సింగపూర్‌లోనూ భీమ్‌ యాప్‌ | BHIM UPI goes international | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లోనూ భీమ్‌ యాప్‌

Nov 14 2019 5:47 AM | Updated on Nov 14 2019 5:47 AM

BHIM UPI goes international - Sakshi

సింగపూర్‌: దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్‌ యాప్‌.  అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. తాజాగా సింగపూర్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్‌ జావేద్‌ అష్రాఫ్‌... భీమ్‌ యాప్‌తో క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ను  (ఎస్‌జీక్యూఆర్‌) స్కాన్‌ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్‌ యాప్‌ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్‌లో ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నెట్‌వర్క్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్స్‌ (సింగపూర్‌) సంస్థలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయానికి దేశీ రూపే కార్డులు కూడా సింగపూర్‌లో చెల్లుబాటయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అష్రాఫ్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement