డిజిటల్ చెల్లింపులు వచ్చిన తరువాత భారతదేశంలో చిన్న కిరాణా షాపు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చేతిలో డబ్బు ఉంచుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. గత కొన్ని రోజుల ముందు వరకు యూపీఐ పేమెంట్స్ కేవలం దేశానికి మాత్రమే పరిమితమై ఉండేవి. కాగా మారుతున్న కాలంలో పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని యూపీఐ పేమెంట్స్ విదేశాలకు కూడా వ్యాపించాయి.
ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అనేది విదేశాల్లో కూడా చెల్లుబాటు అవుతుండటంతో ఆయా దేశాల కరెన్సీలతోనే చెల్లింపులు జరుగుతున్నాయి. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు ప్రత్యేకించి ఆ దేశ కరెన్సీని తమతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు భారతదేశంలో మాత్రమే కాకుండా.. సమీప దేశమైన శ్రీలంక, భూటాన్, మారిషస్, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, నేపాల్ దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.
శ్రీలంకలో పర్యటించే భారతీయులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. మారిషస్ దేశంలో కూడా ఇండియన్స్ డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉంది. మారిషస్ వాసులకు కూడా మన దేశంలో ఆ సదుపాయం కల్పించారు, కాబట్టి వారు కూడా మనదేశంలో డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు.
ఇండియాలో కాకుండా మొదటిసారి యూపీఐ సేవలను అనుమతించిన దేశం భూటాన్. 2012 జులై 13న ఆ దేశంలో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని కోసం భీమ్ యాప్ & భూటాన్ రాయల్ మానిటరీ అథారిటీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.
భారతదేశ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి UAE, యూఏఈలోని ప్రధాన బ్యాంకు మష్రెక్‌తో కలిసి కొద్ది రోజుల క్రితం దేశంలో UPI చెల్లింపులను స్వీకరించడానికి సంబంధించి భారత ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఫ్రాన్స్ లైరా నెట్‌వర్క్‌తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే భాగస్వామ్య కుదుర్చుకున్నాయి.
ఫోన్‌పే డేటాబేస్ ప్రకారం యూపీఐ చెల్లింపులకు మద్దతు ఇచ్చే బ్యాంకుల జాబితా..
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- కెనరా బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్
- ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్
- ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్
- ఇండియన్ బ్యాంక్
- ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్
- కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్
- పంజాబ్ & సింధ్ బ్యాంక్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్
- కాస్మోస్ బ్యాంక్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్..
Comments
Please login to add a commentAdd a comment