
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన వ్యాపార సమ్మేళనం ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ట్రంప్ సంస్థ ఆర్గనైజేషన్‌కు భారత్‌లో ప్రాపర్టీ డెవలప్మెంట్ భాగస్వామి అయిన ట్రిబెకా డెవలపర్స్ 289 మిలియన్ డాలర్లకుపైగా అమ్మకాల లక్ష్యంతో దేశంలో మొదటి ట్రంప్-బ్రాండెడ్ వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించింది.
దశాబ్ద కాలంలో భారతదేశం అమెరికా వెలుపల ట్రంప్ బ్రాండ్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా మారింది. ఇక్కడ ట్రిబెకా ఇతర స్థానిక డెవలపర్లతో లైసెన్సింగ్ ఒప్పందాల కింద నాలుగు భారతీయ నగరాల్లో నివాస ప్రాజెక్టుల అభివృద్ధిలో పాలుపంచుకుంది.
గత దశాబ్ద కాలంలో అనేక పెద్ద అంతర్జాతీయ, స్థానిక ఐటీ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేసిన పశ్చిమ భారత నగరం పుణెలోనే రియల్ ఎస్టేట్ కంపెనీ కుందన్ స్పేసెస్ సహకారంతో "ట్రంప్ వరల్డ్ సెంటర్" పేరుతో ఆఫీస్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా ముంబైలో రాయిటర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment