సాక్షి, ఉండవల్లి : ఒకప్పుడు కత్తులు పట్టుకుని తిరిగిన నేరగాళ్లు ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లు పట్టుకుని తిరుగుతాన్నరని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నివాసంలో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ నుంచి గ్రామ పంచాయితీల వరకూ ఈ- ఆఫీసులను ఉపయోగించడం ద్వారా త్వరితగతిన పనులు పూర్తవడానికి అవకాశం ఉంటుందన్నారు.
సాంకేతిక వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. డేటా చౌర్యం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 58 శాతం మేర ఐటీ ప్రోడక్టులు మాల్ వేర్‌కు గురవుతున్నాయన్నారు. స్మార్ట్ ఫోన్‌లు వాడేవారు ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు ఉపయోగించేటపుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు...లోకేశ్‌పై ప్రశంసలు కురిపించారు. లోకేశ్ ఐటీ డిగ్రీ పరిజ్ఞానం ఇప్పుడు తన మంత్రిత్వ శాఖకు ఉపయోగపడిందని అన్నారు. తాను సాంకేతికపరమైన వ్యక్తిని కాదని, లీడర్‌ను మాత్రమే అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment