న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్‌ను బిలియనీర్ ఎలాన్ మస్క్ టేకోవర్ చేసి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుండగా మస్క్ భారీ షాక్ ఇచ్చే వార్త ఒకటి తాజాగా హల్ చల్ చేస్తోంది. భారీ ఎత్తున ఉద్యోగ కోతలపై విమర్శలు, తరువాత బ్లూటిక్ వెరిఫికేషన్ ప్లాన్ లాంటి గందరగోళం మధ్య, యూజర్ల భావ ప్రకటనా స్వేచ్ఛ, నకిలీ ఖాతాలకు చెక్ , పూర్తి భద్రత అంటూమస్క్ పదే పదే నొక్కి వక్కాణిస్తున్న తరుణంలో ట్విటర్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్త కలకలం రేపింది. అంతర్గత లోపం ద్వారా ట్విటర్ వినియోగదారుల డేటా చోరీ చేసి ఆన్‌లైన్‌లో ప్రైవేట్‌గా షేర్ చేసినట్టు తెలుస్తోంది. (అయ్య బాబోయ్ ఇలా అయిపోతామా!మండే మోటివేషన్: ఆనంద్ మహీంద్ర ట్వీట్స్ వైరల్)
ఇదీ చదవండి: వాట్సాప్ డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి, స్పందించకండి!
సుమారు 5.4 మిలియన్ల (5.5 కోట్లు) ట్విటర్ వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలకు తోడు అదనంగా 1.4 మిలియన్ల ట్విటర్ ప్రొఫైల్స్ చోరీ అయ్యాయట. ట్విటర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API)ని ఉపయోగించి సెలబ్రిటీల నుండి కంపెనీల వరకు వినియోగ దారుల కీలకమైన వ్యక్తిగత డేటాను లీక్ చేసినట్టు తెలుస్తోంది. ట్విటర్ ఐడీలు, ప్రదేశాలు, పేర్లు, లాగిన్ పేర్లు లాంటి పబ్లిక్ సమాచారంతోపాటు, ఫోన్ నంబర్లు, ఇమెయిల్ అడ్రస్‌లు ఇతర ప్రైవేట్ డేటాను హ్యాకర్లు కొట్టేసి ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశారని సమాచారం.
ట్విటర్ డేటా ఉల్లంఘన
గత జూలైలోనే హ్యాకర్ 5.4 మిలియన్లకు పైగా ట్విట్టర్ వినియోగదారుల ప్రైవేట్ సమాచారాన్ని హ్యాకింగ్ ఫోరమ్‌లో 30వేల డార్లకు విక్రయించడం ప్రారంభించాని వార్తలొచ్చాయి. అయితే దీంతోపాటు మరో ఏపీఐ ద్వారా 1.4 మిలియన్ల ట్విటర్ ప్రొఫైల్స్ కూడా ఏపీఐ ద్వారా చోరీ అయ్యాయి. అంతేకాదు దాదాపు 7 మిలియన్ ట్విట్టర్ ప్రొఫైల్స్ ప్రైవేట్ సమాచారం లీక్ అయిందని బ్లీపింగ్ కంప్యూటర్ నివేదించింది. ఇంకా, ఆగస్ట్‌లో విక్రయించిన అసలు డేటాలో ఈ ఫోన్ నంబర్‌లు లేవనీ, ఇంతకుముందు వెల్లడించిన దానికంటే పెద్ద Twitter డేటా ఉల్లంఘన అని పేర్కొంది.
మరోవైపు ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్ బ్రీచ్డ్ ఫోరమ్స్ ద్వారా ఈ డేటా విక్రయానికి ఉన్నట్టు ఒక హ్యాకర్ హెచ్చరించాడు. భద్రతా నిపుణుడు చాడ్ లోడర్ తొలుత ఈ వార్తలను ట్విటర్‌లో పోస్ట్ చేసిని వెంటనే అతని ఖాతాను బ్లాక్ చేయడంతో మాస్టోడాన్‌లో ఈ పెద్ద డేటా ఉల్లంఘనకు సంబంధించిన నమూనాను పోస్ట్ చేసారు.ఈయూ, అమెరికా దేశాలకు చెందిన మిలియన్ల కొద్దీ ట్విటర్ ఖాతాలు ప్రభావితమైందనీ, ఈ ఉల్లంఘన 2021 కంటే ముందుగానే జరిగిందని లోడర్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు హ్యాకింగ్ ముప్పు మరింత ముదురుతోందని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, 17 మిలియన్లకు పైగా రికార్డులు లీక్ చేసినట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించాడు. ఈ నివేదికపై ట్విటర్, మస్క్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కాగా లాగిన్ క్రెడెన్షియల్స్ యాక్సెస్‌లో సమస్యలు, మీ ఖాతా సస్పెండ్ చేయబడిందంటూ మీకు ఇమెయిల్ వస్తే ఫిషింగ్ ఎటాక్‌గా అనుమానించి, ఆ మెయిల్‌ను పరిశీలించడం చాలా అవసరమని నిపుణులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment