Quick Response code
-
సింగపూర్‌లోనూ భీమ్ యాప్
సింగపూర్: దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్. అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. తాజాగా సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్ జావేద్ అష్రాఫ్... భీమ్ యాప్‌తో క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను (ఎస్‌జీక్యూఆర్) స్కాన్ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్ యాప్ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్‌లో ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నెట్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ (సింగపూర్) సంస్థలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయానికి దేశీ రూపే కార్డులు కూడా సింగపూర్‌లో చెల్లుబాటయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అష్రాఫ్ పేర్కొన్నారు. -
త్వరలో పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్
న్యూఢిల్లీ: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) ప్రచురించే పాఠ్యపుస్తకాలపై వచ్చే ఏడాది నుంచి క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్‌ను ముద్రించనున్నట్లు కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. ఈ కోడ్‌ను విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయడం ద్వారా ఇంటర్నెట్లో ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి ఉన్న వీడియోలు, సబ్జెక్టుల సమాచారాన్ని పొందవచ్చన్నారు. దీంతో విద్యార్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునే వీలుంటుందని చెప్పారు. విద్యా రుణాలు తీసుకునే విద్యార్థులు తాము చదివే కోర్సు కాలపరిమితితోపాటు తర్వాతి ఏడాది వరకు ఆ రుణాలకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ విద్యకు సంబంధించి సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్లను కలిపి ఒకే కార్యక్రమంగా రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
బార్ కోడ్ స్కాన్ కూడా ప్రమాదమే!
సాక్షి : సాంకేతికతతో ఎంత మేర ఉపయోగాలు ఉన్నాయో.. సరైన భద్రత పాటించకపోతే అదే స్థాయిలో కూడా ప్రమాదం కూడా వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల నుంచే అన్ని అవసరాలు తీర్చుకుంటున్న వేళ ఆ జాగ్రత్త మరింత అవసరం. మెయిళ్లకు వచ్చే అనవసరమైన అటాచ్మెంట్ ఫైల్స్.. అనుమానాస్పదంగా కనిపించే లింకులు క్లిక్ చేయటం ఎంత ప్రమాదకరమో తరచూ నిపుణులు హెచ్చరిస్తుండటం చూస్తున్నాం. లాటరీ గెలుచుకున్నారనో లేక మనం నిత్యం ఉపయోగించే సాఫ్ట్ వేర్ల సాయంతోనే ప్రమాదకరమైన వైరస్‌ను హ్యాకర్లు పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు బార్ కోడ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ది కన్వర్జేషన్ అనే ప్రముఖ మాగ్జైన్ ఈ మేరకు నిపుణుల అభిప్రాయంతో ఓ కథనం ప్రచురించింది. ఎక్కడపడితే అక్కడ క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్లను క్లిక్ చేయటం మంచిది కాదని.. అలా చేస్తే హ్యాకర్లు రూపంలో ముప్పుతప్పదని వారు చెబుతున్నారు. ‘ఉదాహరణకు మీ ఫోన్‌తో ఏదైనా క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా లేక ఫోటో తీసినా చాలూ.. వెంటనే ఆ కోడ్‌లో అప్పటికే ఏర్పాటు చేసిన బగ్ యూఆర్ఎల్ లేదా మెయిల్ రూపంలో హ్యాకర్లకు సమాచారం చేరవేస్తుంది. తద్వారా మీ ఫోన్లోని డేటాను వారు తస్కరించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రమాదకరమైన వైరస్‌ను మీ కంప్యూటర్, ఫోన్లలోకి ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది’ అని అంటున్నారు. ఎంతటి టెక్నాలజీనైనా చేధించగలిగే స్థాయికి హ్యాకర్లు ఇప్పుడు చేరుకున్నారు. కీ బోర్డు మీద టైప్ చేసే ఎలాంటి సమాచారానైనా ఇట్టే పసిగట్టగలుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయా ఉత్పత్తులకు చెందిన వారు, వినియోగదారులు ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కానీ, 3-డి మోడలింగ్, 3-డి ప్రింటెడ్ విధానాల ద్వారా మాత్రం ఆ అవకాశాలు తక్కువగా ఉంటాయన్నది నిపుణుల వాదన. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో డీఎన్ఏ(వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించింది) విధానం తరహాలోనే 3-డి విధానంలో కంప్యూటర్లు ఎలాంటి వైరస్ బారిన పడలేదని చెప్పారు. అయితే భవిష్యత్తులో వీటిని కూడా చేధించగలిగే ఆస్కారం లేకపోవటంతో పూర్తి స్థాయి అభివృద్ధి తర్వాతే ఈ విధానాన్ని ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావటం మంచిదని వారు భావిస్తున్నారు. -
పాన్ కార్డుకు కొత్త రూపు..
మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లతో జారీ ముంబై: పాన్ కార్డు కొత్త రూపు సంతరించుకుంది. మరిన్ని భద్రతాపరమైన సదుపాయాలతో దెబ్బతినకుండా ఉండే, వివరాలను తారుమారు చేయడానికి వీల్లేని కార్డుల జారీని ప్రభుత్వం ప్రారంభించింది. ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లోనూ ‘పాన్ కార్డు అని రాసి ఉన్న’ కొత్త తరహా కార్డులను జారీ చేస్తున్నట్టు ఆదాయపన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. వీటిని లోపరహితంగా రూపొందించినట్టు చెప్పారు. ఎన్ఎస్డీఎల్, యూటీఐఐటీఎస్ఎల్ జవనరి 1 నుంచే పంపిణీ చేయడం ప్రారంభించాయని... కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వీటిని జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే పాన్ కార్డు కలిగిన వారు కొత్త కార్డు తీసుకోవాలని కోరుకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం దని సూచించారు. ఈ కార్డులకు ప్రభుత్వం కొత్తగా క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను చేర్చింది. దీంతో తనిఖీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయవచ్చు. ఈ కోడ్ సాయంతో కార్డు దారుల వివరాలను అధికారులు వేగంగా తెలుసుకోవడం వీలవుతుంది.