కేపీహెచ్‌బీకాలనీ: జయత్రి ఇన్‌ఫ్రా కంపెనీ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఫ్రీ లాంచ్ పేరుతో పలువురి నుంచి రూ.కోట్లలో దండుకుని మొహం చాటేయటంతో బాధితులు పోలీసుస్టేషన్‌కు క్యూ కడుతున్నారు. దాదాపు రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించిన వారి వివరాలను బట్టి తెలుస్తుండగా, రూ.100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. మీడియాలో వస్తున్న కధనాలను చూసి బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
కాగా, 2020 నుంచి ఆకర్షణీయమైన ప్రాజెక్టుల పేరుతో, వివిధ సంస్థల పేరుతో రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు. వినియోగదారులకు ఇస్తానన్న ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్‌ల ఫ్లాట్లు ఇవ్వక పోవటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల ఫిర్యాదుతో బుధవారం సంస్థ ఎండి కాకర్ల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో చెల్లించిన పలువురు గురువారం కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజులోని జయత్రి రిలయబిలిటి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే కార్యాలయం మూసి ఉండటంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
మరో 15 మంది ఫిర్యాదు..
కేపీహెచ్‌బీ కాలనీలో కార్యాలయం మూసివేసి ఉండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమతో డబ్బులు కట్టించిన సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లకు ఫోన్ చేస్తే కొందరు లిఫ్ట్ చేయడం లేదని, మరి కొందరు తాము జయతి సంస్థలో ఉద్యోగం మానేశామని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మరో 15 మంది బాధితులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిజాంపేట్, చందానగర్, సర్ధార్‌పటేల్ నగర్, అమీన్‌పూర్‌లలో అపార్టుమెంట్‌లు నిరి్మస్తున్నట్లు నమ్మిస్తూ భూ యజమానులతో సంతకాలు, అగ్రిమెంట్ పత్రాలు చూపించటంతో ఫ్రీ లాంచ్‌లో తక్కువకు వస్తుందని కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు మొదలు 1.5 కోట్లు డబ్బులు కట్టించుకుని ఫ్లాట్‌లు ఇవ్వకుండా మొహం చాటేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇతర సంస్థల్లో పెట్టుబడులు..
జయత్రి రిలియబిలిటీ సంస్థతో పాటు గడిచిన రెండున్నరేళ్ల కాలంలో పదుల సంఖ్యలో ఇన్‌ఫ్రా, మైనింగ్, రిసార్ట్స్ సంస్థలను ఏర్పాటు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును భూముల కొనుగోలు, మైనింగ్‌లలో పెట్టుబడులు పెట్టి ఉంటారని బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఆధారాలతో వస్తే కేసులు నమోదు చేస్తాం..
జయత్రి సంస్థ బాధితుల ఎవరైనా సరే డబ్బులు చెల్లించి మోసపోయినట్లు ఆధారాలతో వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. బుధవారం వరకు 8 మంది ఫిర్యాదు చేయగా నిందితుడు కాకర్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. గురువారం కొందరు బాధితులు వచ్చారు. డబ్బులు ఇచి్చనట్లుగా రశీదులు, అగ్రిమెంట్‌లు వంటి ఆధారాలు తీసుకువచ్చి నిరి్థష్టమైన ఫిర్యాదులు ఇవ్వాలని సూచించాం.
– కిషన్ కుమార్, సీఐ, కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్
Comments
Please login to add a commentAdd a comment