సాక్షి : సాంకేతికతతో ఎంత మేర ఉపయోగాలు ఉన్నాయో.. సరైన భద్రత పాటించకపోతే అదే స్థాయిలో కూడా ప్రమాదం కూడా వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల నుంచే అన్ని అవసరాలు తీర్చుకుంటున్న వేళ ఆ జాగ్రత్త మరింత అవసరం. మెయిళ్లకు వచ్చే అనవసరమైన అటాచ్‌మెంట్ ఫైల్స్.. అనుమానాస్పదంగా కనిపించే లింకులు క్లిక్ చేయటం ఎంత ప్రమాదకరమో తరచూ నిపుణులు హెచ్చరిస్తుండటం చూస్తున్నాం.
లాటరీ గెలుచుకున్నారనో లేక మనం నిత్యం ఉపయోగించే సాఫ్ట్ వేర్‌ల సాయంతోనే ప్రమాదకరమైన వైరస్‌ను హ్యాకర్లు పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు బార్ కోడ్‌లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ది కన్వర్‌జేషన్ అనే ప్రముఖ మాగ్జైన్ ఈ మేరకు నిపుణుల అభిప్రాయంతో ఓ కథనం ప్రచురించింది. ఎక్కడపడితే అక్కడ క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్‌లను క్లిక్ చేయటం మంచిది కాదని.. అలా చేస్తే హ్యాకర్లు రూపంలో ముప్పుతప్పదని వారు చెబుతున్నారు.
‘ఉదాహరణకు మీ ఫోన్‌తో ఏదైనా క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా లేక ఫోటో తీసినా చాలూ.. వెంటనే ఆ కోడ్‌లో అప్పటికే ఏర్పాటు చేసిన బగ్ యూఆర్‌ఎల్ లేదా మెయిల్ రూపంలో హ్యాకర్లకు సమాచారం చేరవేస్తుంది. తద్వారా మీ ఫోన్‌లోని డేటాను వారు తస్కరించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రమాదకరమైన వైరస్‌ను మీ కంప్యూటర్, ఫోన్‌లలోకి ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది’ అని అంటున్నారు. ఎంతటి టెక్నాలజీనైనా చేధించగలిగే స్థాయికి హ్యాకర్లు ఇప్పుడు చేరుకున్నారు. కీ బోర్డు మీద టైప్ చేసే ఎలాంటి సమాచారానైనా ఇట్టే పసిగట్టగలుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయా ఉత్పత్తులకు చెందిన వారు, వినియోగదారులు ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
కానీ, 3-డి మోడలింగ్, 3-డి ప్రింటెడ్ విధానాల ద్వారా మాత్రం ఆ అవకాశాలు తక్కువగా ఉంటాయన్నది నిపుణుల వాదన. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో డీఎన్‌ఏ(వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించింది) విధానం తరహాలోనే 3-డి విధానంలో కంప్యూటర్‌లు ఎలాంటి వైరస్ బారిన పడలేదని చెప్పారు. అయితే భవిష్యత్తులో వీటిని కూడా చేధించగలిగే ఆస్కారం లేకపోవటంతో పూర్తి స్థాయి అభివృద్ధి తర్వాతే ఈ విధానాన్ని ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావటం మంచిదని వారు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment