సాక్షి, ముంబై: ఈ వారాంతంలో స్టాక్‌మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉన్నట్టుండి పాతాళానికి పడిపోవడం.. తిరిగి భారీ రికవరీ సాధించడం కేవలం నిమిషాల్లోనే జరిగిపోయింది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఒకరోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే ప్రథమమని ఎనలిస్టులు పేర్కొన్నారు. చివరికి సెన్సెక్స్280 పాయింట్లు క్షీణించి 36,841 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు నష్టంతో11,143వద్ద ముగిసింది.
లిక్విడిటీ ఆందోళనలు ఊపందుకోవడంతో ప్రధానంగా ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 1127 పాయింట్లకుపైగా కుప్పకూలి 36,000 మైలురాయి దిగువకు చేరింది. ఇక నిఫ్టీ సైతం 367 పాయింట్లు పతనమై11,000 పాయింట్ల మార్క్ దిగువనకు చేరింది. అయితే డే కనిష్టం నుంచి కీలక సూచీలు కోలుకున్నాయి. ముఖ‍్యంగా రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో, ఐటీ రంగాలు నష్టాల్లో ముగిశాయి.
దివాన్ హౌసింగ్,ఎస్‌బ్యాంకు, డియాబుల్స్ హౌసింగ్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్స్, గృహ ఫైనాన్స్, ఎల్‌ఐసీ హౌసింగ్, రియలన్స్ హోమ్ ఫైనాన్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్, రెప్కో హోమ్, శ్రేఈ ఇన్‌ఫ్రా, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్, కేన్‌ఫిన్ హోమ్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. ఇంకా యూపీఎల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ భారీగానే నష్టపోయాయి. అయితే ఐవోసీ, హిందాల్కో, ఐటీసీ, బీపీసీఎల్, గెయిల్, ఆర్‌ఐఎల్, హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఇన్‌ఫ్రాటెల్ లాభాల్లో ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment