ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఫేక్ మెసేజ్‌లను అడ్డుకుంటున్నప్పటికీ తాజాగా వాట్సాప్ గోల్డ్ మెసేజ్ పేరుతో ఓ ఫేక్ మెసేజ్ మళ్లీ వాట్సాప్ యూజర్లపై పంజా విసురుతోంది. 'ధనవంతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 'వాట్సాప్ గోల్డ్' వెర్షన్ లీక్ అయింది. మీకు కూడా ఆ సేవలు ఉచితంగా కావాలంటే, ఈ లింక్ పై క్లిక్ చేయండి' అంటూ మెసేజ్‌లు మళ్ళీ చక్కర్లు కొడుతున్నాయి. అలా ఈ వలలో పడిన యూజర్లను డేటాను హ్యాక్ చేస్తుంది.
'వాట్సాప్ గోల్డ్'..ద్వారా వచ్చిన లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేస్తే మీ వాట్సప్... గోల్డ్ కలర్‌లోకి మారిపోతుందన్నది ఆ మెసేజ్ సారాంశం. అయితే వాస్తవానికి ఇది ఒరిజినల్ యాప్ కాదు. అదొక మాల్‌వేర్. ఇదొక భయంకరమైన వైరస్. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. భారీ నష్టం తప్పదు.
'వాట్సాప్ గోల్డ్' మెసేజ్ వస్తే ఏం చేయాలి?
ఇది ఫేక్ వ్యాట్సాప్ యాప్. ఈ లింక్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకుంటే ఆ వైరస్ ఫోన్‌లోకి చొరబడి డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. 'వాట్సాప్ గోల్డ్' పేరుతో వచ్చే ఎటువంటి లింక్స్ పై క్లిక్ చేయొద్దని, సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఈ వైరస్ ఫోన్ లో చేరితే, ఫోన్ లో నిక్షిప్తమైన వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్స్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు ఇలా ఫోన్ డేటా అంతా సైబర్ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా 2016 సంవత్సరంలో 'వాట్సాప్ గోల్డ్' పేరిట మాల్‌వేర్ మెసేజ్‌లు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment