పాన్‌ కార్డుకు కొత్త రూపు.. | Govt issuing new-look and tamper-proof PAN cards | Sakshi
Sakshi News home page

పాన్‌ కార్డుకు కొత్త రూపు..

Published Sat, Jan 14 2017 5:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

పాన్‌ కార్డుకు కొత్త రూపు..

పాన్‌ కార్డుకు కొత్త రూపు..

మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లతో జారీ
ముంబై: పాన్‌ కార్డు కొత్త రూపు సంతరించుకుంది. మరిన్ని భద్రతాపరమైన సదుపాయాలతో దెబ్బతినకుండా ఉండే, వివరాలను తారుమారు చేయడానికి వీల్లేని కార్డుల జారీని ప్రభుత్వం ప్రారంభించింది. ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లోనూ ‘పాన్‌ కార్డు అని రాసి ఉన్న’ కొత్త తరహా కార్డులను జారీ చేస్తున్నట్టు ఆదాయపన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. వీటిని లోపరహితంగా రూపొందించినట్టు చెప్పారు.

ఎన్‌ఎస్‌డీఎల్, యూటీఐఐటీఎస్‌ఎల్‌ జవనరి 1 నుంచే పంపిణీ చేయడం ప్రారంభించాయని... కొత్తగా పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వీటిని జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే పాన్‌ కార్డు కలిగిన వారు కొత్త కార్డు తీసుకోవాలని కోరుకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం దని సూచించారు. ఈ కార్డులకు ప్రభుత్వం కొత్తగా క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ను చేర్చింది. దీంతో తనిఖీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయవచ్చు. ఈ కోడ్‌ సాయంతో కార్డు దారుల వివరాలను అధికారులు వేగంగా తెలుసుకోవడం వీలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement