Real Estate company
-
రాజధానిలో కొత్త ఐటీ పార్క్
సాక్షి, హైదరాబాద్: సింగపూర్‌కు చెందిన క్యాపిట ల్యాండ్ రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్‌లో రూ.450 కోట్లతో అత్యాధునిక ఐటీ పార్కు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ పార్క్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారం క్యాపిటల్యాండ్ ప్రతినిధి బృందంతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, క్యాపిటల్యాండ్ సంస్థ పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. క్యాపిటల్యాండ్ కొత్త ఐటీ పార్కు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్లూచిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను ఈ ఐటీ పార్కులో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ సారథ్యంలో హైదరాబాద్ సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, అక్కడ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం పేర్కొన్నారు.ఇప్పటికే పలు పెట్టుబడులు..క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్ పార్క్ (ఐటీపీహెచ్), అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలో అందుబాటులోకి రానుంది. ఐటీపీహెచ్ రెండో దశ కూడా ఈ ఏడాది ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది. సింగపూర్‌లో జరిగిన ఈ చర్చల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఉన్నతాదికారులు, క్యాపిటల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ పాల్గొన్నారు.మెరీనా బేలో సీఎం పడవ ప్రయాణంసీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్‌లోని మెరీనా బేలో ఫెర్రీ ప్రయాణం చేశారు. మెరీనా బే తీరంలో నిర్మించిన ఆకాశహర్మ్యాలను తిలకించి, వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పర్యాటకాభివృద్ధికి చేపట్టిన చర్యలను పరిశీలించారు.ముగిసిన సింగపూర్ పర్యటనసీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన ముగిసింది. సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు అక్కడి నుంచి ఆదివారం రాత్రి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరారు. సోమవారం దావోస్‌కు చేరుకుంటారు. అక్కడ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేసే లక్ష్యంతో దావోస్‌కు వెళుతున్నట్టు రాష్ట్ర ప్రతినిధి బృందం పేర్కొంది. ఇక సింగపూర్‌లో తమ పర్యటన విజయవంతమైందని తెలిపింది. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవటం కీలక పరిణామం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ఒప్పందం, రూ.450 కోట్లతో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ ఒప్పందం కీలక అంశాలని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని చెబుతున్నాయి.చివరి రోజు వరుస సమావేశాలుసింగపూర్ పర్యటనలో ఆదివారం సీఎం బృందం వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్‌తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్‌తో భేటీ అయింది. హైదరాబాద్‌లో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వివరించింది. -
సెల్లో సొల్లు ముచ్చట్లు !
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ వినియోగం అనేది నిత్య జీవితంలో ఒక భాగమైంది. ఎక్కడున్నా ఇతరులతో మనం ఎప్పుడూ ‘హలో’దూరంలోనే ఉండొచ్చు. అయితే ఈ మొబైల్ ఫోన్లలో ఇప్పుడు సొల్లు ముచ్చట్లు ఎక్కువయ్యాయి. మనకు అవసరం లేని విషయాలు చెప్పి విసిగించే వారు ఎక్కువవుతున్నారు. బిజినెస్ ప్రమోషన్లు, ఆర్థికపరమైన ఆఫర్లు, అంశాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పేరిట ప్రతి నిత్యం ఏదో ఒక అపరిచిత నంబర్ నుంచి మన మొబైల్ ఫోన్‌కు ఫోన్‌కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు రావడం పరిపాటిగా మారింది. మొబైల్ వినియోగదారుల చెవిలో మోతగా మారిన ఈ పెస్కీ (ఇబ్బందికరమైన) కాల్స్‌తో మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై లోకస్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది.మొత్తం 18,173 మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా వీరిలో 95 శాతం మంది ఈ తరహా ఫోన్‌కాల్స్ వస్తున్నట్టు తెలిపారు. రోజుకు సరాసరిన 3 కాల్స్ పైనే వచి్చనట్టు సర్వేలో పాల్గొన్న 77 శాతం మంది వెల్లడించారు. డీఎన్డీ (డు నాట్ డిస్ట్రబ్–అనవసర ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్లు రావొద్దు అని పెట్టుకునే ఆప్షన్) వాడుతున్న వారికి ఈ స్పామ్ కాల్స్ బెడద తప్పడం లేదు. మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారిన ఈ తరహా ఫోన్‌కాల్స్‌కు సంబంధించి మొబైల్ వినియోగదారులు లోకల్ సర్కిల్స్ సర్వేలో పంచుకున్న అంశాలు ఇలా.. గత ఆరు నెలల్లో మరింత పెరిగిన బెడద ఇలాంటి అనవసర, వ్యాపార ప్రమోషన్లకు సంబంధించిన ఫోన్‌కాల్స్ బెడద మొబైల్ వినియోగదారులు గత ఆరు నెలల్లో మరింత పెరిగినట్టు సర్వే నివేదిక వెల్లడించింది. ఆరు నెలల కిందట 90 శాతం నుంచి 95 శాతానికి ఇది పెరిగినట్టు తెలిపింది. ఆరు నెలల కిందట రోజుకు పదికిపైగా స్పామ్‌కాల్స్ వచ్చే వారి సంఖ్య 3 శాతం ఉండగా.. ఇది ఆరు నెలల్లో 23 శాతానికి పెరిగినట్టు సర్వే పేర్కొంది. అయితే, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ స్పామ్‌కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు ట్రాయ్ (టెలీకమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చర్యలకు ఉపక్రమించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. -
షేర్లు.. ఆస్తులు..పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల అక్రమార్జనతో దొరికిపోయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుని తాను పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు తీసుకోవడంతో పాటు పెట్టుబడులు సైతం పెట్టినట్టు సమాచారం. శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరో రోజు కస్టడీలో భాగంగా సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. తమ సోదాల్లో గుర్తించిన ఆస్తులు, ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, లాకర్లు, కీలక ఆస్తులకు సంబంధించిన పత్రాలు.. ఇలా పలు అంశాలపై గత ఐదు రోజులుగా శివబాలకృష్ణ నుంచి సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో లింకులపై ఫోకస్ పెట్టారు. పలు రకాల అనుమతులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రియల్ కంపెనీలతో పలు లావాదేవీలు ప్రాథమిక ఆధారాల ప్రకారం..ప్రధానంగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. సోమవారం నాటి విచారణలో భాగంగా సంబంధిత వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా లాకర్లు ఓపెన్ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు. అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరిన్ని అంశాలపై శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఔటర్ చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లోనూ అవినీతికి పాల్పడిన శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. వీటి గురించి కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక అంశాలపై మరిన్ని వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. -
రూ. 1.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. భారత్‌లోకి అమెరికా రియల్ ఎస్టేట్ దిగ్గజం
భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం భారత్‌లో అడుగు పెడుతోంది. మీడియా నివేదికల ప్రకారం యూఎస్ ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్థ ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్.. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ పేరుతో భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ ఇప్పటికే 26 దేశాలలో తన ఉనికిని నెలకొల్పింది. 17,000 ఏజెంట్ల నెట్‌వర్క్‌తో ఖాతాదారులకు రియల్ ఎస్టేట్ సేవలను అందిస్తోంది. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ అనేది ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ విస్తరణ సంస్థ. ఇది ఇన్విటేషన్ ఓన్లీ (సభ్యులు మాత్రమే) నెట్‌వర్క్‌గా పనిచేస్తుంది. భారత్‌లో ఎంపిక చేసిన నగరాల్లో వ్యాపారం నిర్వహిస్తుంది. విలాసవంతమైన జీవనం కోసం ఒక బెంచ్‌మార్క్‌ని నెలకొల్పడం ద్వారా భారతదేశం అంతటా ప్రత్యేకమైన ఆస్తులతో సంపన్నులు, పెట్టుబడిదారులకు వేదికను ఏర్పాటు చేయడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యం. సంపన్నవర్గాలే టార్గెట్ సంస్థ విస్తరణ పట్ల ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ సీఈఓ మైఖేల్ డబ్ల్యూ జల్బర్ట్ సంతోషం వ్యక్తం చేశారు. అల్ట్రా-లగ్జరీ నివాసాలను కోరుకునేవారికి అపరిమిత అవకాశాలను కల్పిస్తామన్నారు. భారత విలాసవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించాడాన్ని గౌరవాన్ని భావిస్తున్నట్లు బోర్డ్ అధిపతి మాట్ బీల్ పేర్కొన్నారు. భారత జనాభాలోని ఎలైట్ సెగ్మెంట్ లక్ష్యంగా భారతీయ రియల్ ఎస్టేట్‌లో లగ్జరీకి కంపెనీ ప్రాతినిధ్యం వహిస్తుందని ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ హెడ్ ఏకే శర్మ తెలిపారు. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ చేపట్టే ప్రాజెక్ట్‌లలో హిమాచల్ ప్రదేశ్‌లోని పెద్ద ఎస్టేట్లు, ముంబైలోని అరేబియా సముద్రం వీక్షణలతో కూడిన ఉన్నత స్థాయి పెంట్‌హౌస్‌లు వంటి విభిన్న ఎంపికలు ఉండనున్నాయి. న్యూ ఢిల్లీలోని ప్రారంభ ప్రాజెక్ట్‌లో 7 ఎకరాల ప్లాట్‌లో హై-ఎండ్ రిటైల్ స్పేస్‌లు, క్లబ్, విలాసవంతమైన హోటల్ ఉంటాయి. రూ. 1.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభ వెంచర్లలో ఒకటిగా ముంబైలో 1200 ఎకరాల భూమి అభివృద్ధికి ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ స్థానిక ఆరెంజ్ స్మార్ట్ సిటీ సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది. రూ. 1.2 లక్షల కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ 10 లక్షల కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టింది. -
తమిళనాడు: స్టాలిన్ బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఐటీ సోదాల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఐటీ అధికారులు సోమవారం ఉదయం నుంచి 50 ప్రాంతాల్లో బృందాలుగా సోదాలు నిర్వహించారు. ఇక, తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యుల ఇళ్లలో, అధికార డీఎంకే నేతలు, జీ స్వ్కేర్ కంపెనీ రియల్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్నానగర్ డీఎంకే ఎమ్మెల్యే మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
Hyderabad: 300 మందిని నిండా ముంచిన రియల్‌ఎస్టేట్స్ సంస్థ
మియాపూర్ (హైదరాబాద్): పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును ప్లాట్ల కొనుగోలు కోసం చెల్లిస్తే.. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్‌ఎస్టేట్స్ సంస్థ వారిని నిండా ముంచింది. సుమారు 300 మంది నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేసి.. వారికి ప్లాట్లు ఇవ్వకుండా, డబ్బులూ తిరిగివ్వకుండా బోర్డు తిప్పేసింది. దీనితో హైదరాబాద్‌లోని మియాపూర్ ఆల్విన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయం ముందు బాధితులు ఆదివారం ధర్నాకు దిగారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో అక్కడి నుంచి మియాపూర్ పోలీస్‌స్టేషన్ వరకు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలదాకా.. బాధితులు వెల్లడించిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన జానీ బాషాషేక్ రామంతాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ.. మియాపూర్‌లో మైత్రి ప్రాజెక్టు రియల్ ఎస్టేట్స్ పేరిట కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని గాగిలాపూర్లోని రాయల్ లీఫ్, రామేశ్వర్బండలోని రాయల్ ప్యారడైజ్, మామిడిపల్లిలో రాయల్ వింట్, హంబ్టాన్ ఫామ్స్ పేరుతో వెంచర్లు వేసి.. ఓపెన్ ప్లాట్లను విక్రయిస్తున్నట్టు ప్రచారం చేశాడు. తప్పుడు డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు చూపించి తక్కువ ధరకే ప్లాట్లను ఇస్తామంటూ ప్రజలను నమ్మించాడు. పలు ప్రాంతాలకు చెందిన 300 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.10 లక్షల నుండి రూ.30 లక్షల మేర కట్టించుకున్నాడు. కానీ రిజిస్ట్రేషన్స్ చేయకుండా బాధితులను మూడేళ్లుగా తిప్పించుకుంటూ వచ్చారు. చివరికి మకాం మార్చి సంస్థకు తాళం వేసి పారిపోయాడు. నెల రోజుల కిందే ఫిర్యాదు చేసినా.. తమకు న్యాయం చేయాలని కోరుతూ మియాపూర్, పటాన్చెరువు, సంగారెడ్డి పోలీస్ స్టేషన్లలో నెల రోజుల క్రితం ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మైత్రి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మియాపూర్ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ చేశామని వివరించారు. మైత్రిలో డబ్బులు కట్టినవారంతా పేద, మధ్య తరగతికి చెందినవారమేనని.. తమ కలలు కల్లలు అవుతున్నాయని వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్: గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ దాడులు
-
HYD: గూగి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: గూగి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ అధికారులు సోదావు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏకకాలంలో 20 చోట్ల రియల్ ఎస్టేట్ కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వివరాల ప్రకారం.. గూగి కంపెనీ ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ పేర్లతో హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. కాగా, మంగళవారం ఐటీ అధికారులు గూగికి సంబంధించిన కంపెనీల డైరెక్టర్ల నివాసాలపై 20 చోట్ల ఒకే సమయంలో సోదాలు నిర్వహించారు. ఇక, దిల్‌షుక్‌నగర్‌లోని గూగి ప్రధాన కార్యాలయంలో ఐదు బృందాలతో ఐటీ దాడులు జరుపుతోంది. -
జయత్రి ఇన్ఫ్రా మోసాలు.. రియల్ ఎస్టేట్ పేరుతో నమ్మించి ముంచేశారు
కేపీహెచ్‌బీకాలనీ: జయత్రి ఇన్ఫ్రా కంపెనీ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఫ్రీ లాంచ్ పేరుతో పలువురి నుంచి రూ.కోట్లలో దండుకుని మొహం చాటేయటంతో బాధితులు పోలీసుస్టేషన్‌కు క్యూ కడుతున్నారు. దాదాపు రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించిన వారి వివరాలను బట్టి తెలుస్తుండగా, రూ.100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. మీడియాలో వస్తున్న కధనాలను చూసి బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కాగా, 2020 నుంచి ఆకర్షణీయమైన ప్రాజెక్టుల పేరుతో, వివిధ సంస్థల పేరుతో రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు. వినియోగదారులకు ఇస్తానన్న ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్ల ఫ్లాట్లు ఇవ్వక పోవటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల ఫిర్యాదుతో బుధవారం సంస్థ ఎండి కాకర్ల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో చెల్లించిన పలువురు గురువారం కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజులోని జయత్రి రిలయబిలిటి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే కార్యాలయం మూసి ఉండటంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరో 15 మంది ఫిర్యాదు.. కేపీహెచ్‌బీ కాలనీలో కార్యాలయం మూసివేసి ఉండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమతో డబ్బులు కట్టించిన సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లకు ఫోన్ చేస్తే కొందరు లిఫ్ట్ చేయడం లేదని, మరి కొందరు తాము జయతి సంస్థలో ఉద్యోగం మానేశామని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మరో 15 మంది బాధితులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిజాంపేట్, చందానగర్, సర్ధార్‌పటేల్ నగర్, అమీన్‌పూర్‌లలో అపార్టుమెంట్లు నిరి్మస్తున్నట్లు నమ్మిస్తూ భూ యజమానులతో సంతకాలు, అగ్రిమెంట్ పత్రాలు చూపించటంతో ఫ్రీ లాంచ్‌లో తక్కువకు వస్తుందని కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు మొదలు 1.5 కోట్లు డబ్బులు కట్టించుకుని ఫ్లాట్లు ఇవ్వకుండా మొహం చాటేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర సంస్థల్లో పెట్టుబడులు.. జయత్రి రిలియబిలిటీ సంస్థతో పాటు గడిచిన రెండున్నరేళ్ల కాలంలో పదుల సంఖ్యలో ఇన్ఫ్రా, మైనింగ్, రిసార్ట్స్ సంస్థలను ఏర్పాటు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును భూముల కొనుగోలు, మైనింగ్లలో పెట్టుబడులు పెట్టి ఉంటారని బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆధారాలతో వస్తే కేసులు నమోదు చేస్తాం.. జయత్రి సంస్థ బాధితుల ఎవరైనా సరే డబ్బులు చెల్లించి మోసపోయినట్లు ఆధారాలతో వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. బుధవారం వరకు 8 మంది ఫిర్యాదు చేయగా నిందితుడు కాకర్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. గురువారం కొందరు బాధితులు వచ్చారు. డబ్బులు ఇచి్చనట్లుగా రశీదులు, అగ్రిమెంట్లు వంటి ఆధారాలు తీసుకువచ్చి నిరి్థష్టమైన ఫిర్యాదులు ఇవ్వాలని సూచించాం. – కిషన్ కుమార్, సీఐ, కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ -
ఆర్థిక అవకతవకలు..పన్ను ఎగవేత!
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ సంస్థ వంశీరాం బిల్డర్స్పై ఐటీ అధికారుల దాడులు బుధవారం రెండోరోజు కూడా కొనసాగాయి. వంశీరాం బిల్డర్స్ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించినట్టు తెలిసింది. వినియోగదారులకు విక్రయించిన ఫ్లాట్లు, కమర్షియల్ ప్రాంతాలకు సంబంధించిన లావాదేవీల్లో పెద్ద ఎత్తున ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్టుగా వెల్లడైందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. కాగా సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగించడంతో పాటు ఆయన బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు తెరిపించారు. వాటిల్లో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, విలువైన స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు చేసిన అధికారులు, బుధవారం ఉదయం నుంచి మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సుబ్బారెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగినట్లు తెలుస్తోంది. ఆదాయానికి తగ్గట్టుగా లేని పన్ను చెల్లింపులు! వంశీరాం సంస్థలో పనిచేసే ఉద్యోగుల పేరిట తెరిపించిన ఖాతాల ద్వారా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన అధికార యంత్రాంగం ఆ మేరకు పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆదిత్య అనే వ్యక్తితో కలిసి సుబ్బారెడ్డి ఆరెంజ్ లైనర్ ప్రాపర్టీస్‌లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ సంస్థలో వారిద్దరూ డైరెక్టర్లుగా కూడా ఉన్నట్టు తెలిసింది. దీంతో కావూరి హిల్స్‌లోని ఆదిత్య ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. సుబ్బారెడ్డి ఇంట్లో దొరికిన కీలక పత్రాలు, ఇతరుల భూముల అభివృద్ధి ఒప్పంద పత్రాలు, వారికి ఇచ్చిన అడ్వాన్స్‌లు తదితర పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టి, వాటి విక్రయాలతో భారీ ఎత్తున ఆదాయం సమకూరినా.. ఆ స్థాయిలో పన్ను చెల్లింపులు చేయలేదని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అయితే ఈ సోదాల్లో ఎంత మొత్తం బంగారం, నగదు బయటపడిందీ, కీలక స్థిరాస్తి పత్రాల విలువ ఎంత? అన్న దానిపై ఐటీ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇలావుండగా ఐటీ అధికారులు నిర్వహిస్తున్న దాడులతో సుబ్బారెడ్డి కుటుంబంలోని వారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, అందు కోసం ఓ ఆసుపత్రి నుంచి వచ్చిన డాక్టర్లతో ఐటీ అధికారులు వారికి బీపీ పరీక్షలు నిర్వహింప చేశారని తెలిసింది. -
ఐటీ సోదాలు.. ప్రముఖుల బెంబేలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ సంస్థలపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులు రాజకీయ వర్గాల్లో, ప్రముఖుల్లో గుబులు రేపుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ప్రముఖ కంపెనీలు వాసవి, సుమధుర, ఫీనిక్స్‌లో జరుగుతున్న సోదాల వ్యవహారం బడాబాబుల పీకలకు చుట్టుకునేలా ఉందన్న చర్చ జరుగుతోంది. తొలుత వాసవి, సుమధుర ఐటీ శాఖ వారం క్రితం వాసవి కంపెనీతో పటు సుమధుర గ్రూపుపై దాడులు నిర్వహించింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన 27 ఎకరాల భూమిని వాసవి–సుమధుర జాయింట్ వెంచర్ కింద కొనుగోలు చేసి డెవలప్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఐటీ రంగంలోకి దిగి దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, చెల్లింపులకు సంబంధించి అంతర్గత ఒప్పంద పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. తర్వాత ఫీనిక్స్ గల్ఫ్ ఆయిల్ సంస్థకు చెందిన భూముల కొనుగోలు వ్యవహారంలో ఫీనిక్స్ పాత్రపై ఐటీ శాఖకు ఫిర్యాదులు వచ్చి నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వాసవి, సుమధుర, ఫీనిక్స్ మధ్య పెద్దయెత్తున లావాదేవీలు జరిగాయని, అందులో పన్ను చెల్లించని సొమ్ము భారీ స్థాయిలో చేతులు మారినట్టు ఐటీ శాఖ గుర్తించింది. వాసవి, సుమధుర కంపెనీల్లో సాగిన ఐటీ సోదాల్లో ఫీనిక్స్ కంపెనీతో జరిగిన లావాదేవీల తాలుకు ఆధారాలు లభించడం వల్లే చిక్కడంతోనే ప్రస్తుతం ఫీనిక్స్‌పై దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఫీనిక్స్ తక్కువ టైమ్‌లో ఎక్కువ భూమిని సమీకరించడంతో పాటు భారీస్థాయిలో బిజినెస్ విస్తరణ చేస్తోంది. నగరంలోని దాదాపు 15 ప్రముఖ ప్రాంతాలతో పాటు బెంగళూరులోనూ భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టింది. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రీలాంచ్ పేరుతో కోట్లాది రూపాయల నగదును వసూలు చేసి లెక్కల్లోకి రాకుండా చేసినట్టు ఐటీ అధికారులు చెబుతున్నారు. ఇలా భారీ సంఖ్యలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ప్రీలాంచ్ బుకింగ్ రసీదులు, చేతి రాతతో ఉన్న ఖాతా పుస్తకాలను ఫీనిక్స్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖుల్లో ఆందోళన: ఈ మూడు సంస్థలపై ఐటీ సోదాలు జరగడం రాజకీయ ప్రముఖుల్లో గుబులు రేపుతోంది. అనేకమంది ప్రముఖులు తమ బినామీలతో ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బినామీల ద్వారా వందల కోట్ల డబ్బును రియల్ రంగంలోకి తరలించినట్టు ఐటీ వర్గాలు అనుమానిస్తున్నాయి. వివాదాస్పదంగా ఉన్న కొన్ని భూములను ఈ సంస్థలు చేజిక్కించుకొని నిర్మాణ లు చేపట్టడం వెనకున్న ప్రముఖులకు సంబంధించిన లా వాదేవీలకు ఆధారాలు గుర్తించినట్టు ఐటీ వర్గాలు తెలిపా యి. దీనితో ప్రముఖులు ఎప్పుడు ఐటీ విభాగం తమ మీ ద పడుతుందో అన్న ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఫిర్యాదు వల్లేనా..? నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో కీలకంగా ఉన్న భూములను దక్కించుకుంటున్న ఈ ప్రముఖ రియల్ కంపెనీలపై ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపుగా ఏడాది క్రితం ఐటీ విభాగానికి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసిందనే చర్చ జరుగుతోంది. తమకు దక్కాల్సిన భూములు ఈ మూడు సంస్థలకు దక్కడంపై ఐటీకి సంబంధిత బడా సంస్థ స్పష్టమైన ఆధారాలు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ సోదాలు ప్రారంభమైనట్టు అనుమానిస్తున్నారు. ఐటీ... తర్వాత రంగంలోకి ఈడీ! ప్రస్తుతం ఐటీ నిర్వహిస్తున్న సోదాల్లో లభ్యమవుతున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పరిగణనలోకి తీసుకొని రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. దీంతో రియల్ సంస్థల అధిపతులు, పెట్టుబడులు పెట్టిన భాగస్వాములు, రాజకీయ ప్రముఖులు వణికిపోతున్నట్టు సమాచారం. ముంబై నుంచి 250 మంది.. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి ఫీనిక్స్ సంస్థల చైర్మన్ చుక్కపల్లి సురేశ్‌తో పాటు డైరెక్టర్ల నివాసాలు, కార్పొరేట్ కార్యాలయాల్లో ఐటీ విభాగం సోదాలు ప్రారంభించింది. ముంబై నుంచి 250 మంది ఐటీ అధికారులు 25 బృందాలుగా విడిపోయి సుమారు 25 ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, మూసాపేట తదితర ప్రాంతాల్లోని కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. 2016 నుంచి ఇప్పటివరకు కంపెనీలు కొనుగోలు చేసిన భూములు, ప్రారంభించిన నిర్మాణాలు, వాటి ఖర్చులు, అమ్మకాలకు సంబంధించిన పత్రాలతో పాటు కొనుగోళ్ల..అమ్మకాల అగ్రిమెంట్ పత్రాలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన ఒప్పంద పత్రాలు.. ఇలా వేల సంఖ్యలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ప్రీలాంచ్ పేరిట బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్మకాలకు పెట్టిన నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఐటీ అధికారులు తెలిపారు. -
చైనా ‘ఎవర్‌గ్రాండ్’: దెబ్బ మీద దెబ్బ
China Evergrande shares fall: కరోనా సవాళ్లకు తోడు రియల్టీ రంగం సంక్షోభంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (చైనా) మందగమనంలో ఉంది. ఈ తరుణంలో తాజాగా మరో భారీ పతనం చైనాను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరు దక్కించుకున్న ఎవర్‌గ్రాండ్.. డిఫాల్టర్ మరకను అంటించుకునే టైం దగ్గర పడింది. చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్‌గ్రాండ్’(ఎవర్‌గ్రాండే) షేర్లు భారీగా పతనం అయ్యాయి. పదిహేడు రోజుల విరామం అనంతరం.. గురువారం ఉదయం హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 14 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎవర్‌గ్రాండ్.. యూనిట్లలో ఒకదానిని 2.6 బిలియన్ డాలర్లకు అమ్మేయాలనుకున్న ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో షేర్లు ఒక్కసారిగా పతనం అవుతున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లో వణుకు పుట్టిస్తోంది. ఈ ప్రభావంతో గృహ నిర్మాణ రంగం మందగమనంలో కూరుకుపోయి ప్రపంచవ్యాప్తంగా మెటల్ షేర్లకు డిమాండ్ తగ్గవచ్చనే ఆందోళనలు అధికమయ్యాయి. ఎవర్‌గ్రాండే ప్రాపర్టీస్ సర్వీసెస్‌లో 51 శాతం భాగాన్ని.. హోప్‌సన్ డెవలప్మెంట్ హోల్డింగ్స్‌కు అమ్మాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా ఒక ప్రకటన చేసింది కూడా. అయితే హోప్‌సన్ డెవలప్మెంట్ మాత్రం ఎవర్‌గ్రాండ్ విధించిన తలాతోకలేని షరతుల వల్లే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. చైనాకు చెందిన అతిపెద్ద(రెండవ) రియల్ ఎస్టేట్ డెవలపర్.. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉండేది. సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్లవడ్డీని చెల్లించలేనని ఎవర్‌గ్రాండ్ కిందటి నెలలో ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు 305 బిలియన్ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు నిర్ధారణ కావడంతో రియల్టీ రంగం ఉలిక్కిపడింది. అయితే ఈ సంక్షోభాన్ని తాము తట్టుకుని నిలదొక్కుకుంటామన్న ఎవర్‌గ్రాండ్ ఫౌండర్ క్జూ జియాయిన్(హుయి కా యాన్) హామీ ఫలించడం లేదు. తాజాగా షేర్లు భారీగా పడిపోతుండడంతో.. చైనాలో అతిపెద్ద కార్పొరేట్ పతనం తప్పదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే గ్లోబల్ మార్కెట్ కుదేలు కావడం ఖాయం. ఇక ఎవర్‌గ్రాండే షేర్లు చివరిగా 2010 మేలో కనిష్ట స్థాయిలో ట్రేడ్ కాగా.. ఇప్పుడు అంతకు మించే పతనం కావడం మరో విశేషం. షెంజెన్ కేంద్రంగా చైనా రియల్ ఎస్టేట్ రంగంలో రెండో స్థానంలో ఉన్న ఎవర్‌గ్రాండే.. పోయిన నెలలో పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో చేరాల్సి ఉండగా.. అది కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. షేర్ల పతనంతో కుదేలు అవుతున్న తరుణంలో.. కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. బకాయిల్లో 83.5 మిలియన్ డాలర్ల చెల్లింపులు చేపట్టాలని 30 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే. ఒకవేళ అది జరగకుంటే ఎవర్‌గ్రాండ్‌ను డిఫాల్టర్‌గా ప్రకటిస్తారు. ఘనం నుంచి పతనం ఎవర్‌గ్రాండ్.. 1996 చైనాలో అర్బనైజేషన్ ఉవ్వెత్తున్న కొనసాగిన టైంలో ఏర్పాటైన రియల్ ఎస్టేట్ గ్రూప్. 2009లో 722 మిలియన్ డాలర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆపై 9 బిలియన్ డాలర్లతో చైనాలోనే అతిపెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ కంపెనీగా అవతరించింది. అంతేకాదు వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్(హుయి కా యాన్) ను అపర కుబేరుడిగా మార్చేసింది. 2010లో గువాన్గ్జౌ ఫుట్‌బాల్ టీం కొనుగోలు చేయడం, టూరిజం రిక్రియేషన్ వ్యాపారాలతోనూ వార్తల్లోకి ఎక్కింది. వాటర్ బాటిల్స్ తయారీ, ఈవీ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. అయితే కిందటి ఏడాది అగష్టులో ప్రభుత్వం డెవలపర్స్ మీద ఉక్కుపాదం మోపడం, అడ్డగోలు డిస్కౌంట్లతో అమ్మకాల నుంచి ఎవర్‌గ్రాండ్ పతనం మొదలైంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. డిఫాల్ట్ గండం నుంచి ఎవర్‌గ్రాండ్ బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
సువర్ణ భూమి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
-
రూ.7 కోట్లకు రియల్ బురిడీ!
సాక్షి, అమరావతి: ప్రీలాంచింగ్ ఆఫర్ల పేరుతో రూ.7 కోట్ల వరకు వసూలు చేసిన రియల్ఎస్టేట్ సంస్థ ఎంకే కన్స్ట్రక్షన్స్ తమను మోసగించిందని పలువురు బాధితులు శుక్రవారం విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ మహానాడు రోడ్డు సమీపంలోని ఆ సంస్థ కార్యాలయం వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు మేరకు.. విజయవాడ సమీపంలోని గన్నవరం మండలంలో 15 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నట్టు ఎంకే కన్స్ట్రక్షన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ సంస్థ ప్రతినిధులుగా విశాఖకు చెందిన పట్నాల శ్రీనివాసరావు, విజయవాడ రూరల్ మండలానికి చెందిన మనోజ్‌కుమార్, రవితేజలు పకడ్బందీ మార్కెటింగ్ వ్యూహంతో అందర్నీ నమ్మించారు. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయంతోపాటు విజయవాడ బ్రాంచి ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని చెప్పారు. పలువురిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. ప్రీలాంచింగ్ ఆఫర్‌గా నిర్మాణానికి ముందే డబ్బులు చెల్లిస్తే రూ.35 లక్షల ఫ్లాట్‌ను రూ.18 లక్షలకే ఇస్తామని నమ్మించారు. అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయ్యేవరకు రూ.2 వంతున వడ్డీ కూడా చెల్లిస్తామన్నారు. ఫ్లాట్లు బుక్ చేసే ఏజెంట్లకు మంచి కమీషన్ల ఆశ చూపించారు. దీంతో పలువురు ఏజెంట్లు పెద్దసంఖ్యలో ప్రీలాంచింగ్ ఫ్లాట్లు బుక్ చేయించడమే కాకుండా వారు కూడా ఫ్లాట్ల కొనుగోలుకు డబ్బులు చెల్లించారు. ఆ విధంగా సంస్థకు రూ.7 కోట్ల వరకు సొమ్ము వచ్చింది. కొన్ని నెలలుగా సంస్థ ప్రతినిధులు పట్నాల శ్రీనివాసరావు, మనోజ్‌కుమార్, రవితేజల ఆచూకీ కనిపించడంలేదు. ఫోన్లలో కూడా అందుబాటులో లేరు. ఎంకే కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ ఆఫీసును సంప్రదించినా ఫలితం లేకపోయింది. దాంతో తాము మోసపోయామని గుర్తించిన కొనుగోలుదారులు, ఏజెంట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై సంస్థ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లన్నీ స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. -
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై సీబీఐ అభియోగం
న్యూఢిల్లీ : ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ 'గౌర్సన్స్' కుటుంబసభ్యులపై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. 80 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు సీబీఐ అభియోగం మోపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా , సిండికేట్ బ్యాంకుల నుంచి గౌర్సన్స్ చైర్మన్ బిఎల్ గౌర్ , అతని భార్య నవనీత్ ,కుమారుడు రాహుల్ గౌర్ బ్యాంకుల నుంచి 80 కోట్ల రూపాయలకు మోసం చేశారని అధికారులు వెల్లడించారు. (ఇద్దరు హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు అరెస్ట్) నోయిడాలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌తో కూడిన హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు సదరు కంపెనీ 250 కోట్ల రూపాయలు (బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 150 కోట్లు, సిండికేట్ బ్యాంక్ నుంచి రూ .100 కోట్లు) తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దశల వారిగా చిల్లించాల్సిన డబ్బును చెల్లించడం లేదని, అంతేకాకుండా ప్రాజెక్టు కూడా ప్రారంభ దశలోనే ఆగిపోయిందని బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఫిర్యాదులో పేర్కొంది. తప్పుడు లెక్కలు చూపించి , ప్రాజెక్టు నిర్మిస్తిన్నట్లు అవాస్తవాలను చూపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించింది. (బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్) -
కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని..
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ ఓ ఘరానా నేరగాడు మోసాలు ప్రారంభించాడు. నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి ప్రణాళిక రచించాడు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఫిబ్రవరి 9న తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఆ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా మీ సంస్థే ఎంపికైందంటూ నమ్మబలికాడు. బాధితులు నగర సైబ ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడంతో దీనిపై కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ రంజీ ఆటగాడి పనిగా బుధవారం గుర్తించారు. క్రికెటర్‌కు స్పాన్సర్ కావాలి.. ఈ ఘరానా మోసగాడు అనేకమంది ప్రముఖుల పేర్లు చెప్పుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నగరానికి చెందిన ఓ రియల్ఎస్టేట్ సంస్థ సీఎండీకి గతేడాది డిసెంబర్ 26న ఓ ఫోన్‌కాల్ వచ్చింది. కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి తిరుపతిని మాట్లాడుతున్నానంటూ అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగరాజు అనే యువకుడు క్రికెట్లో ప్రతిభ కనబరుస్తున్నాడని, ఇంగ్లాండ్‌లో జరిగే అండర్–25 వరల్డ్ కప్‌కు సెలెక్ట్ అయ్యాడని చెప్పాడు. ఈ టోర్నీతోపాటు 20–20 సన్‌రైజ్ టీమ్‌కూ ఎంపికయ్యాడని చెబుతూ, నాగరాజు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని అన్నాడు. అతడికి క్రికెట్ కిట్‌తోపాటు లండన్ టూర్ ఖర్చులకు స్పాన్సర్షిప్ అవసరం ఉందని, అందుకు రూ.3.3 లక్షలు ఖర్చవుతాయన్నాడు. ఇదంతా విన్న సదరు సీఎండీ పూర్తిగా తన మాటల వల్లో పడ్డారని మోసగాడు నిర్థారించుకున్నాడు. దీంతో స్పాన్సర్షిప్ నగదును డిపాజిట్ చేయాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. ఈ టోర్నీకి సంబంధించిన క్రికెట్ కిట్‌ను నాగరాజు బెంగళూరులో మీ కంపెనీ పేరుతోనే ప్రింట్ చేయిస్తున్నాడని, దాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ఆయన కార్యాలయంలో, మీడియా సమక్షంలో అందుకుంటాడని చెప్పాడు. ఇది మీ కంపెనీకి మంచి పబ్లిసిటీ ఇస్తుందంటూ నమ్మించాడు. ట్రూ కాలర్‌ను నమ్మి.. మోసపోయారు.. అతడి మాటల్ని అనుమానించిన ఆ సంస్థ ప్రతినిధులు తొలుత సందేహించారు. తమకు కాల్ వచ్చిన ఫోన్ నంబర్‌ను ట్రూ కాలర్ యాప్‌లో తనిఖీ చేయగా అందులో తిరుపతి అనే పేరే కనిపించింది. దీంతో అతడు కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి అనే నమ్మిన సంస్థ నగదును గతేడాది డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్‌లోని నర్సన్నపేట కెనరా బ్రాంచ్ శాఖలో ఉన్న ఖాతాకు బదిలీ చేసింది. ఇది జరిగిన వారం తర్వాత సంస్థ ప్రతినిధులు తిరుపతిగా చెప్పుకున్న వ్యక్తిని ఫోన్ ద్వారా సంప్రదించి కేటీఆర్ కార్యక్రమంపై ఆరా తీశారు. దీంతో ఆయన ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో హడావుడిగా ఉన్నారని, జనవరి 6న నాగరాజుకు కిట్ అందించే కార్యక్రమం ఖరారైందని చెప్పాడు. ఆ రోజు నాగరాజు బెంగళూరుకు వెళ్తుండటంతో మరింత ఆలస్యం అవుతుందని చెప్పాడు. కేటీఆర్ సీఎం అవుతున్నారు.. ఈ నెల 10న ఆ సంస్థ ప్రతినిధులకు మరోసారి ఫోన్ చేసిన అతడు.. కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని నమ్మబలికాడు. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఎల్బీ స్టేడియంలో కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చె΄్పాడు. ఆ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా మీ సంస్థనే సార్(కేటీఆర్) ఎం పిక చేశారంటూ మరో ఎర వేశాడు. ఆపై తమ బంధువు ఒకరు రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, బిల్లుల కోసం రూ.2 లక్షలు సాయం చేయాలని కోరాడు. రాజమండ్రిలోని ఎస్బీఐ శాఖలో అప్పలనాయుడు పేరుతో ఉన్న ఖాతా వివరాలను పంపాడు. దీంతో అనుమానం వచ్చిన సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా తాము మోసపోయామని గ్రహించారు. దీంతో వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేశారు. ఫోన్ నంబర్లు, డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో 2014–16 మధ్య ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీ జట్టులో ఎంపికైన ఓ వ్యక్తి పనిగా అనుమానిస్తున్నారు. బీసీసీఐ సెలెక్టర్‌గా పలువురికి ఫోన్లు చేసి వసూళ్లు, ప్రముఖ రాజకీయ నాయకుడి వ్యక్తిగత సహాయకుడిగా పేర్కొంటూ ఢిల్లీలోని ఓ ఆస్పత్రి నిర్వాహకుడి నుంచి డబ్బు డిమాండ్ చేసి అరెస్టు అయినట్లు పోలీసులు చెప్తున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని తెలిపారు. -
బ్లాక్‌స్టోన్ చేతికి ఇండియాబుల్స్ చెన్నై ప్రాపర్టీ
న్యూఢిల్లీ: ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ చెన్నైలోని ఆఫీస్ ప్రాపర్టీని అంతర్జాతీయ ఇన్వెస్టర్ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించింది. వాణిజ్య ఆస్తుల విక్రయంలో భాగంగా చెన్నైలోని అంబత్తూర్‌లోని ఈ ప్రాపర్టీని విక్రయించినట్లు ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.850 కోట్లని, వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 కల్లా పూర్తవుతుందని పేర్కొంది. 1.9 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌తో కూడిన చెన్నైలోని ఈ ‘వన్ ఇండియాబుల్స్ పార్క్’ దాదాపు పూర్తయిందని, వార్షికంగా రూ.85 కోట్ల అద్దె ఆదాయం లభిస్తుందని వివరించింది. ఈ కంపెనీ ఈ ఏడాది మార్చిలో ముంబైలోని రెండు ప్రధాన వాణిజ్య ఆస్తుల్లో 50 శాతం వాటాను ఇదే సంస్థలకు రూ.3,750 కోట్లకు విక్రయించింది. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ సంస్థ నేరుగా, జాయింట్ వెంచర్ భాగస్వామి ఎంబసీ గ్రూప్‌తో కలసి భారత్‌లోని ప్రధాన నగరాల్లో మొత్తం 6 కోట్ల చదరపుటడుగుల వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేసింది. -
రియల్టీ కంపెనీలపై జీఎస్టీ భారం..
కోల్‌కతా: రియల్ ఎస్టేట్ కంపెనీలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నోట్ల రద్దు తర్వాత మళ్లీ ఇప్పుడు జీఎస్టీ వల్ల రియల్టీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. జీఎస్టీ అమలు వల్ల రియల్ ఎస్టేట్ కంపెనీలపై 5–6 శాతం అదనపు పన్ను భారం పడుతోంది. కంపెనీలు దీన్ని భరించడానికి సన్నద్ధమౌతున్నాయి. ‘మేం పలువురు బిల్డర్లతో మాట్లాడాం. వీరు జీఎస్టీ అమలు వల్ల కలిగే అదనపు పన్ను భారాన్ని మోయడానికి తగిన మార్గాలు అన్వేషిస్తున్నారు’ అని నైట్ ఫ్రాంక్ చీఫ్ ఎకనమిస్ట్, నేషనల్ డైరెక్టర్ సమంతక్ దాస్ తెలిపారు. కాగా రియల్ ఎస్టేట్‌పై పన్ను జీఎస్టీకి ముందు 6–7 శాతంగా ఉంటే.. జీఎస్టీ తర్వాత 12 శాతంగా ఉంది. -
‘రియల్’ ట్రంప్ కార్డ్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌తో తలపడుతున్న డొనాల్డ్ ట్రంప్ పేరు గత కొన్ని నెలలుగా మార్మోగిపోతోంది.. అయితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టకముందే.. ఆయన మన దేశంలో అడుగుపెట్టేశారు. ఆ విషయం మీకు తెలుసా? అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు ఎగరేసుకుపోతున్నారంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా విమర్శించిన ట్రంప్.. మన దేశంలో వ్యాపార అవకాశాలను తన్నుకుపోవడంలో మాత్రం ముందుంటున్నారు. ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ముంబై, పుణేల్లో అత్యంత విలాసవంతమైన అకాశహర్మ్యాలను నిర్మిస్తోంది. అవి కూడా అత్యంత సంపన్నుల కోసం మాత్రమే. ముంబైలో నిర్మిస్తున్న 75 అంతస్తుల ఆకాశహర్మ్యం ‘ట్రంప్ టవర్’ తాలూకు ఊహాచిత్రమే ఇది. రెండేళ్లుగా దీని పనులు కొనసాగుతున్నాయి. రపంచంలో తన కంపెనీ ఎక్కడ ఆకాశహర్మ్యాలు కట్టినా.. దానిపై ట్రంప్ టవర్ అని చెక్కించుకోవడం ఆయనకు అలవాటు. ఇక్కడా అలాగే చేయనున్నారు. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆకాశహర్మ్యంలో వాటర్‌ఫాల్స్, స్విమ్మింగ్‌పూల్, స్పాలు వంటి విలాసవంతమైన సౌకర్యాలతోపాటు సొంత క్రికెట్ మైదానం, అథ్లెటిక్ ట్రాక్ కూడా ఉంటుందట. అంతేకాదు.. తన అపార్టుమెంట్లో ఉన్నవారికి ఉచిత ప్రైవేటు జెట్ రైడ్స్‌ను కూడా అందిస్తారట. భారత్‌లో ఇలాంటి సదుపాయం మరెక్కడా లేదని చెబుతున్నారు. ఏడు అంచెల భద్రత వ్యవస్థ ఉండే ఈ ఆకాశహర్మ్యం నిర్మాణ పనులను లోథా గ్రూపు చేపడుతోంది. 2018లో నిర్మాణం పూర్తవుతుంది. మొత్తం 400 ఫ్లాట్స్ ఉంటాయి. త్రీ బెడ్రూం ఫ్లాట్ ధర రూ.9.1 కోట్లు కాగా.. ఐదు బెడ్రూంల ఫ్లాట్ ధర రూ.10.5 కోట్లు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేశారని చెబుతున్నారు. త్వరలో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గోవాలోనూ ట్రంప్ టవర్స్ నిర్మించాలని డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారట. -
బోర్డు తిప్పేసిన కోమలి రియల్ ఎస్టేట్
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కోమలి రియల్ ఎస్టేట్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 50 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి ఇప్పుడు కాస్తా అందరికీ టోపీ పెట్టేసింది. రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ సంస్థకు విశాఖపట్నం, తూర్పుగోదవరి జిల్లాలలో బ్రాంచీలు ఉన్నాయి. సంస్థ చేసిన మోసం తెలియడంతో ఇన్నాళ్లుగా ఈ సంస్థలో ఏజెంటుగా పనిచేసిన సోమరాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.