వాషింగ్టన్: ఉపాధి ఆధారిత ఆన్‌లైన్ సేవలను అందించే లింక్డిన్ యూజర్ల డేటా ఆన్‌లైన్‌లో లీకైనట్లు తెలుస్తోంది. సుమారు 700 మిలియన్ల లింక్డిన్ యూజర్ల డేటా ఆన్‌లైన్‌లో బహిర్గతమైనట్లు వార్తలు వస్తున్నాయి. హాకర్లు యూజర్ల డేటాను ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచారని తెలుస్తోంది. లింక్డిన్ సుమారు 756 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉండగా..సుమారు 92 శాతం వరకు వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో లీకైంది. వినియోగదారుల ఈ మెయిల్, ఫోన్ నంబర్, పనిచేసే ఆఫీసు, పూర్తి పేరు, ఖాతా ఐడీలతో పాటుగా యూజర్ల సోషల్ మీడియా ఖాతాల లింకులు, వ్యక్తిగత వివరాలు లీకైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యూజర్ల సాలరీ వివరాలు కూడా లీకైనట్లు తెలుస్తోంది.
కాగా తాజాగా లింక్డిన్ డేటా లీక్‌పై స్పందించింది. లింక్డిన్ ఒక ప్రకటనలో.. ‘యూజర్ల డేటా లీక్ జరగలేదని పేర్కొంది. కానీ ఇతర మ్యాడుల్ నెట్‌వర్స్క్‌తో హాకర్లు డేటాను పొందారని లింక్డిన్ తెలిపింది. కాగా డేటా లీక్‌పై లింక్డిన్ ప్రతినిధులు దర్యాప్తు చేపడుతున్నారని వివరించింది. కంపెనీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో హాకర్లు ఇతర వనరులను ఉపయోగించి డేటాను పొందారని తెలిపింది.
లింక్డిన్ తన యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. యూజర్లు తమ ఖాతాలకు కచ్చితంగా 2FA టూ ఫ్యాక్టర్ అథణ్‌టికేషన్‌ను ఉండేలా చూసుకోవాలని లింక్డిన్ సూచించింది. సుమారు ఒక మిలియన్ యూజర్ల డేటాను హాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment