సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. భారీ నష్టాల్లోంచి భారీగా ఎగిసాయి. ఆరంభంలోనే 400 పాయింట్టలకుపైగా క్షీణించిన సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లు పుంజుకుని తిరిగి30వేల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ 9వేల ఎగువకు చేరింది. ముఖ్యంగాబ్యాంకింగ్ షేర్లలో భారీ రికవరీతో నిఫ్టీ బ్యాంకు 900 పాయింట్లకు పైగా ఎగిసింది. ఫార్మ,ఆటో, మెటల్, కన్స్యూమర్ గూడ్స్ రంగాల షేర్లలో లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 932 పాయింట్లు ఎగిసి 30982 వద్ద, నిఫ్టీ 265 పాయింట్ల లాభంతో 9057 వద్ద కొనసాగుతోంది. గెయిల్, మహీంద్రా అండ్ మహీంద్రా, వేదాంత, యాక్సిస్ బ్యాంక్ , హిందూస్తాన్ యూనిలీవర్ భారీగా లాభపడుతుండగా, టీసీఎస్, ఐటీసీ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment