న్యూఢిల్లీ: మనకు చాలా సార్లు స్మార్ట్‌ఫోన్లలో వెరైటీ వెరైటీ థీమ్‌లు, స్టేటస్‌లు మార్చుకోవడం కోసం చాలా లింకులు వాట్సాప్ గ్రూపులను, చాట్‌లలో చక్కర్లు కొడతాయి. అలాంటి లింకులను పొరపాటున క్లిక్ చేయడం ద్వారా యూజర్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ప్రస్తుతం కూడా ఒక మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ మెసేజ్ లో వాట్సప్ కొత్త కలర్లను యాక్టివేట్ చేసుకోవాలంటూ చూపిస్తోంది. మీరు వాట్సాప్ గ్రీన్ కలర్ చూసి విసుగెత్తిపోయారా? అయితే మీకోసం ఉచితంగా వాట్సాప్ కలర్ మార్చుకోండి అని ఉంది. (చదవండి: నాలుగు మిలియన్లతో సత్తా చాటిన ఫౌజీ)
మీ కలర్ కూడా మారిపోద్ది:
దింతో చాలా మంది ఏ మాత్రం ఆలోచించకుండా అందులో ఉన్న లింక్‌ను ఓపెన్ చేస్తున్నారు. మొబైల్‌ఫోన్‌లో ఆ లింక్‌ను ఓపెన్ చేస్తే యాక్టివేట్ నౌ అనే మరో లింక్ వస్తోంది. యాక్టివేట్ కోసం క్లిక్ చేస్తే యూజర్ వెరిఫికేషన్ అని మరో మెస్సేజ్ కనిపిస్తోంది. ఈ సర్వీసును యాక్టివేట్ చేసుకోవాలంటే 20 మంది ఫ్రెండ్స్‌కు, 5 గ్రూపులకు ఈ సమాచారం చేరవేయాలని వాళ్లను కూడా ఆహ్వానించాలని అందులో ఉంది. ఇలా లింకులను క్లిక్ చేయడం ద్వారా మీ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లి పోతుంది. ఎప్పుడు కూడా అధికారిక సంస్థలు ఇలా యూజర్లకు మెసేజ్ లు పంపవు. ఒకవేల మీరు కనుక ఈ లింకును క్లిక్ చేస్తే వాట్సాప్ కలర్ తో పాటు మీ కలర్ కూడా మారిపోద్ది జాగ్రత్త మరి.
అలాగే దీంతో పాటు "వాట్సాప్ డైరెక్టర్" వరుణ్ పుల్యానీ పేరుతో ఒక పంపిన వాట్సాప్ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సందేశాన్ని కనీసం 20 వ్యక్తులకు ఫార్వార్డ్ చేయాలనీ యూజర్లను అడుగుతుంది. ఒకవేల వారు అలా చేయడంలో విఫలమైతే వారు వాట్సాప్ సేవలకు ఉపయోగించినందుకు కొంత మొత్తం చెల్లించాలని ఆ సందేశంలో ఉంది.
సందేశంలో ఇలా ఉంది.. "దీనిని విస్మరించవద్దు దయచేసి జాగ్రత్తగా చదవండి. హలో, నేను వాట్సాప్ డైరెక్టర్ వరున్ పుల్యాని ఈ సందేశం మా వినియోగదారులందరికీ మేము 19 బిలియన్ డాలర్లకు మార్క్ జుకర్‌బర్గ్‌కు వాట్సాప్‌ను విక్రయించాము. వాట్సాప్ ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ నియంత్రణలో ఉంది. మీరు కనీసం 20 మందికి ఈ మెసేజ్ ను షేర్ చేయండి. అప్పుడు మీ వాట్సాప్ లోగో 24 గంటల్లో ఫేస్‌బుక్ యొక్క "ఎఫ్"తో కొత్త చిహ్నంగా మారడంతో పాటు నీలం రంగులోకి మారిపోతుంది. మీ క్రొత్త వాట్సాప్‌ను వినియోగించుకోవాలంటే ఈ సందేశాన్ని 10 మందికి పైగా ఫార్వార్డ్ చేయండి. లేకపోతే మీ వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి" అని నకిలీ వాట్సాప్ సందేశంలో ఉంది. బహుశా ఇలాంటి సందేశం మీకు కూడా వాట్సాప్ గ్రూప్‌లోనో, వ్యక్తిగతంగానో ఇప్పటికే వచ్చి ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వాట్సాప్ సందేశం ఇది. ఒకవేల కనుక మీకు ఇటువంటి మెసేజ్ రాకపోతే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే, ఇది ఒక నఖిలి మెసేజ్. దీన్ని క్లిక్ చేసిన వారంతా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. (చదవండి: ఫేస్‌బుక్‌కు పోటీగా దూసుకెళ్తున్న 'మీవే' యాప్)
మరి నిజమెంత?
మొదట మనం ఈ వరుణ్ పుల్యానీ గురుంచి తెలుసుకోవాలి. చాలా కాలం నుంచి వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యానీ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ మెసేజ్ లు ఫార్వార్డ్ అవుతున్నాయి. కానీ వాట్సాప్ సంస్థలో అటువంటి పేరుతో ఎవరు లేరు. కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా ఎక్కడా అతని పేరు కనిపించలేదు. ఇలాంటి ఫేక్ సందేశాల్లో తప్ప ఎక్కడ అతని పేరు కనిపించే లేదు అని నిపుణులు తెలుపుతున్నారు. వాట్సాప్ ప్రైవసీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇటువంటి నకిలీ మెసేజ్ లను పంపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీకు వచ్చిన ఇలాంటి సందేశాలు పంపి సమయాన్ని వృథా చేసుకోకండి. మీతో పాటు మీ తోటి వారిని సైబర్ నేరగాళ్లకు బలి చేయకండి. కేవలం అధికారిక సంస్థ నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి.
Comments
Please login to add a commentAdd a comment