. పాస్వర్డ్లు రీసెట్ ఈ ఘటన తమ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, డేటా లీకేజీ అందుకు గల కారణాల్ని అంచనా వేస్తున్నామని ఏటీ అండ్ టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. బాధిత యూజర్లతో ఏటీ అండ్ టీ సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత 7.6 మిలియన్ యూజర్ల పాస్ వర్డ్‌లను రీసెట్ చేసింది. అవసరమైన చోట క్రెడిట్ మానిటరింగ్ అందిస్తామని తెలిపింది. కాగా, 5జీ నెట్వర్క్ యునైటెడ్ స్టేట్స్ అంతటా సుమారు 290 మిలియన్ల ప్రజలకు సేవల్ని అందిస్తోంది. ఫిబ్రవరిలో అంతరాయం ఫిబ్రవరిలో ఎటి అండ్ టిలో అంతరాయం ఏర్పడింది. దీంతో వేలాది మంది యుఎస్ వినియోగదారులు కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు పంపడంలో అంతరాయం కలిగింది. -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
గూగుల్‌కు బిగ్ షాక్.. రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించాల్సిందే
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. యూజర్ల అనుమతి లేకుండా వారి మ్యాప్స్, లొకేషన్లను ట్రాక్ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో.. టెక్ దిగ్గజం 93 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఏయే యాప్స్ వాడుతున్నారు. మీకు ఎలాంటి ప్రొడక్ట్‌లంటే ఇష్టం ఇదిగో ఇలాంటి వివరాల్ని గూగుల్ మనకు తెలియకుండా.. మనల్ని ట్రాక్ చేస్తుంది. ఆ డేటాతో ఆయా ప్రాంతానికి సంబంధించిన సర్వీసుల్ని, కొత్త ప్రొడక్ట్‌లను, ఫీచర్లను అభివృద్ది చేస్తుంది. గూగుల్ చెప్పినట్లు చేయడం లేదు దీంతో పాటు, మీరేదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలని అనుకున్నారు. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను ఓపెన్ చేసి అందులో మీరు కొనాలనుకుంటున్న ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారు. ఆ మరుక్షణమే మీరు ఏ ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారో? ఆ ప్రొడక్ట్‌తో పాటు మిగిలిన ఉత్పత్తులు వివరాల్ని సైతం గూగుల్ మీకు అందిస్తుంది. ఇలా యూజర్లకు ఏం కావాలో.. వాటిని అందించి తద్వారా భారీ ఎత్తున లాభాల్ని గడిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గూగుల్ మాత్రం యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ చేయలేమని స్పష్టం చేస్తోంది. కానీ అలా చేయడం కుదరదని తెలుస్తోంది. గూగుల్‌పై రూ.7,000 కోట్ల దావా ఫైల్ ఈ తరుణంలో నిబంధనల్ని ఉల్లంఘించి యూజర్లను ట్రాక్ చేసి.. ఆ డేటా ద్వారా సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తూ గూగుల్‌పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దావా ఫైల్ చేశారు. యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవచ్చని, అలా చేయడం వల్ల వ్యక్తిగత డేటా ను సేకరించకుండా నియంత్రించుకోవచ్చని చెబుతోంది. కానీ గూగుల్ అలా చేయడం లేదని, యూజర్లడేటాను సేకరిస్తుందని ఆరోపించారు. గూగుల్ తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగదారుల కదలికల్ని ట్రాక్ చేస్తూనే ఉంద’ని బోంటా తెలిపారు. ఇది ఆమోదయోగ్యం కాదని, గూగుల్ అవలంభిస్తున్న తప్పుడు విధానాల కారణంగా పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫలితంగా గూగుల్ త్వరలో ఈ భారీ మొత్తం చెల్లించనుంది. 93 మిలియన్ డాలర్ల చెల్లింపులు తమపై వస్తున్న ఆరోపణల్ని గూగుల్ యాజమాన్యం అంగీకరించినట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఆరోపణలకు పరిష్కార మార్గంగా 93 మిలియన్ డాలర్ల చెల్లింపులతో పాటు లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, లొకేషన్ డేటాను ట్రాక్ చేసే ముందు వారికి నోటిఫికేషన్లు ఇవ్వడం వంటి గణనీయ మార్పులు చేసేలా ఓ అంగీకారానికి వచ్చింది. గూగుల్ దారిలో మెటా యూజర్ల డేటాను అనుమతి లేకుండా వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నది గూగుల్ మాత్రమే కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, మార్క్ జుకర్ బర్గ నేతృత్వంలోని మెటా సైతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఐరోపాలోని ఫేస్బుక్ (మెటా) వినియోగదారుల నుండి సేకరించిన డేటాను యూఎస్‌కు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా 1.2 బిలియన్ యూరోలు (1.3 బిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి👉🏻 బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు -
నెట్‌ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు డేటా చోరీకి, ఆన్లైన్లో వినియోగదారులను మోసం చేసేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అధునాతన టెక్నిక్స్‌తో హ్యాకర్లు చెలరేగిపోతున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ స్కామ్ ఒకటి వెలుగులో వచ్చింది. హ్యాకర్లు ఫిషింగ్ ప్రచారం ద్వారా వినియోగదారుల చెల్లింపు వివరాలను చోరీ చేస్తున్నారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) నెట్‌ఫ్లిక్స్ స్కామ్ 2023 చెక్ పాయింట్ రీసెర్చ్ గుర్తించింది. చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్‌లోని డేటా గ్రూప్ మేనేజర్ ఒమర్ డెంబిన్స్కీ, వీలైనంత ఎక్కువ మంది వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి హ్యాకర్లు ఫిషింగ్ ప్రయత్నాలను ప్లాన్ చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో, నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ ప్రచారంలో ఎటాక్ చేసినట్టుగా గుర్తించింది. మరికొన్ని చెల్లింపు వివరాలను తస్కరించేందుకు ప్రయత్నించాయని తెలిపింది. యూజర్ ఏదైనా ఒక పేమెంట్ చేసినపుడు హ్యాకర్లు చొరబడతారు. తదుపరి బిల్లింగ్ అపుడు నెట్‌ఫ్లిక్స్ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడిందంటూ ఫేక్ ఐడీనుంచి ఇమెయిల్ వస్తుంది. అంతేకాదు సభ్యత్వాన్ని పునరుద్ధరించు కోండంటూ ఒక లింక్‌ను కూడా షేర్ చేస్తుంది. ఆ లింక్‌ను నమ్మి వివరాలు అందించారో వారి పని సులువు అవుతుంది. ఈ లింక్ వారి క్రెడిట్ కార్డ్ సమాచారం కోసం ఉద్దేశించిన మోసపూరిత వెబ్‌సైట్‌కి మళ్లించి మోసానికి పాల్పడతారు. బ్రాండ్ ఫిషింగ్ దాడులకు గురయ్యే వారిలో ఎక్కువ మంది టెక్-అవగాహన లేని వారేనని చెక్ పాయింట్ తెలిపింది. ఈనేపథ్యంలో అయాచిత ఇమెయిల్స్ లేదా సందేశాలను స్వీకరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ సూచించింది.ముఖ్యంగా అక్షరదోషాలు, తప్పుగా వ్రాసిన వెబ్సైట్లు, సరికాని తేదీలు ,మోసపూరిత ఇమెయిల్ లేదా లింక్‌ను సూచించే ఇతర కారకాలు వంటి ప్రమాద సంకేతాలను గుర్తించాలని ఇందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని డెంబిన్స్కీ సలహా ఇచ్చారు. డిసెంబర్ 2022లో, ముంబైకి చెందిన 74 ఏళ్ల వ్యక్తి తన నెట్‌ఫ్లిక్స్ ఖాతాను పునఃప్రారంభించే ప్రయత్నంలో 1,200 డాలర్లను కోల్పోయాడనీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి లేదా సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించడానికి వినియోగదారుని అభ్యర్థించే ఇమెయిల్ మూలాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలని హెచ్చరించింది. తాజా పరిణామంపై నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. (Twitter Down: ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!) ఎలా గుర్తించాలి ఆన్లైన్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఎల్లప్పుడూ పంపినవారి గుర్తింపును ధృవీకచుకోవాలి. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయడానికి ముందు వెబ్సైట్ URLని తనిఖీ చేయాలి. యాంటీ-ఫిషింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. తాజా భద్రతా ప్యాచ్‌లతో అప్డేట్ చేయడం ద్వారా ఫిషింగ్ దాడులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సైబర్ నేరగాళ్లకి అవకాశం ఇవ్వకుండా నిరంతరం అప్రతమత్తంగా ఉండాలి. -
షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి?
న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్‌ను బిలియనీర్ ఎలాన్ మస్క్ టేకోవర్ చేసి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుండగా మస్క్ భారీ షాక్ ఇచ్చే వార్త ఒకటి తాజాగా హల్ చల్ చేస్తోంది. భారీ ఎత్తున ఉద్యోగ కోతలపై విమర్శలు, తరువాత బ్లూటిక్ వెరిఫికేషన్ ప్లాన్ లాంటి గందరగోళం మధ్య, యూజర్ల భావ ప్రకటనా స్వేచ్ఛ, నకిలీ ఖాతాలకు చెక్ , పూర్తి భద్రత అంటూమస్క్ పదే పదే నొక్కి వక్కాణిస్తున్న తరుణంలో ట్విటర్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్త కలకలం రేపింది. అంతర్గత లోపం ద్వారా ట్విటర్ వినియోగదారుల డేటా చోరీ చేసి ఆన్లైన్లో ప్రైవేట్‌గా షేర్ చేసినట్టు తెలుస్తోంది. (అయ్య బాబోయ్ ఇలా అయిపోతామా!మండే మోటివేషన్: ఆనంద్ మహీంద్ర ట్వీట్స్ వైరల్) ఇదీ చదవండి: వాట్సాప్ డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి, స్పందించకండి! సుమారు 5.4 మిలియన్ల (5.5 కోట్లు) ట్విటర్ వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలకు తోడు అదనంగా 1.4 మిలియన్ల ట్విటర్ ప్రొఫైల్స్ చోరీ అయ్యాయట. ట్విటర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API)ని ఉపయోగించి సెలబ్రిటీల నుండి కంపెనీల వరకు వినియోగ దారుల కీలకమైన వ్యక్తిగత డేటాను లీక్ చేసినట్టు తెలుస్తోంది. ట్విటర్ ఐడీలు, ప్రదేశాలు, పేర్లు, లాగిన్ పేర్లు లాంటి పబ్లిక్ సమాచారంతోపాటు, ఫోన్ నంబర్లు, ఇమెయిల్ అడ్రస్‌లు ఇతర ప్రైవేట్ డేటాను హ్యాకర్లు కొట్టేసి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేశారని సమాచారం. ట్విటర్ డేటా ఉల్లంఘన గత జూలైలోనే హ్యాకర్ 5.4 మిలియన్లకు పైగా ట్విట్టర్ వినియోగదారుల ప్రైవేట్ సమాచారాన్ని హ్యాకింగ్ ఫోరమ్‌లో 30వేల డార్లకు విక్రయించడం ప్రారంభించాని వార్తలొచ్చాయి. అయితే దీంతోపాటు మరో ఏపీఐ ద్వారా 1.4 మిలియన్ల ట్విటర్ ప్రొఫైల్స్ కూడా ఏపీఐ ద్వారా చోరీ అయ్యాయి. అంతేకాదు దాదాపు 7 మిలియన్ ట్విట్టర్ ప్రొఫైల్స్ ప్రైవేట్ సమాచారం లీక్ అయిందని బ్లీపింగ్ కంప్యూటర్ నివేదించింది. ఇంకా, ఆగస్ట్‌లో విక్రయించిన అసలు డేటాలో ఈ ఫోన్ నంబర్లు లేవనీ, ఇంతకుముందు వెల్లడించిన దానికంటే పెద్ద Twitter డేటా ఉల్లంఘన అని పేర్కొంది. మరోవైపు ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్ బ్రీచ్డ్ ఫోరమ్స్ ద్వారా ఈ డేటా విక్రయానికి ఉన్నట్టు ఒక హ్యాకర్ హెచ్చరించాడు. భద్రతా నిపుణుడు చాడ్ లోడర్ తొలుత ఈ వార్తలను ట్విటర్లో పోస్ట్ చేసిని వెంటనే అతని ఖాతాను బ్లాక్ చేయడంతో మాస్టోడాన్‌లో ఈ పెద్ద డేటా ఉల్లంఘనకు సంబంధించిన నమూనాను పోస్ట్ చేసారు.ఈయూ, అమెరికా దేశాలకు చెందిన మిలియన్ల కొద్దీ ట్విటర్ ఖాతాలు ప్రభావితమైందనీ, ఈ ఉల్లంఘన 2021 కంటే ముందుగానే జరిగిందని లోడర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు హ్యాకింగ్ ముప్పు మరింత ముదురుతోందని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, 17 మిలియన్లకు పైగా రికార్డులు లీక్ చేసినట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించాడు. ఈ నివేదికపై ట్విటర్, మస్క్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా లాగిన్ క్రెడెన్షియల్స్ యాక్సెస్‌లో సమస్యలు, మీ ఖాతా సస్పెండ్ చేయబడిందంటూ మీకు ఇమెయిల్ వస్తే ఫిషింగ్ ఎటాక్‌గా అనుమానించి, ఆ మెయిల్‌ను పరిశీలించడం చాలా అవసరమని నిపుణులు హెచ్చరించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వాట్సాప్ డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి, స్పందించకండి!
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌లో డేటా బ్రీచ్ యూజర్లకు భారీ షాకిస్తోంది. ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్లైన్ సేల్ అయ్యాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. యూఎస్, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారతదేశంతో సహా 84 వేర్వేరు దేశాల వాట్సాప్ వినియోగదారుల మొబైల్ నంబర్లను ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 50 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు విక్రయానికి సైబర్‌న్యూస్ నివేదిక ప్రకారం అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఒకటిగా భావిస్తున్న ఈ వ్యవహారంలో దాదాపు 500 మిలియన్ల వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్ల డేటాబేస్ ఆన్లైన్లో విక్రయానికి ఉంచారు. 2022 డేటాబేస్‌లో 487 మిలియన్ల యూజర్ల మొబైల్ నంబర్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంటూ ఒక థ్రెట్యాక్టర్ ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. డేటా బ్రీచ్ ద్వారా సేకరించిన సమాచారంతో ఫిషింగ్ ఎటాక్స్ చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో వాట్సాప్ వినియోగ దారులు తెలియని నంబర్ల కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ డేటాసెట్ ఈ డేటా బ్రీచ్‌లో మనదేశంలో 61.62 లక్షల మంది, అమెరికాకు చెందిన 32 మిలియన్ మంది ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఈజిప్ట్ నుంచి 45 మిలియన్లు, ఇటలీ నుంచి 35 మిలియన్లు సౌదీ నుంచి 29 మిలియన్లు, ఫ్రాన్స్‌నుంచి 20 మిలియన్, టర్కీ నుంచి 20 మిలియన్ల మంది డేటా ఉన్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన 10మిలియన్ల యూజర్లు, యూకే నుంచి 11మిలియన్ పౌరుల ఫోన్ నంబర్ల డేటా లీక్ అయినట్టు తెలిపింది. అమెరికా యూజర్ల డేటాను 7వేల డాలర్లు (సుమారు రూ. 5,71,690)కి విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. యూకే, జర్మనీ డేటాసెట్ల ధర వరుసగా 2,500 డాలర్లు (సుమారు. ₹2,04,175) 2వేల డాలర్లు (సుమారుగా ₹1,63,340) అమ్మకానికిపెట్టినట్టు నివేదించింది. కాగా మెటా, తన ప్లాట్‌ఫారమ్స్‌లో డేటా బ్రీచ్ ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, 500 మిలియన్లకు పైగా ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఆన్లైన్లో లీకయ్యాయి. లీకైన డేటాలో ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు లీకైన సంగతి తెలిసిందే. -
శాంసంగ్ యూజర్లకు షాకింగ్ న్యూస్, భారీగా డేటా లీక్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన యూజర్లకు భారీ షాకిచ్చింది. శాంసంగ్ ఫోన్లనుంచి భారీఎత్తున డేటా లీక్ అయిందని తాజాగా తెలిపింది. ఇందులో ప్రధానంగా యూజర్ల పుట్టినరోజులు, కాంటాక్ట్ డేటా లాంటి వ్యక్తిగత డేటా ఉల్లంఘన జరిగినట్టు తెలిపింది. ఈ మేరకు కొంతమంది యూజర్లను ఈమెయిల్ ద్వారా అలర్ట్ చేస్తోంది. ఈ ఏడాది జులైలో జరిగిన డేటా ఉల్లంఘనలో అమెరికాలోని శాంసంగ్ యూజర్ల డేటా బహిర్గతమైంది. దీనికి సంబంధించి శాంసంగ్ కంపెనీ ఒక బ్లాగ్‌పోస్ట్ సమాచారంలో తెలిపింది. అనధికారిక థర్డ్ పార్టీ ద్వారా అమెరికా సిస్టమ్‌ల నుంచి వినియోగదారుల ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ లాంటి డేటాను లీక్ చేసినట్టు సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ పేర్కొంది. జులై 2022 చివరలో ఇది చోటు చేసుకుంది. ఆగస్ట్ 4, 2022న నిర్దిష్ట కస్టమర్ల వ్యక్తిగత డేటా ప్రభావితమైందని తేలింది. దీనిపై విచారణ చేయగా భారీ డేటా బహిర్గతమైందని గుర్తించినట్టు 30 రోజుల తర్వాత ఈ పరిమిత సమాచారాన్ని పూర్తిగా విడుదల చేసింది. వెల్లడించింది. అయితే ఇది ఇతర సోషల్ సెక్యూరిటీ నంబర్లు క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్లను ప్రభావితం చేయ లేదని శాంసంగ్ నిర్ధారించింది. డేటా లీకైన సిస్టమ్‌లను సేఫ్‌గా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారని బ్లాగ్‌లో పేర్కొంది. అలాగే ఈ విషయం గురించి కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నామని తెలిపింది. అయినా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే లేదా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే వెబ్ పేజీలకు డైవర్ట్ చేసే లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండమని వినియోగ దారులను కోరింది. అనుమానాస్పద లింక్‌లు లేదా అనుమానాస్పద ఇమెయిల్‌ల నుండి అటాచ్మెంట్లపై క్లిక్ చేయడం మానుకోవాలని వినియోగదారులను కోరింది. -
‘కూ’ కోటి యూజర్ల రికార్డ్
న్యూఢిల్లీ: దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘కూ’ యూజర్ల సంఖ్య కోటి దాటింది. వచ్చే ఏడాది కాలంలో పది కోట్ల యూజర్ల మార్క్‌ను సాధించడమే తమ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. తమ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. మార్కెట్ ఆఫర్ చేస్తున్న వృద్ధి అవకాశాల పరంగా చూస్తే తాము ఇంకా ఎంతో సాధించగలమన్నారు. ఇంటర్నెట్ యూజర్లలో 2 శాతం లోపే తమ భావాలను మైక్రోబ్లాగింగ్ వేదికలపై వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ‘‘మైక్రోబ్లాగింగ్ ద్వారా తమ గళాన్ని దేశంలో ఎవరికైనా చేరువ చేయవచ్చు. 98 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులకు దీనిపై అవగాహన లేదు’’ అని రాధాకృష్ణ చెప్పారు. ఈ మార్కెట్‌పైనే కూ దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. ‘కూ’ (ట్విట్టర్ మాదిరి) ఆరంభమైన 15–16 నెలల్లోనే కోటి యూజర్ల మార్క్‌ను సాధించగా.. అందులోనూ 85 లక్షల డౌన్లోడ్లు ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాతే నమోదు కావడాన్ని గమనించాలి. ‘ప్రస్తుతం కోటిగా ఉన్న డౌన్లోడ్లు ఏడాది కాలంలో 10 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత వచ్చే కొన్నేళ్లలో 50 కోట్ల మార్క్‌ను చేరుకుంటాం’ అని రాధాకృష్ణ వివరించారు. -
Truecaller: ట్రూకాలర్ యూజర్లకు అలర్ట్..!
ముంబై: ట్రూకాలర్ మొబైల్ అప్లికేషన్ దేశంలోని చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించి యూజర్ డేటాను ఇతర సంస్థలో పంచుకుందని పేర్కొంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు బుధవారం కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. శశాంక్ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో..ట్రూకాలర్ యాప్ వినియోగదారులందరి డేటాను సేకరించి, వారి అనుమతి లేకుండా ఇతర భాగస్వాములతో వినియోగదారుల డేటాను పంచుకుంటుందని పేర్కొన్నాడు. ఈ వ్యాజ్యాన్ని ఛీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీ ఎస్ కులకర్ణితో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. యూజర్ల డేటా వారికి తెలియకుండా.. యూజర్లకు వేరే యాప్ అందుబాటులో లేకపోవడంతో ట్రూకాలర్ ఆటలు సాగుతున్నాయని పేర్కొన్నాడు. ట్రూకాలర్ యూజర్ల డేటాను వారికి తెలియకుండా గూగుల్ ఇండియా, భారతి ఎయిర్ టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, అనేక రుణాలు అందించే సంస్థలకు అందిస్తున్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ఐటి విభాగం, ట్రూకాలర్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పి, ఐసిఐసిఐ బ్యాంక్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ పేర్కొన్నాడు. ట్రూకాలర్ యాప్ యూజర్ల అనుమతి లేకుండానే యూపిఐ సేవలను అందిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం..! ప్రభుత్వ అధికారులు ట్రూకాలర్ యాప్‌ను సరైన తనిఖీలు లేకుండా ఆమోదించారని ఆరోపించారు. ట్రూకాలర్ తన మొబైల్ అప్లికేషన్ ద్వారా పౌరుల డేటా గోప్యతను పూర్తిగా ఉల్లంఘించిందని కోర్టుకు విన్నవించాడు. అంతేకాకుంగా యాప్ డేటా రక్షణ చట్టాలను పూర్తిగా అతిక్రమిస్తోందని పేర్కొన్నాడు. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు మూడువారాల్లోపు సమాధానమివ్వాలని సూచించింది. -
5జీ యూజర్లు @ 33 కోట్లు!
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెలికం సేవలకు సంబంధించి యూజర్ల సంఖ్య 2026 నాటికి 33 కోట్లకు చేరే అవకాశం ఉంది. అలాగే ప్రతీ స్మార్ట్‌ఫోన్‌పై నెలవారీగా డేటా వినియోగం మూడు రెట్లు ఎగిసి 40 గిగాబైట్లకు (జీబీ) చేరనుంది. టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ బుధవారం ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం నెలవారీ ప్రతీ స్మార్ట్‌ఫోన్‌పై సగటు వినియోగం 14.6 జీబీగా ఉంటోంది. తద్వారా అత్యధిక డేటా వినియోగంలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ‘‘భారత్ ప్రాంతంలో 4జీ సబ్స్క్రిప్షన్లు 2020లో 68 కోట్లుగా ఉండగా 2026 నాటికి 83 కోట్లకు చేరతాయని అంచనా. 2026 ఆఖరు నాటికి భారత్‌లో మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 5జీ కనెక్షన్లు 26 శాతంగా దాకా .. అంటే సుమారు 33 కోట్ల స్థాయిలో ఉండవచ్చు’’ అని ఎరిక్సన్ నివేదికలో పేర్కొంది. 5జీపై మెట్రోల్లో ఆసక్తి.. మెగా, మెట్రో నగరాల్లో ప్రస్తుతం ఇంటి ఇంటర్నెట్ కనెక్షన్ కోసం కేవలం 4జీపైనే ఆధారపడుతున్న వారిలో దాదాపు 42 శాతం మంది .. 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ కనెక్షన్లపై ఆసక్తిగా ఉన్నట్లు ఎరిక్సన్ ఇండియా హెడ్ నితిన్ బన్సల్ తెలిపారు. ‘‘5జీ కనెక్టివిటీకి కేవలం 10 శాతం అధికం చెల్లించాల్సి రావచ్చు. అయితే, బండిల్డ్ డిజిటల్ సర్వీసులు కూడా లభిస్తే 5జీ కోసం 50 శాతం ఎక్కువైనా చెల్లించేందుకు భారత్‌లో 50 శాతం మంది వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. 5జీ అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాదిలో 4 కోట్ల మంది యూజర్లు కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. 2020లో స్మార్ట్‌ఫోన్ సబ్స్క్రిప్షన్లు 81 కోట్లుగా ఉండగా, ఏటా 7 శాతం వృద్ధి రేటుతో 2026 నాటికి 120 కోట్లకు చేరనున్నాయి. 2020లో మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్లలో స్మార్ట్ఫోన్ల వాటా 72 శాతంగా ఉంది. స్మార్ట్ఫోన్ల వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికి ఇది 98 శాతానికి చేరనుంది. భారత్‌లో స్మార్ట్ఫోన్ల వాడకం అధికంగా ఉండటంతో పాటు వర్క్ ఫ్రం హోమ్ అవసరాల కోసం కూడా స్మార్ట్ఫోన్లను వినియోగిస్తుండటంతో డేటా వినియోగం భారీగా ఉంది. గతంలో నెలకు 6.9 ఎక్సాబైట్లుగా (ఈబీ) ఉన్న మొ బైల్ డేటా వినియోగం, 2020 నాటికి 9.5 ఈబీకి పెరిగింది. 2026కి 4 రెట్లు పెరిగి 41 ఈబీకి చేరనుంది. కొత్తగా 43 కోట్ల పైచిలుకు స్మార్ట్ఫోన్లు సబ్స్క్రిప్షన్లు జత కానుండటంతో 2016 నాటికి వీటి సంఖ్య 120 కోట్లకు చేరనుంది. -
పారదర్శకతే లక్ష్యం: వాట్సాప్
న్యూఢిల్లీ: ప్రైవసీ పాలసీలో ప్రతిపాదిత మార్పులను ఉపసంహరించుకోవాలంటూ కేంద్రం ఆదేశాల నేపథ్యంలో మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పందించింది. ప్రతిపాదిత అప్డేట్ వల్ల మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను మరింతగా పంచుకోవడమనేది జరగదని వివరించింది. పారదర్శకంగా వ్యవహరించడమే తమ లక్ష్యమని పేర్కొంది. వ్యాపార సంస్థలు తమ కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించేందుకు, మరింత మందికి చేరువయ్యేందుకు అవసరమైన అవకాశాలను అందుబాటులో ఉంచడం తమ ఉద్దేశమని తెలిపింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాల్లో ఉన్నామని వివరించింది. దీనిపై ఎలాంటి ప్రశ్నలకైనా వివరణనిచ్చేందుకు సదా అందుబాటులో ఉంటామని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర గ్రూప్ సంస్థలతో తమ యూజర్ల వివరాలను పంచుకునే విధంగా ప్రైవసీ పాలసీని మారుస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాస్త వెనక్కి తగ్గి.. అప్డేట్ను మే 15 దాకా వాయిదా వేసింది. అటు కేంద్రం కూడా ఘాటుగా హెచ్చరించడంతో తాజా వివరణ ఇచ్చింది. -
వన్‌ప్లస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
బీజింగ్: చైనా మొబైల్ సంస్థ వన్‌ప్లస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ వినియోగదారుల వ్యక్తిగత డేటా, ఇతర సమాచారం లీక్ అయిందంటూ బాంబు పేల్చింది. "అనధికార పార్టీ" ద్వారా కస్టమర్ల డేటా లీకైందని వెల్లడించింది. ఈ మేరకు తన వినియోగదారులకు సమాచారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే, డేటా ఉల్లంఘనతో ఎంతమంది ప్రభావితమయ్యారనేది కంపెనీ స్పష్టంగా ప్రకటించలేదు. వన్‌ప్లస్ కస్టమర్ల ఆర్డర్ల ద్వారా హ్యాకర్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేశారని తెలిపింది. ముఖ్యంగా కస్టమర్ పేర్లు, కాంటాక్ట్ నంబర్లు, ఇమెయిల్, చిరునామా వంటి వివరాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, పాస్వర్డ్లు, ఆర్థిక వివరాలు భద్రంగా ఉన్నాయని హామీ ఇచ్చింది. దీనిపై తమ వినియోగదారులను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అందిస్తున్నామని వెల్లడించింది. ఈ డేటా బ్రీచ్ మూలంగా కొంతమందికి స్పామ్ మెసేజ్‌లు, నకిలీ ఈమెయిల్స్ రావచ్చని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత వారమే డేటా లీక్ విషయాన్ని గ్రహించామని, వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపింది. అంతేకాదు సంస్థనుంచి అధికారిక ఇమెయిల్ రాకపోతే, సంబంధిత వినియోగదారుని ఆర్డర్ సమాచారం సురక్షితమనే విషయాన్ని గమనించాలని వన్‌ప్లస్ వివరించింది. దీనిపై మరింత దర్యాప్తు కోసం సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నామని వన్‌ప్లస్ సెక్యూరిటీ టీం ప్రతినిధి జీవ్ సీ ఒక ప్రకటనలో తెలిపారు. -
41 కోట్ల యూజర్ల వివరాలు లీక్
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్బుక్ సర్వర్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా 41.9 కోట్ల మంది యూజర్ల వివరాలు బయటకు పొక్కాయని టెక్ క్రంచ్ అనే మీడియా సంస్థ తెలిపింది. ఇందులో 13.3 కోట్ల మంది అమెరికన్లు ఉండగా, 5 కోట్ల మంది వియత్నామీలు, 1.8 కోట్ల మంది బ్రిటిషర్లు ఉన్నారని వెల్లడించింది. ఈ ఘటనలో యూజర్ల ఫోన్ నంబర్లు, లింగం, నివాస ప్రాంతం తదితర వివరాలు బయటకు వచ్చేశాయని పేర్కొంది. సంబంధిత ఫేస్బుక్ సర్వర్‌కు పాస్వర్డ్ రక్షణ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందనీ, దీనివల్ల ఎవరైనా ఈ సర్వర్ నుంచి యూజర్ల పూర్తివివరాలను తీసుకునేందుకు వీలుకలిగిందని చెప్పింది. ఈ విషయాన్ని తాము ఫేస్బుక్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపింది. మరోవైపు ఈ విషయమై ఫేస్బుక్ స్పందిస్తూ.. దాదాపు 20 కోట్ల యూజర్ల వివరాలు బయటపడ్డాయనీ, ఈ సమాచారమంతా చాలా పాతదని వివరణ ఇచ్చింది. -
అమ్మకానికి కస్టమర్ల డేటా!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ తన వినియోగదారుల సమాచారాన్ని విక్రయించాలని 2012లో అనుకుందని ఓ మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది. ఫేస్‌బుక్‌కు చెందిన గ్రాఫ్ ఏపీఐలో వినియోగదారుల సమాచారం భారీస్థాయిలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ గ్రాఫ్ ఏపీఐలోని వివరాలు/సమాచారాన్ని పొందేందుకు కంపెనీల నుంచి కనీసం రెండున్నర లక్షల డాలర్లు వసూల చేయాలని ఫేస్బుక్ 2012లో భావించిందని అర్స్‌టెక్నికా అనే సంస్థ బయటపెట్టింది. 2014లో ఫేస్బుక్ ఆ నిర్ణయానికి కొన్ని మార్పులు చేసిందనీ, 2015 నాటికి గ్రాఫ్ ఏపీఐలోని కొద్ది సమాచారం మాత్రమే కంపెనీలకు అందుబాటులో ఉండేలా మార్పులు చేసిందని తెలిపింది. కోర్టుకు చేరిన ఓ పత్రం నుంచి సమాచారాన్ని సేకరించి అర్స్‌టెక్నికా ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రాఫ్ ఏపీఐ నుంచి విస్తృత స్థాయిలో సమాచారం పొందేందుకు నిస్సాన్, కెనడా రాయల్ బ్యాంక్, ఎయిర్‌బీఎన్‌బీ, నెట్‌ఫ్లిక్స్, లైఫ్ట్, క్రైస్లర్/ఫియట్ తదితర కంపెనీలు ఉన్నాయని అర్స్‌టెక్నికా తెలిపింది. ఓ కేసులో బ్రిటన్ పార్లమెంటు ఫేస్బుక్ అంతర్గత పత్రాలను పరిశీలన నేపథ్యంలో తాజా వార్త ఫేస్‌బుక్‌కు మరింత ఆందోళన కలిగించనుంది. -
‘వాట్సాప్ గోల్డ్' మళ్లీ వైరల్, మీకు వచ్చిందా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఫేక్ మెసేజ్‌లను అడ్డుకుంటున్నప్పటికీ తాజాగా వాట్సాప్ గోల్డ్ మెసేజ్ పేరుతో ఓ ఫేక్ మెసేజ్ మళ్లీ వాట్సాప్ యూజర్లపై పంజా విసురుతోంది. 'ధనవంతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 'వాట్సాప్ గోల్డ్' వెర్షన్ లీక్ అయింది. మీకు కూడా ఆ సేవలు ఉచితంగా కావాలంటే, ఈ లింక్ పై క్లిక్ చేయండి' అంటూ మెసేజ్‌లు మళ్ళీ చక్కర్లు కొడుతున్నాయి. అలా ఈ వలలో పడిన యూజర్లను డేటాను హ్యాక్ చేస్తుంది. 'వాట్సాప్ గోల్డ్'..ద్వారా వచ్చిన లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేస్తే మీ వాట్సప్... గోల్డ్ కలర్లోకి మారిపోతుందన్నది ఆ మెసేజ్ సారాంశం. అయితే వాస్తవానికి ఇది ఒరిజినల్ యాప్ కాదు. అదొక మాల్వేర్. ఇదొక భయంకరమైన వైరస్. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. భారీ నష్టం తప్పదు. 'వాట్సాప్ గోల్డ్' మెసేజ్ వస్తే ఏం చేయాలి? ఇది ఫేక్ వ్యాట్సాప్ యాప్. ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే ఆ వైరస్ ఫోన్లోకి చొరబడి డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. 'వాట్సాప్ గోల్డ్' పేరుతో వచ్చే ఎటువంటి లింక్స్ పై క్లిక్ చేయొద్దని, సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఈ వైరస్ ఫోన్ లో చేరితే, ఫోన్ లో నిక్షిప్తమైన వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్స్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు ఇలా ఫోన్ డేటా అంతా సైబర్ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా 2016 సంవత్సరంలో 'వాట్సాప్ గోల్డ్' పేరిట మాల్వేర్ మెసేజ్‌లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
10 కోట్ల కస్టమర్ల డేటా గోవిందా!
ఫేస్బుక్లో డేటా లీక్ ఉదంతం ప్రకంపనలు ఇంకా సమసిపోకముందే తాజాగా డేటా బ్రీచ్ ఆందోళన పుట్టిస్తోంది. ప్రముఖ వెబ్సైట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ (క్వోరా) హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా క్వోరానే వెల్లడించింది. ఈ నేపథ్యంలో క్వోరాఖాతాదారులు తమ తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాల్సిందిగా కోరింది. అలాగే హ్యాకింగ్‌కు గురైన వినియోగదారులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిపింది. సుమారు10కోట్లమంది(100 మిలియన్లు) వినియోగదారుల డేటా చోరికి గురైందని తెలిపింది. గుర్తు తెలియని హ్యాకర్లు "ఒక హానికర మూడవ పక్షం" ద్వారా తమ వ్యవస్థలోకి చొరబడ్డారని ప్రకటించింది. నవంబరు 30న దీన్నిగుర్తించామనీ, విచారణ కొనసాగుతోందని ప్రకటించింది. పేరు, ఇమెయిల్ చిరునామా, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్లు, లింక్డ్ నెట్‌వర్క్‌లో రిపోర్ట్ చేసిన డేటాతో సహా చోరి యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని కంపెనీ సీఈవో ఆడమ్ డీ ఎంజేలో తన బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించారు. కాగా ఫేస్బుక్ మాజీ ఉద్యోగులు ఆడమ్ డీఎంజేలో, చార్లీ చీవర్ 2009లో క్వోరా వెబ్సైట్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో (పేస్బుక్, ట్వీటర్,వాట్సాప్) సహా పలు రంగాల్లోని ప్రశ్నలకు జవాబు అందించేలా దీన్ని అభివృద్ధి చేశారు. తద్వారా అతితక్కువ కాలంలోనే ముఖ్యంగా యువతలో ఈ వెబ్సైట్ అత్యంత ఆదరణ పొందింది. -
డేటా లీక్: ఫేసుబుక్కు షాక్
శాన్ ఫ్రాన్సిస్కో: కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా కుంభకోణంనుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్బుక్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్. శుక్రవారం స్వయంగా ఫేస్బుక్ వెల్లడించిన సమాచారం ప్రకారం భారీ ఎత్తున వినియోగదారుల డేటా చోరీకి గురైంది. గత నెలలో వార్తలొచ్చినట్టుగా 5కోట్ల మంది యూజర్ల కాకుండా కేవలం 2.9 కోట్ల మంది ఖాతాదారుల వ్యక్తిగత ఖాతాల పూర్తి సమాచారం హ్యాక్ అయిందని ధృవీకరించింది. దీంతో డేటా రక్షణ వ్యవహారంలో ఫేస్‌బుక్‌పై వినియోగదారులు, పెట్టుబడుదారుల భరోసాను మరింత దిగజార్చింది. ముఖ్యంగా యూజర్ల డేటా రక్షణలో కంపెనీ సమర్థత ప్రశ్నార్థకమైంది. మరోవైపు ఈ వార్తాలతో అమెరికా మార్కెట్లో ఫేస్బుక్ షేర్లు 2.6 శాతం క్షీణించగా, శుక్రవారం వివరాలను వెల్లడించిన తరువాత మరో 0.5 శాతం పడిపోయాయి. ఈ పతనం మున్ముందు మరింత కొనసాగే అవకాశం ఉందని ఎనలిస్టుల అభిప్రాయం 5 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందంటూ గతనెల చివరి వారంలో వార్తలు రావడం తెలిసిందే. డిజిటల్ లాగ్-ఇన్ కోడ్లను హ్యాక్ చేయడం ద్వారా 5 కోట్లమంది వివరాలను హ్యాకర్లు చోరీ చేసి ఉండొచ్చని ఫేస్బుక్ తెలిపింది. ఇటీవల చెక్–ఇన్ అయిన ప్రదేశాలు తదితర వివరాలను కూడా సేకరించారని హ్యాకర్లు ఫేస్బుక్ తెలిపింది. ఊహించిన దానికంటే తక్కువ మందిపైనే సైబర్‌దాడి ప్రభావం చూపిందని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ గై రోసెన్ తెలిపారు. ఒకసారి ఖాతాలోకి లాగిన్ అయ్యాక లాగౌట్ చేసి, మళ్లీ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేయకుండానే పాత వివరాలతో ఖాతాను తెరవడానికి ఉపయోగపడే ‘యాక్సెస్ టోకెన్ల'ను దొంగిలించడమే ధ్యేయంగా గత నెల సైబర్ దాడులు జరిగాయని ఆయన వివరించారు. ఎలాంటి వివరాలు లీక్ అయ్యాయి, అనుమానిత ఈమెయిల్స్ లాంటి వివరాలతో రాబోయే రోజుల్లో ప్రభావిత యూజర్లకు మెసేజ్‌లను పంపుతానని , లేదా కాల్ చేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా 14 మిలియన్ల మంది వినియోగదారులకు సంబంధించి పుట్టిన తేదీలు, ఎంప్లాయిర్స్, విద్య, స్నేహితుల జాబితా హ్యాక్ అయ్యాయి. అయితే సుమారు 15 మిలియన్ల మంది వాడుకందారులకు చెందిన కేవలం పేరు, కాంటాక్టుల వివరాలను మాత్రమే చోరీ చేయగలిగారని..ఆ మేరకు హ్యాకర్లను తాము నిరోధించగలిగామని గై రోసెన్ తెలిపారు. -
సిమ్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త!
సాక్షి, ఉలవపాడు : సాధారణంగా సిమ్ కొంటే కొనేవారి వివరాలు సదరు షాపునకు అందజేస్తే అక్కడి నుంచి నేరుగా సంబంధిత నెట్వర్క్ మెయిన్ ఆఫీస్‌కు వెళ్లేవి. అక్కడి నుంచి సిమ్‌ని యాక్టివేట్ చేసే వారు. ఈ ఇద్దరి మధ్య మాత్రమే మన వివరాలు ఉండేవి. అలాంటి సమయంలోనే ఎన్నో తప్పులు దొర్లాయి. ఇప్పుడు కొత్తగా వేలిముద్రతో సిమ్‌లు అందజేస్తున్నారు. ఈ సమయంలో మనకు సంబంధించిన వివరాలు మొత్తం వచ్చేస్తున్నాయి. దాని ఆధారంగా సిమ్‌లు అమ్ముతున్నారు. కానీ ఇటీవల కొన్ని టెలికమ్ కంపెనీలు తమ వద్ద కొన్న సిమ్‌లు తీసుకున్న వారిని నిలబెట్టి ఫొటో తీస్తున్నారు. తర్వాత వారి ద్వారా పూర్తి చేసిన సమాచారం మొత్తాన్ని ఆయా కంపెనీల గ్రూప్‌ల్లో పోస్టు చేస్తున్నారు. ఈ గ్రూప్‌ల్లో జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని సెల్‌షాపు యజమానులు ఉంటారు. అంటే ఎక్కడైనా ఓ వ్యక్తి సిమ్ కొంటే దానికి సంబంధించి అతని ఫొటోతో పాటు అన్ని వివరాలు బహిర్గతం చేస్తున్నారు. ఇది కంపెనీల తప్పనిసరి కాదని పలు షాపు యజమానులు చెబుతున్నారు. వారు కేవలం ఎన్ని సిమ్‌లు అమ్మారని అడుగుతున్నారు. కానీ కొందరు అన్ని వివరాలు పెట్టి తాము సిమ్‌లు అమ్మిన వారిని కూడా చూపిస్తున్నారని తెలిపారు. సదరు వ్యక్తి ఇలా సిమ్ కొనే సమయంలో షాపులో నిలబెట్టి మరీ ఫొటోలు తీస్తున్నారు. అలా అయితేనే సిమ్ ఇస్తామని కొందరు యజమానులు చెబుతున్నారు. ప్రధానంగా అక్షరాస్యత లేని వారిని ఇలా చేస్తున్నారు. దీని వలన ఈ గ్రూపులో ఉన్న వారెవరైనా ఈ సమాచారం తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వీలుకలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా బహిర్గతం ఇలా వాట్సాప్ గ్రూప్‌లో సిమ్ కొన్న వారి సమాచారం మొత్తం పెడుతున్నారు. ఈ గ్రూప్‌లో చూస్తే సిమ్ కొన్న వ్యక్తి ఫొటో వస్తోంది. ఆ తర్వాత అతను సిమ్ దరఖాస్తులో పూర్తి చేసిన సమాచారం మొత్తం పోస్టు చేస్తున్నారు. ఆధార్ ఆధారంగా వారి ఇంటి అడ్రస్సు కూడా బహిర్గతమవుతోంది. ఇక పుట్టిన తేదీతో సహా తెలుస్తోంది. ప్రస్తుతం తీసుకుంటున్న సిమ్ నంబర్ వివరాలు, అవసరం కోసం ప్రస్తుతం వాడుతున్న నంబరుతో సహా అన్ని వివరాలు గ్రూప్‌లోకి వస్తున్నాయి. గ్రూప్‌లో వందల మంది షాపుల యజమానులు ఉంటారు. ఈ సమాచారం మొత్తం అందరికీ వస్తుంది. వారు డౌన్లోడ్ చేసుకుని మరే ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. మహిళలు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. ఆందోళనలో వినియోగదారులు సిమ్‌లు కొన్న తర్వాత ఇలా గ్రూప్‌లో పెడుతున్నారని చాలామందికి తెలియదు. తెలుసుకున్న తర్వాత వారు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆధార్ నంబర్ ఉపయోగించుకుని ఏం చేస్తారోనని భయం పట్టుకుంది. ఇక గ్రూప్ సభ్యుల్లో అందరూ ఒకేలా ఉండరు. మహిళల ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు వారికి కాల్ చేయడం, మెసేజ్ చేయడం వంటివి జరుగుతాయోమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం సిమ్ అమ్మిన వారు ఇలా సమాచారం బహిర్గతం చేయడం మంచి పద్ధతి కాదని, దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమాచారాన్ని బహిర్గతం చేయడంతో ఎలాంటి అసాంఘిక పనులైనా వారి మీద మరొకరు చేసే పరిస్థితి వస్తుందని అంటున్నారు. వినియోగదారుల వివరాలు సెల్ షాపుల యజమానుల గ్రూప్‌లో పెట్డడం నిలుపుదల చేయాలని పలువురు కోరుతున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం: సెల్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయడం మంచిది కాదు. సిమ్ కంపెనీల యజమానులు అలా ఎందుకు చేస్తున్నారో విచారించి చర్యలు తీసుకుంటాం. - వైవీ రమణయ్య, ఎస్ఐ, ఉలవపాడు -
ఫేస్బుక్ మరో ఘోర తప్పిదం
వాషింగ్టన్ : డేటా షేరింగ్ స్కాండల్ విషయంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ తన యూజర్ల డేటాను చెప్పా పెట్టకుండా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ తయారీదారులకు ఇచ్చినట్టు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. వాటిలో ఆపిల్, శాంసంగ్, అమెజాన్ వంటి 60 కంపెనీలున్నట్టు తెలిపింది. గత దశాబ్ద కాలంగా యూజర్ల డేటాను ఆ కంపెనీలకు ఫేస్బుక్ యాక్సస్ చేస్తున్నట్టు వెల్లడించింది. తాజాగా ఫేస్బుక్ చేసిన మరో ఘోర తప్పిదం వెలుగులోకి వచ్చింది. చైనీస్ డివైజ్ మేకర్లతో కూడా డేటా షేరింగ్ ఒప్పందాన్ని ఈ కంపెనీ కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీనే అంగీకరించింది. హువావే టెక్నాలజీస్ కో, లెనోవో, ఒప్పో, టీసీఎల్ వంటి చైనీస్ డివైజ్ తయారీదారులకు ఫేస్బుక్ తన డేటాను షేర్ చేసినట్టు వెల్లడించింది. ఇదీ కూడా యూజర్లకు తెలియకుండానే చేసినట్టు తెలిసింది. చైనీస్ డివైజ్ తయారీదారులతో ఫేస్బుక్ డేటా షేర్ కావడం ‘అత్యంత ప్రమాదకరం’ అని సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ టాప్ డెమొక్రాట్ మార్క్ వార్నర్ అన్నారు. అయితే తాము ఈ భాగస్వామ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామని, ఫేస్బుక్ యాప్ కస్టమ్ వెర్షన్స్‌ను అభివృద్ధి చేయడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు తాము సహకరిస్తున్నామని ఈ కంపెనీ చెబుతోంది. మెంబర్ల సమాచారాన్ని వారు ఎలాంటి వాటికి ఉపయోగిస్తున్నారనే విషయంపై చాలా విశ్లేషణ చేశామని పేర్కొంటోంది. 2009 నుంచి చైనాలో ఫేస్బుక్ యాప్ బ్లాక్ అయి ఉంది. అయినప్పటికీ ఆ దేశ కంపెనీలకు మాత్రం ఈ కంపెనీ యూజర్ల డేటా ఇచ్చేసింది. ప్రస్తుతం ఫేస్బుక్ షేర్చేసిన చైనీస్ కంపెనీలు, ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ, వారి మిలటరీకి సంబంధించినివా తెలుపాలని ఆ కమిటీ ఆదేశించింది. ఇప్పటికే ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ కంపెనీతో యూజర్ల డేటాను పంచుకుందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణలపై ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కాంగ్రెస్ సభ్యుల మందుకు వచ్చి కూడా క్షమాపణ చెప్పారు. తాజాగా న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసిన రిపోర్టులు, వెలుగులోకి వచ్చిన చైనీస్ కంపెనీలతో భాగస్వామ్యం అన్ని విషయాల్లోనూ ఫేస్బుక్ ఎంత ఘోర తప్పిందం చేసిందో వెల్లడవుతుందని టెక్ వర్గాలంటున్నాయి. -
ఆ వీడియో అబద్ధం : పేటీఎం మండిపాటు
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోపై డిజిటల్ వాలెట్ దిగ్గజ పేమెంట్ కంపెనీ పేటీఎం మండిపడింది. ఆ వీడియోలో చెప్పినట్టు తాము యూజర్ల డేటాను థర్డ్ పార్టీలకు షేర్ చేయడం లేదని పేటీఎం స్పష్టంచేసింది. భారత్‌లోని తమ 300 మిలియన్ రిజిస్ట్రర్ యూజర్ల డేటా భద్రంగా ఉందని పేటీఎం పేర్కొంది. ‘సోషల్ మీడియా వ్యాప్తంగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. థర్డ్ పార్టీలకు కొంత డేటా షేర్ చేస్తున్నట్టు చెబుతున్న ఆ వీడియోలో ఎలాంటి వాస్తవం లేదు’ అని కంపెనీ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. విజ్ఞప్తి మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలకు తప్ప ఎవరికీ యూజర్ల డేటాను ఇవ్వలేదని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ‘పేటీఎంలో అయితే మీ డేటా మీదే. అది ఎప్పటికీ మాది కాదు, థర్డ్ పార్టీది కాదు లేదా ప్రభుత్వానిది కాదు’ అని క్లారిటీ ఇచ్చింది. యూజర్లు అనుమతి ఇవ్వకపోతే, తాము ఎలాంటి డేటాను ఎవరికీ షేర్ చేయమని చెప్పింది. ఇది యూజర్లకు, కంపెనీకి మధ్య ఉండే ఒక నమ్మకమని చెప్పింది. తమ వినియోగదారుల సమాచారం వంద శాతం సురక్షితంగా ఉందని పేర్కొంది. కాగ, డిజిటల్ లావాదేవీల్లో పేటీఎం దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల డేటా షేరింగ్‌పై పెద్ద ఎత్తున్న ఆందోళనలు రేకెత్తడంతో, పేటీఎం కూడా థర్డ్ పార్టీలకు యూజర్ల డేటా షేర్ చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక వినియోగదారుల సమాచారం కావాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఓ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించారు. దీంతో ఈ వివాదం పెద్ద ఎత్తున్న చెలరేగింది. ఈ స్టింగ్ ఆపరేషన్‌ను పేటీఎం ఖండించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో అసలేమాత్రం నిజాలు లేవని, అన్నీ అబద్ధాలేనని స్పష్టంచేసింది. There is absolutely NO TRUTH in the sensational headlines of a video doing rounds on social media. Our users' data is 100% secure and has never been shared with anyone except law enforcement agencies on request. Thank you for your continued support. — Paytm (@Paytm) May 25, 2018 -
ట్విటర్ కూడా అమ్మేసిందట!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా బ్రీచ్ ఆందోళన యూజర్లను ఇంకా వీడకముందే..తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌కూడా యూజర్ల డేటాను విక్రయిచిందన్న వార్తలు మరింత కలవరం పుట్టించాయి. ట్విటర్‌కు చెందిన యూజర్ డేటా కేంబ్రిడ్జ్ ఎనలిటికా చేజిక్కించుకుంది. అనంతరం ఈ సమాచారాన్ని వినియోగదారుల సమ్మతి లేకుండానే పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థకు విక్రయించింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జిఎస్ఆర్, అలెగ్జాండర్ కోగన్ సొంత వ్యాపార సంస్థ) భారీ ఎత్తున తమ వినియోగదారుల డేటాను తస్కరించిందని ట్విటర్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. 2015లో కేవలం ఒక రోజులోనే నెలరోజులకు సంబంధించిన భారీ డేటాను చోరిచేసిందని పేర్కొంది. బ్లూంబర్గ్ అందించిన సమాచారం ప్రకారం 2015లో, జీఎస్ఆర్ సంస్థకు డిసెంబరు 2014 నుంచి ఏప్రిల్ 2015 దాకా పబ్లిక్ ట్వీట్ల రాండం శాంపిల్‌కోసం ఐదు నెలల వ్యవధిలో తన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌పై వన్‌టైం యాక్సెస్ ఇచ్చామని ట్విటర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నేడేటా లీక్ అయ్యిందని గుర్తించినట్టు వివరించింది.అయితే ఇటీవల డేటా బ్రీచ్ నివేదిక నేపథ్యంలో అంతర్గత సమీక్షలో ఈ విషయాన్ని గుర్తించామనీ, దీంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా, దాని అనుబంధ సంస్థలు, ప్రకటనకర్తలను తొలగించినట్టు పేర్కొంది. కాగా యూజర్ల సమాచార భద్రతలో ట్విట్టర్ వైఫల్యం, డేటా దుర్వినియోగాన్ని నిరోధించడంలో విఫలమైనందుకు మరోసారి తీవ్ర దుమారం రేగింది. -
దాని బారిన భారత ఎఫ్బీ యూజర్లు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్ల డేటాను ఫేస్బుక్, బ్రిటీష్ పొలిటికల్ కన్సల్టెన్సీ కేంబ్రిడ్జ్ అనలిటికాతో అక్రమంగా షేర్ చేసిందని వివాదం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. యూజర్ల డేటా షేరింగ్‌పై ఫేస్బుక్ కూడా తన తప్పును ఒప్పుకుంది. తాజాగా ఫేస్బుక్ విడుదల చేసిన గణాంకాల్లో భారతీయుల డేటా కూడా బయటపడింది. 5 లక్షల మంది భారతీయుల యూజర్ల డేటాను కూడా కేంబ్రిడ్జ్ అనలటికాతో షేర్ చేసినట్టు ఫేస్బుక్ బుధవారం ప్రకటించింది. అంతేకాక ఫేస్బుక్ షేర్ చేసిన యూజర్ల డేటా సంఖ్య కూడా పెరిగింది. అంతకముందు 5 కోట్ల మంది డేటా మాత్రమే కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ షేర్ చేసిందని అంచనాలు వెలువడితే, ప్రస్తుతం 8.7 కోట్ల మంది యూజర్ల డేటా బట్టబయలు అయినట్టు తెలిసింది. యూజర్ల అనుమతి లేకుండా.. ఫేస్బుక్ నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా ఈ డేటాను అక్రమంగా పొంది, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, బ్రెగ్జిట్ ప్రచారంలో రాజకీయ నాయకుల లబ్ది కోసం వాడిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వివాదం సృష్టిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో మొత్తం 8.7 కోట్ల మంది యూజర్ల ఫేస్బుక్ డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్ అనలిటికాతో షేర్ అయినట్టు నమ్ముతున్నామని ఫేస్బుక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైక్ ష్రోఫెర్ అన్నారు. దీనిలో ఎక్కువగా అమెరికన్ల డేటానే ఉన్నట్టు తెలిపారు. అంతేకాక భారత రాజకీయ ప్రచారాల్లో కూడా కేంబ్రిడ్జ్ అనలిటికాతో పలు పార్టీల కోసం ఫేస్బుక్ డేటాను వాడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రిస్టోఫర్ వైలీ, విజిల్బ్లోయర్లు కూడా దీనిపై ట్వీట్లు కూడా చేశారు. ఈ ఆరోపణలు కూడా రుజువయ్యాయి. దాదాపు 5 లక్షల మంది భారతీయుల డేటాను కూడా తాము కేంబ్రిడ్జ్ అనలిటికాకు షేర్ చేసినట్టు ఫేస్బుక్ ప్రకటించింది. ఈ సంస్థ పేరెంట్ కంపెనీ, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 2003, 2012 కాలాల్లో జరిగిన ఆరు రాష్ట్ర ఎన్నికలు, 2009 సాధారణ ఎన్నికల్లో పలు పార్టీల కోసం ఈ డేటాను వాడిందని తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు కేంబ్రిడ్జ్ అనలిటికాకు ప్రధాన క్లయింట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారత ఎన్నికల ప్రక్రియను ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా కంపెనీలు ప్రభావితం చేయాలని చూస్తే, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ఒకవేళ అవసరమైతే, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు సమన్లు కూడా జారీచేస్తామన్నారు. -
ఫేస్బుక్ మీ డేటాను అమ్మేస్తోంది..
న్యూయార్క్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ రోజురోజుకి తీవ్ర ఇరకాటంలో కూరుకుపోతోంది. ఈ సోషల్ మీడియా దిగ్గజం ప్రజలు డేటాను అమ్మేస్తుందని డొనాల్డ్ ట్రంప్ మాజీ చీఫ్ స్ట్రాటజిస్ట్, కేంబ్రిడ్జ్ అనలిటికా మాజీ వైస్ ప్రెసిడెంట్ స్టీవ్ బన్నొన్ ఆరోపిస్తున్నారు. ఫైనాన్సియల్ టైమ్స్ న్యూస్‌పేపర్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అయితే ఫేస్బుక్ నుంచి తీసుకున్న డేటా మైనింగ్ పొలిటికల్ డేటా అనాలిటిక్స్‌లో వాడుతున్నారనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు. ‘ఫేస్బుక్ మీ వివరాలన్నింటిన్నీ ఉచితంగా తీసుకుంటోంది. భారీ మొత్తంలో మార్జిన్ల కోసం వాటిని విక్రయిస్తోంది. ఈ కారణంతోనే కంపెనీలు ఎక్కువ విలువతో ట్రేడవుతున్నాయి’ అని బన్నొన్ చెప్పారు. తర్వాత ఆ కంపెనీలు ఆల్గారిథమ్స్ రాసి, ప్రజల జీవితాన్ని నియంత్రిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా.. కోట్లాది మంది ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్బుక్ డేటాను కొనుగోలు చేసిన స్కీమ్ ఉన్నట్టు తనకు గుర్తులేదన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ డేటా విక్రయించబడుతుందని మాత్రం బన్నొన్ నొక్కి చెప్పారు. ఈ స్కాండల్‌పై స్పందించిన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, తాము తప్పులు చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ అనలిటికాపై అమెరికాలో విచారణ కొనసాగుతోంది. -
మన పార్టీల బిగ్ డేటా..!
వివిధ దేశాల్లో రాజకీయ పక్షాల ఎన్నికల వ్యూహాల తయారీకి ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ‘కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ)’ సంస్థ దుర్వినియోగం నేపథ్యంలో... భారత్‌లో ఎన్నికల సందర్భంగా ప్రచార వ్యూహాలు ఏ విధంగా రూపొందిస్తారు ? అందుకోసం ప్రజల నుంచి సమాచారాన్ని ఏయే రూపాల్లో సేకరిస్తారు ? దానిని ఏ విధంగా సమన్వయం చేసి, ప్రచారరూపాలుగా మళ్లీ ప్రజల్లోకి రాజకీయపార్టీలు ఎలా తీసుకెళుతున్నాయన్నవి ఆసక్తి రేపే ప్రశ్నలు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ఇంతవరకు ప్రధాన రాజకీయపార్టీలు అనుసరించే వ్యూహాలు, సమాచార సేకరణ, వ్యాప్తిలో తీసుకొస్తున్న కొత్త పోకడలు, ముఖ్యంగా 2014 ఎన్నికల్లో చేపట్టిన ప్రచార కార్యాచరణ , సహకరించిన వ్యక్తులు, సంస్థలు, ఇప్పుడు అనుసరించబోయే పద్ధతులు ఏమిటన్నది చర్చనీయాంశమవుతోంది. డేటాదే కీలక పాత్ర... వివిధ రూపాల్లో ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, ఎన్నికల సందర్భంగా చర్చకు వచ్చే అంశాలు, సమస్యలు, ఓటర్ల మొగ్గును బట్టి కొన్ని సంస్థలు రాజకీయ పక్షాల కోసం ప్రచార వ్యూహాలు రూపొందిస్తాయి. అయితే ఫేస్బుక్ వినియోగదారులకు తెలియకుండా వారి ఆంతరంగిక సమాచారాన్ని విశ్లేషించి సీఏ సంస్థ అక్రమంగా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం అనేక ప్రశ్నలను ముందుకు తెస్తోంది. భారత్‌లోనూ సామాజిక మాధ్యమాల విస్తృతి బాగా పెరిగిన నేపథ్యంలో ప్రజల నుంచి సేకరించే వివరాలను ఏ విధంగా ఉపయోగిస్తారనేది కీలకంగా మారింది. ప్రధానంగా రాజకీయపార్టీలు, సంస్థలు భారత జనాభా లెక్కల సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ డేటా విషయంలో ఎన్నికల సంఘం విడుదల చేసే వార్డుస్థాయిలో వివిధపార్టీలకు పడిన ఓట్ల వివరాలు ముఖ్యభూమికను పోషిస్తున్నాయి. ఈ సమాచారాన్ని బట్టి నియోజకవర్గస్థాయి పరిస్థితిని పార్టీలు అంచనావేస్తున్నాయి. వీటి ఆధారంగా ఓటర్ల మనోభావాలు, ఎన్నికల అంశాలు వెల్లడవుతున్నాయి. అయితే ఓబీసీ, ఇతర కులాలకు సంబంధించిన సమాచారం తేలిగ్గా అందుబాటులో లేకపోవడంతో వాటి సేకరణకు రాజకీయపక్షాలు సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ మొత్తం డేటా విశ్లేషణ, దాని వినియోగానికి ప్రాముఖ్యత ఏర్పడడంతో ఈ రంగంలో అనుభవమున్న సంస్థలు, వ్యక్తుల ద్వారా పార్టీలు ఈ పనిని నిర్వహిస్తున్నాయి. పబ్లిక్ డొమెయిన్ సమాచారం ముఖ్యమే.. 2019 ఎన్నికల్లో 90 కోట్లకు పైగా ఓటర్లు పాలు పంచుకోనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్, జనాభా లెక్కలు, జాతీయ శాంపిల్ సర్వే సంస్థ సేకరించి, విడుదల చేసిన సమాచారానికి అనుగుణంగానే విశ్లేషణ చేపడుతున్నట్లు ఆస్ట్రమ్ సంస్థ వ్యవస్థాపకుడు అశ్వినీ సింగ్లా వెల్లడించారు. దేశంలో శాస్త్రీయంగా ఎన్నికల సమాచార నిర్వహణను చేపట్టినదిగా ఈ సంస్థకు పేరుంది. వేలాది వాలంటీర్లను ఇంటింటికి పంపించి సమాచారాన్ని సేకరణతో పాటు, ఓటర్లతో సంభాషణల ఆధారంగా డేటాను రూపొందించి విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఓటరు భిన్నమైన ఆలోచనా ధోరణి, అభిప్రాయాలతో ఉండడంతో పాటు భాషా, కులం, సామాజిక, ఆర్థిక స్థాయిల్లో అంతరాలు వంటి అంశాలతో భారత్‌లో పరిస్థితి సంక్షిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంటింటి సమాచార సేకరణను ప్రామాణికంగా తీసుకుని ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు సింగ్లా చెప్పారు. తమ బృందం సేకరించిన డేటా ఆధారంగా పంచాయతీ నుంచి సాథారణ ఎన్నికల వరకు సరళిని అంచనా వేస్తున్నామన్నారు. తాను ఏ పార్టీతో కలిసి పనిచేసిన విషయాన్ని వెల్లడించకపోయినా ఆ సంస్థ వెబ్సైట్లో మాత్రం గత ఎన్నికల్లో నరేంద్రమోదీ విజయానికి కృషి చేసినట్టు పేర్కొన్నారు. ఓటర్ల వివరాలతో క్షేత్రస్థాయి సమాచారాన్ని క్రోడీకరించి ఓటరు తీరుపై ఏయేఅంశాలు ప్రభావితం చూపుతున్నాయి, ఎవరిని అభ్యర్థిగా పెడితే మంచిదనే దానిపై ఒక అంచనాకు వస్తామన్నారు. ఎన్నికల కంటే ఎంతో ముందుగానే ఓటరుతో పార్టీ మమేకం అయ్యేందుకు ఇది ఉపయోగపడినట్టు నిరూపితమైందని ఆయన చెబుతున్నారు. వివిధ దొంతరలుగా సేకరించిన సమాచారం బూత్‌స్థాయి కార్యకలాపాలకు ఎంతో ఉపకరిస్తుందని, అంతిమంగా ఎన్నికల వ్యూహం రూపొందించేందుకు ఈ డేటానే అత్యంత కీలకమని పేర్కొన్నారు. బీజేపీకి సొంత టీమ్... పార్టీ ఎన్నికల వ్యూహానికి సంబంధించి, ఓటర్ల డేటాను విశ్లేషించేందుకు బీజేపీ సొంతంగా తన బృందాన్ని వినియోగిస్తోంది. ఈ జాతీయ సమాచార, సాంకేతిక విభాగానికి అమిత్ మాలవియా నేతృత్వం వహిస్తున్నారు. అంకెల రూపంలోని ఓటర్ల సమాచారంతో పోలింగ్‌బూత్ స్థాయిలో తమ బృందం పనిచేస్తుందని, దీనిపై విశ్లేషణ కుదిరాక దానికనుగుణంగా పార్టీ రాజకీయ వ్యూహం ఖరారు చేస్తుందని అమిత్ చెప్పారు. గత ఎన్నికల్లో విజయానికి కచ్చితమైన సమాచార, పౌరసంబంధాల వ్యూహంతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా బీజేపీకి ఉపయోగపడింది. ఈ వ్యూహానికి తోడు అన్ని సాంకేతికతల మిశ్రమంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారం, మొబైల్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు సహా అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగించడం వల్ల 543 నియోజకవర్గాల్లో 11.36 లక్షల పోలింగ్ బూత్‌లలో 81 కోట్ల ఓటర్లు లక్ష్యంగా ప్రచారం జరిపినట్లు బీజేపీ జాతీయ సాంకేతిక విభాగ అధిపతి అరవింద్ గుప్తా వెల్లడించారు. ఎన్నికలకు 3,4 ఏళ్లకు ముందు నుంచే సమాచార సేకరణ, శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషణ, 2009 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడిన బూత్‌ల గుర్తింపు ప్రాతిపదికన ప్రతీ పోలింగ్ బూత్‌ను చేరుకున్నట్టు తెలిపారు. కాంగ్రెసూ వెనకబడి లేదు... బీజేపీ మాదిరిగానే కాంగ్రెస్‌పార్టీకి కూడా జాతీయస్థాయిలో ఎన్నికల ప్రక్రియ, డేటా పర్యావేక్షణ, విశ్లేషణకూ ఓ టీం ఉంది. పొలిటికల్ ఎకానమిస్ట్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో డేటా విశ్లేషణ విభాగాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించారు. అందుబాటులో ఉన్న డేటాను మరింత లోతుగా విశ్లేషించడం అటు వ్యాపారాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ కొత్తేమి కాదని చక్రవర్తి వ్యాఖ్యానించారు. డేటా అంటే వ్యక్తిగతమైనదో, గోప్యమైనదో కాదని ఎన్నికల సమాచారంతో పాటు పార్టీ కార్యకర్తలు సేకరించిన వివరాలు, అందుబాటులోని పబ్లిక్ డేటాను నిపుణులతో కూడిన తమ బృందం విశ్లేషిస్తుందన్నారు. వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రతా విషయంలో భారత్‌లో సరైన పరిరక్షణ చట్టాలు లేనందున రాజ్యాంగం కల్పించిన ప్రైవేసీహక్కును ఏ మేరకు రక్షించగలమనేది సందేహాస్పదమేనని టెక్నాలజీ లాయర్ అపర్ గుప్తా చెబుతున్నారు. అయితే ఓటర్ల ఆదాయం, అక్షరాస్యతకు సంబంధించి అందులోకి వస్తున్న కొత్త సమాచారం వల్ల కులాలకు అతీతంగా ఎన్నికల ప్రచార నిర్వహణకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏ దేశం ఎప్పుడు నిద్రలేస్తుంది ?
వాషింగ్టన్: ప్రపంచం ఎప్పుడు నిద్ర పోతుంది, ఎప్పుడు నిద్రలేస్తుంది? ప్రపంచంలోని ఏ దేశం ముందుగా నిద్ర పోతుంది, ఏ దేశం ముందుగా నిద్రలేస్తుంది ? ఏ రోజున ఏ దేశం బద్దకంగా ఒళ్లు విరుచుకుంటుంది, ఏ దేశం ఏ రోజున ఉత్సాహంగా ఉరకలేస్తుంది? మొత్తంగా ఏ దేశం ప్రశాంతంగా పడుకుంటుంది, ఏ దేశం నిద్ర కరవై కలతపడుతుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా!... తమ వద్ద సమాధానాలు సిద్ధంగా ఉన్నాయని ‘స్లీప్ సైకిల్.కామ్’ నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్లీప్సైకిల్ యాప్‌ను ఉపయోగిస్తున్న ప్రజల్లో 58 దేశాల్లోని, 9,41,300 మంది యూజర్స్ డేటాను యాక్సిలోమీటర్ ద్వారా ట్రాక్‌చేసి వాటిని విశ్లేషించి నిపుణలు ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టారు. ప్రపంచంలో ముందుగా నిద్రలేచే దేశం దక్షిణాఫ్రికా. ఆ దేశం సోమవారంనాడు ఉదయం 6.09 గంటలకు నిద్ర లేస్తుంది (సగటు లెక్కల ప్రకారం) మంగళవారం ప్రపంచం బద్ధకంగా నిద్ర లేస్తుంది. ఆ రోజున అమెరికా ప్రజలు సగటున ఉదయం ఏడు గంటలకు నిద్ర లేస్తారు. అన్ని రోజులకల్లా వారు ఆ రోజే పరమబద్ధకంగా ఉంటారట. కారణం ఆరోజు రాత్రి వారికి సరైన నిద్రలేకపోవడమే. మంగళవారం సరిగ్గా నిద్రపోని దేశాల్లో అమెరికా సరసన వరసగా సింగపూర్, స్పెయిన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలు నిలుస్తున్నాయి. అమెరికా సహా ప్రపంచ దేశాలన్ని బుధవారం రాత్రి ప్రశాంతంగా నిద్ర పోతున్నాయి. ఆ రోజున ప్రపంచదేశాలకన్నా చైనా ప్రజలు ఎక్కువ సేపు నిద్రపోతున్నారు. వారం రోజుల్లో సగటున ప్రశాంతంగా నిద్రపోతున్న దేశాల్లో స్లొవేకియా అగ్రస్థానంలో, చైనా రెండో స్థానంలో, భారత్ 25వ స్థానంలో, అమెరికా 48వ స్థానంలో ఉంది. స్లొవేకియా సగటున 6.57 గంటలు నిద్రపోతుండగా, చైనా 6.43 గంటలు, భారత్ 6.35 గంటలు, అమెరికా 7.06 గంటలు నిద్రపోతోంది. (ఇక్కడ ప్రశాంతంగా నిద్ర పోవడమంటే రాత్రిళ్లు మధ్య మధ్యలో ఎక్కువ సార్లు లేవకపోవడం) గురువారం నాడు మధ్యప్రాచ్య దేశాలు ప్రశాంతంగా నిద్ర లేస్తూ ఆ రోజున హాయిగా గడుపుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఉల్లాసంగా గడుపుతున్నాయి. శుక్రవారం నాడు కోస్టరికా, కెనడా, న్యూజిలాండ్, స్వీడన్ దేశాలు ప్రశాంతంగా గడుపుతున్నాయి. మిగతా రోజుల్లో పోలిస్తే శనివారం నాడు 90 శాతం దేశాలు ఎక్కువ సేపు నిద్రపోతున్నాయి. 71 శాతం దేశాలు ఆ రోజున ఉల్లాసంగా ఉంటున్నాయట. ఇక ఆదివారం నాడు 66 దేశాలు చాలా తక్కువ సమయం ఆదివారం రాత్రి నిద్రపోతున్నాయి. సోమవారం నాడు ప్రపంచంలో ముందుగా నిద్రలేచే దక్షిణాఫ్రికా ఆదివారం రాత్రి సగటున 5.53 గంటలు మాత్రమే నిద్రపోతోంది.